– ముమ్మాటికీ తన స్వప్రయోజనాలు..రాజకీయ ప్రయోజనాల్లో భాగమే
• అధికారంలోకి వచ్చినపపటినుంచీ కృష్ణాజలాల కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కంటితుడుపు చర్యగా కూడా కేంద్రానికి లేఖరాయని జగన్ రెడ్డి..హఠాత్తుగా రైతులకోసమే దండయాత్ర చేశానని చెప్పడం ప్రజల్ని మోసగించడమే
• రాష్ట్ర నీటిహక్కులు కాపాడాలనే తపన.. తాపత్రయం నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డిలో ఏ కోశానా కనిపించలేదు
• డెల్టా రైతాంగం నీళ్లులేక రోడ్లెక్కి ఆందోళనలు చేసినా… చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టినప్పుడు జగన్ రెడ్డి స్పందించలేదు
• వరికపూడిశెల ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు పల్నాడులో ఎండిన పత్తిచేలు జగన్ కు కనిపించలేదు
• ఎన్నికల సమయంలో జగన్ నీటివివాదం రాజేయడం విడిపోయినా కలిసుంటున్న తెలుగువారి మధ్య చిచ్చురేపడంలో భాగమా?
• సమసిపోయిన ప్రాంతీయ విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకున్న తన రాజకీయప్రయోజనాల్లో భాగమో జగన్ రెడ్డే సమాధానం చెప్పాలి
– మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
నాగార్జున సాగర్ పై వందలాది పోలీసులతో జగన్ రెడ్డి చేయించిన దండయాత్ర రాష్ట్ర ప్రయోజనాలకోసమా… తన రాజకీయ స్వప్రయోజనాలకోసమా అని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డెల్టా రైతాంగం నీళ్లులేక రోడ్లెక్కి ఆందోళనలు చేసినా… చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టినా నోరు మెదపని జగన్ రెడ్డి… నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో తొలిసారి 7లక్షల ఎకరాలు బీడు పడినా స్పందించని జగన్ రెడ్డి… రైతులు కన్నీళ్లతో నీళ్లు ఇవ్వమని వేడుకున్నా కనికరించని కసాయి ముఖ్యమంత్రి, తెలంగాణలో ఎన్నికలు జరిగే ముందు రోజు .. రాత్రికి రాత్రి తన పోలీసుసైనాన్ని సాగర్ డ్యామ్ పైకి పంపి వీరంగం వేయించడం ఎంతటి దిగజారుడుతనమో ప్రజలే ఆలోచించాలన్నారు. నరేంద్ర విలేకరులతో మాట్లాడిన వివరాలు..ఆయన మాటల్లోనే …
“నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే…29 అర్థరాత్రి జగన్ రెడ్డి తన జగన్నాటకానికి తెరతీశాడు. పల్నాడు జిల్లాలోని వెల్దుర్తిలో జగన్ రెడ్డి వరికె పూడిశెల ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయడానికి వెళ్లినప్పుడు.. ఆ ప్రాంతంలో ఎండిన పత్తిపంట ఆయనకు కనిపించలేదా? నాగార్జున సాగర్ వివా దాన్ని ఎన్నికల సమయంలో జగన్ రాజేయడం విడిపోయినా కలిసుంటున్న తెలుగువారి మధ్య చిచ్చురేపడంలో భాగమా? సమసిపోయిన ప్రాంతీయ విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టి లబ్ది పొందడంలో భాగమో జగన్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలి.
రాష్ట్ర నీటిహక్కులు కాపాడాలనే తపన.. తాపత్రయం నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డిలో ఏ కోశానా కనిపించలేదు. 23 మంది లోక్ సభ సభ్యుల్ని ఉంచుకొని కూడా ఏనాడూ కేంద్రప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాపై జగన్ రెడ్డి మాట్లాడింది లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకొని ఉంటే.. ఏపీ ప్రభుత్వం తరుపున జగన్ రెడ్డి ఒక్క లేఖ కూడా ఎందుకు కేంద్రానికి రాయలేదు? వాస్తవంగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికోసం ఎన్నోసార్లు శ్రీశైలంలో నీటిని వాడుకుంది.
ఇన్నేళ్లలో ఎన్నిసార్లు జగన్ రెడ్డి తన అభ్యంతరం తెలిపాడు. ఏనాడూ ఒక్క మాట మాట్లాడకుండా.. కనీసం కంటితుడుపు చర్యగా కూడా కేంద్రానికి లేఖరాయని జగన్ రెడ్డి..హఠాత్తుగా ప్రజలకోసం సాగర్ డ్యామ్ పై దండయాత్ర చేశానని చెప్పడం ప్రజల్ని మోసగించడమే. జగన్ రెడ్డికి తన ప్రయోజనాలు.. తన కేసుల మాఫీ తప్ప.. రాష్ట్రప్రయోజనాలు పట్టవనడానికి నాలుగున్నరేళ్లుగా కృష్ణాజలాల విషయంలో అనుసరించిన తీరే నిదర్శనం.
నవంబర్లో ఏపీ ప్రభుత్వం నీటికేటాయింపులు కోరి ఉంటే… దానికి సంబంధించిన లేఖను జగన్ రెడ్డి తక్షణమే బయటపెట్టాలి
కేఆర్ఎంబీ రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టంగా… ఏపీ ప్రభుత్వం 15 టీంఎంసీలను సాగునీటి అవసరాలకోసం అడిగిందని.. దానిలో భాగంగా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు 5 టీఎంసీలకు బదులు 5.016టీఎంసీల నీళ్లు ఇచ్చామని చెప్పారు. నవంబర్ నెలలో నీటిని కేటాయించాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని కూడా కేఆర్ఎంబీ స్పష్టంగా చెప్పింది.
