Suryaa.co.in

Andhra Pradesh

అది హత్య కాదు…పక్కా ప్లానింగ్

– వైయస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉంది
– శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి
వైయస్ వివేకా హత్యను సాధారణ మృతి కింద చూపించాలని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మరియు అతని బంధువర్గం ఎంతో ప్రయత్నించారని, చివరకు చంద్రబాబు హత్య చేయించాడని‌ మాట మార్చారని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం పాత్రికేయుల సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు.
గొడ్డలి పోటు వెనుక ఉన్నది ఎవరు? ఇంటి దోంగలు,కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని కేసుని పక్కదారి పట్టించిన జగన్ రెడ్డి. ఇప్పుడు కపట నాటకం ఆదుతున్న ముఖ్యమంత్రి జగన్. టి.డి.పి ప్రభుత్వ హయాంలో సి.బి.ఐ ఏంక్వెరి వేశాం. వైఎస్ఆర్ పార్టీ ఆధికారంలోకి వచ్చాక ఏమిపీకారు
దోఘలను నిర్దారించండంలో కూడా విఫలం. కోర్టులో సొంత చెల్లి జగన్ రెడ్డిని నమ్మలేమని చెప్పిన‌ దుస్థితి. ఈ హత్య రాజకీయాలలో నీ పాత్ర ఎంత? ఆస్తి కోసం సోంత బాబాయిని హత్య చేయించిన‌ చరిత్ర నీది. ఆస్తి పంపకాలు, బెంగుళూర్ సెంటిమెంట్స్ వ్యవహరంలో అడ్డుగా ఉన్నడని కుటుంబ సభ్యులను కూడా వదలని జగన్ రెడ్డి.
మీరు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిన ఈరోజు వరకు ఎందుకు చర్యలు చేపట్టాలా? ప్రతిపక్షాల అనచివెత మీద ఉన్న శ్రద్ధ బాబాయి హత్య మీద ఎందుకు లేదు? ఎందుకంటే అందులో మీ కుటుంబ సభ్యుల పూర్తి ప్రమేయం ఉంది కాబట్టి. పరిటాల రవి, మొద్దు శ్రీను, మద్దెల చెరువు సూరి హత్యలో నీ ప్రమేయం లేదా?
అలిపిరిలో చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన ఘటనలో ప్రధాన నిందుతులు అందరూ ఈరోజు నీ పక్కన లేరా? ఎర్ర చందనం స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు, ఇసుక స్మగ్లర్లు, నీ పక్కనే ఉన్నారు. విశాఖపట్నంలో మీపై జరిగిన కోడి కత్తి డ్రామాను అడ్డుపెట్టు కుని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు రక్షణ లేదు అంటూ మాట్లడి అప్పటి అధికార తెలుగుదేశం పై నిందలు వేసిన జగన్. అధికార దుర్వినియోగం చెస్తున్న జగన్ తెలుగు బాషా,తెలుగు వాడి గౌరవాన్ని మంట కలిపిన జగన్.
తక్షణమే సమగ్ర విచారణ జరిపి నేరస్తులను శిక్షించాలని కోరారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తే, మీరు సమావేశంలో మాట్లాడి రాష్ట్రానికి ఏమి సాదించారో చెపాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము,దైర్ఘ్యం మన జగన్ రెడ్డి కి లేదని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి మన జగన్ సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు.

LEAVE A RESPONSE