రేవంత్ రెడ్డి దావోస్ లో తెలంగాణ పరువు తీశారు

– బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి,మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో తెలంగాణ పరువు తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. కోమటిరెడ్డి నిమిషానికో మాట మాట్లాడుతున్నారు. ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్,కెటిఆర్ పట్ల కోమటిరెడ్డి సంస్కారహీనంగా మాట్లాడారు.కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కోవర్టు రాజకీయాలు చేస్తాడు. కాంగ్రెస్ లో ఉండి తన తమ్ముడికి సపోర్ట్ చేశారు.

బిఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ ముత్తాత తరం కాదు. కేసీఆర్ ను ఖతం చేయడానికి చంద్రబాబు,రేవంత్ రెడ్డి కుట్రలు చేశారు. ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారు.కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి.తెలంగాణ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే కుట్ర కాంగ్రెస్ చేస్తుంది.కాంగ్రెస్ సీఎంగా వున్న రేవంత్ రెడ్డి మోడీతో సంబంధాలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాధ్ షిండేలు బయటకు వస్తారు.

బిఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలేదు. కాంగ్రెస్ మంత్రులు పాలనపై దృష్టి పెట్టాలి. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు మిమ్మల్ని చీల్చిచెండాడతారు.ఎవర్ని ఎవరు కూల్చుతారో మోడీని కలిసిన వాళ్ళను అడగండి. ఎన్నికలకు ప్రజలు ఎప్పుడైనా సిద్దంగా వుంటారు.

Leave a Reply