మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైయస్ఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైయస్ఆర్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన వైఎస్… ఒక్క రూపాయికే వైద్యం చేసి, రూపాయి డాక్టర్ గా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి ఎరుగని నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తన పూర్తి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వైఎస్… ఆ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలను చేపట్టారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.
మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ గారు మరియు కుటుంబ సభ్యులు #YSRJayanthi#YSRCPPlenary #FarmersDay pic.twitter.com/nO5HPd37sZ
— YSRCP Digital Media (@YSRCPDMO) July 8, 2022