నిజంగా జగన్ ప్రభుత్వం నవంబర్ నెలలో నీటికేటాయింపులు కోరి ఉంటే.. దానికి సంబంధించిన లేఖను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కోరిన మొత్తం 15 టీఎంసీల్లో అక్టోబర్లో 5.. జనవరిలో 5.. ఏప్రియల్ లో 5 టీఎంసీలు ఇవ్వాలని కేఆర్ఎంబీ నిర్ధారణ చేసినా.. జగన్ నీటికోసం దండయాత్ర చేయించాననడం ముమ్మాటికీ ప్రజల్ని మోసగించడమే.
తెలంగాణ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్లో…ఒక్క లేఖను కూడా జగన్ ఎందుకు ఇవ్వలేదు? నిజంగా ప్రజలపై.. రాష్ట్రంపై జగన్ రెడ్డికి ప్రేమే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదు?
కేంద్రప్రభుత్వం తెలంగాణ.. ఏపీల మధ్య నీటి కేటాయింపులపై పున:సమీక్ష చేయాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ను ఆదేశించడానికి కారణం జగన్ రెడ్డి చేత గానితనం కాదా? గతంలో బచావత్ ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ..తెలంగాణ రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా నీటికేటాయింపులు చేసింది వాస్తవం కాదా? ఆనాడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనే ఈ కేటాయింపులు జరిగాయి. ఆనాడు జరిగిన నీటి కేటాయింపులకు ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం తర్వాత జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక నీటికేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగింద ని సుప్రీంకోర్టుకు వెళ్లింది నిజం కాదా?
చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన నీటికేటాయింపులకు అంగీకారం తెలిపిన తెలంగాణ సీఎం.. తరువాత ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాడో.. జగన్ రెడ్డికి తెలియదా? తెలంగాణ వాదనపై రెండో అపెక్స్ కౌన్సిల్లో ఏపీప్రభుత్వం గానీ.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గానీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? నాలుగున్నరేళ్లలో అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ..ఒక్క లేఖను కూడా జగన్ ఎందుకు ఇవ్వలేదు? నిజంగా ప్రజలపై.. రాష్ట్రంపై జగన్ రెడ్డికి ప్రేమే ఉంటే.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదు?
రాష్ట్ర నీటి హక్కుల్ని.. రైతాంగం ప్రయోజనాల్ని జగన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నిజంగా జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇరురాష్ట్రాల నీటికేటాయింపులపై పున:సమీక్షకు సంబం ధించిన నోటిఫికేషన్ వచ్చాక కోర్టుకు వెళ్లడమేంటి? అసలు అలాంటి చర్చవచ్చినప్పుడే రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి తన అభ్యంతరం ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నిస్తున్నాం. పలుమార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జగన్ రెడ్డి.. నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతు న్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు.
రాష్ట్రానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై జగన్ రెడ్డి ఏనాడూ ఎందుకు నోరుమెదపలేదు? అనేక సందర్భాల్లో ఏమీ పట్టనట్టు మౌనంగా ఉన్న జగన్ రెడ్డి.. కావాలనే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో జగన్నాటకం మొదలెట్టాడు.
రాష్ట్ర రైతాంగం తనను.. తనప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధమైందని తెలిసే… జగన్ రెడ్డి అర్థరాత్రి ప్రాజెక్టులపై డ్రామాలు మొదలుపెట్టాడు
జగన్ రెడ్డి తమకు తీరని అన్యాయం చేశాడని ఏపీ రైతాంగం గ్రహించింది. రైతులు తనను.. తనప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించే… జగన్ రెడ్డి అర్థరాత్రి డ్రామాలకు తెరలేపాడు. అవుకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోయి నా రహస్యంగా టన్నెల్ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాడు. నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డి ఇరిగేషన్ రంగానికి చేసిన ఖర్చు… చంద్రబాబు హయాంలో పెట్టిన ఖర్చుతో పోలిస్తే దిగదుడుపే. చంద్రబాబు ఐదేళ్లలో రూ.68 వేలకోట్లు ఖర్చు పెడితే.. జగన్ రెడ్డి 4ఏళ్ల8నెలల్లో 32వేలకోట్లు మాత్రమే ఖర్చుపెట్టాడు.
జగన్ రెడ్డి నిజంగా రైతులకోసం.. రాష్ట్రంకోసం పనిచేసే వ్యక్తే అయితే.. చంద్రబాబు కంటే ఒక్కరూపాయి అయినా ఎక్కువ ఎందుకు ఖర్చుపెట్టలేదు? జగన్ రెడ్డి సాగు నీటి రంగానికి పెట్టినట్టు చెబుతున్న ఖర్చులో వాస్తవంగా ప్రాజెక్టుల నిర్మా ణానికి వెచ్చించింది అరకొరే. రాష్ట్రంలో తలెత్తిన తీవ్ర దుర్భిక్షానికి కారణం జగన్ రెడ్డి కాదా? 490 మండలాలు తీవ్రదుర్భిక్షంలో ఉంటే.. రైతులు పంటలు వేసి తీవ్రంగా నష్టపోతే జగన్ రెడ్డి పైసా కూడా ఆర్థిక సహాయం చేయకపోవడం దారుణం కాదా? జగన్ రెడ్డి ఇసుక దోపిడీకి ఏకంగా ప్రాజెక్టులే కొట్టుకుపోయింది నిజం కాదా?” అని నరేంద్ర ప్రశ్నించారు.