మునుగోడులో మత ఘర్షణలు సృష్టించి బీజేపీపై నెపం నెట్టే కుట్ర

-బూతు యూనివర్సిటీ కి వీసీ, డీన్ అన్నీ టీఆర్ఎస్ నేతలే
-బండి సంజయ్ ఎంట్రీతో ప్రత్యర్థి పార్టీలకు వెన్నులో వణుకు పుట్టింది
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మునుగోడులో ప్రచారానికి అడుగుపెట్టగానే టిఆర్ఎస్ వర్గాల్లో వణుకు పుడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. బండి సంజయ్ ప్రచారంలో అడుగుపెట్టగానే తమ ఓటమి తప్పదు అన్న భయంతోనే టిఆర్ఎస్ సంజయ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆయన ఆరోపించారు. అప్పుడే ఏమైందని, ముసళ్ళ పండగ ముందుంది అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల నిబంధనలకు లోబడే సంజయ్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

బూతు యూనివర్సిటీ కి వీసీ, డీన్ అన్నీ టీఆర్ఎస్ నేతలే అని సంగప్ప అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంజయ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు టిఆర్ఎస్ దగ్గర సమాధానం లేదని, అందుకే ఆయనను ప్రచారానికి రాకుండా అడ్డుకునేందుకు టిఆర్ఎస్ కుట్ర చేసింది అని సంగప్ప అన్నారు. అంతేకాకుండా మునుగొడులో టీఆర్ఎస్ మత ఘర్షణలు సృష్టించి బీజేపీ పై నెపం నెట్టే కుట్ర చేస్తోందని సంగప్ప విమర్శించారు. రజాకార్ల పార్టీని చంకలో పెట్టుకుని తిరుగుతున్న టీఆరెస్ మాత్రమే అలాంటి ఆలోచనలు చేయగలదని ఆయన అన్నారు. బీజేపీ అధికారం లో ఉన్న 18 రాష్ట్రాల్లో ఒక్క ఘర్షణ జరగలేదని సంగప్ప గుర్తు చేశారు.

స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఎనిమిది చిహ్నాలను తొలగించాలని టిఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా అక్కడ తిరస్కరణకు గురైందని, హైకోర్టు పిటీషన్ కొట్టేయడంతో బిజెపి పై ఎడుస్తున్నారని సంగప్ప అన్నారు. ఆ ఎనిమిది ఎన్నికల గుర్తులు టిఆర్ఎస్ పుట్టక ముందు నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తొలగించాలని కోరడం అర్ధరహితం అని హైకోర్టు టిఆర్ఎస్ పిటిషన్ను కొట్టేసిందని ఆయన చెప్పారు. 20 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని సంగప్ప ప్రశ్నించారు. ముగోడులో తమ ఓటమి ఖాయమని టిఆర్ఎస్ నిర్ణయానికి వచ్చిందని, ఏదో ఒక వంక పెట్టి బండి సంజయ్ ను మునుగోడు రాకుండా అడ్డుకోవాలని, లేకుంటే ఏకంగా ఎన్నికనే వాయిదా వేయాలని టిఆర్ఎస్ కుతంత్రం పన్నుతుందని సంగప్ప విమర్శించారు.

మునుగోడు ప్రజలకి టిఆర్ఎస్ టక్కుటమార విద్యలన్నీ అర్థమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందుకే బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని మునుగోడు ఓటర్లు నిర్ణయించుకున్నారని సంగప్ప జోస్యం చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యల్ని సంగప్ప ఖండించారు. మంత్రి మతి భ్రమించి అవాకులు చాకులు పేలుతున్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ గ్రామాలకు ఇస్తున్న నిధులు, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర గురించి చెప్పుకునే తాము ఓటు అడుగుతున్నామని, టిఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా చేసిన మోసాన్ని కుడాచెబుతున్నామని సంగప్ప చెప్పారు. అన్ని సర్వేలు టీఆరెస్ ఓడిపోతుందనే చెబుతున్నాయని సంగప్ప అన్నారు. అందుకే ఓటమి భయంతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మకాం వేశారని సంగప్ప అన్నారు. బండి సంజయ్ ప్రచారంతో భయమేసి మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వచ్చారని ఆయన విమర్శించారు.