Suryaa.co.in

Andhra Pradesh

జగన్ సిఎం అయ్యాడు…చెల్లికి కనీసం ఆస్తిలో వాటి ఇవ్వలేడా?

– తెలుగు దేశం వస్తే నే మళ్లీ రోడ్లు
– సిఎం కార్యాలయంలోనే టెక్నాలజీ ద్వారా ఫైళ్లలో అక్రమాలు
– సిఎం పేషీలో అక్రమాలు జరిగితే కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి
– సైకో పోవాలి…సైకిల్ రావాలి
-దేవరపల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చాను.రాష్ట్రంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును ఇప్పుడే చూసి వచ్చాను.పోలవరం పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో సిరులు పండించవచ్చు.పోలవరం అనేది రాష్ట్రానికి వరం….అలాంటి ప్రాజెక్టుకు ఒక దద్దమ్మ, సైకో నాశనం చేశాడు.23 సార్లు పోలవరం లో పర్యటించాను….83 సార్లు రివ్యూలు చేశాను. 72 శాతం పూర్తి చేశాను.

అంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టును జగన్ నాశనం చేశాడు.సాగునీటి రంగానికి జగన్ తీరని ద్రోహం చేశాడు. మన హయాంలో 68 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు పెడితే…జగన్ కేవలం 22 వేల కోట్లు ఖర్చుపెట్టాడు. ఇలా అయితే ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయి. రాష్ట్రంలో జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరు. అన్ని ధరలు పెరిగిపోయాయి. బాదుడే బాదుడు.

నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి….8 సార్లు కరెంట్ చార్జీలుపెరిగాయి. నాడు 5 ఏళ్లు ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదు. మళ్లీ ఆహామీ ఇస్తున్నా అధికారంలోకి వచ్చిన తరవాత కరెంట్ చార్జీలు పెంచను అని హామీ ఇస్తున్నా. కుదిరితే కరెంట్ చార్జీలు తగ్గిస్తా అని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ టిక్కెట్లు రేట్లు పెరిగాయి….ఇంటి పన్నులు పెరిగాయి. జగన్ బటన్ నొక్కాను అంటున్నాడు…మరి తన నొక్కుడు గురించి చెప్పాలి.

రాష్ట్రంలో మందు బాబుల బలహీనతను ఆయుధంగా మార్చకుని జగన్ మద్యం ధరలు పెంచాడు. నాణ్యత లేని మద్యం అమ్ముతున్నాడు.మద్యం షాపుల్లో ఆన్లైన్ చెల్లింపులు లేవు. మద్యం షాపుల్లో డబ్బు తాడేపల్లి కొంపకు పోతుంది. ఈ ప్రాంతంలో ఇసుక అంత ఎటుపోతుంది? ఎందుకు ?జగన్ వచ్చిన తరువాత ఒక్కరికి అయినా ఉద్యోగం వచ్చిందా…ఒక్క డిఎస్సి వచ్చిందా….అందుకే అంతా జాబు రావాలి అంటే బాబు రావాలి అంటున్నరు.

అందుకే యువగళం అనే పథకాన్ని ప్రకటించాను. యువతకు ఉద్యోగాలు కల్పిస్తా…..నెలకు రూ.3 వేలు ఉపాధి కల్పిస్తా. రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ధాన్యం రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రజల కష్టాలు అలోచించి సూపర్ సిక్స్ అనే కార్యక్రమం ప్రకటించాను.

మహిళల కోసం మహా శక్తి అనే పథకం అమలు చేస్తాం. నా జీవితం పేదలకు అంకింత. పేద వాళ్ల జీవితాలు మార్చే వరకు విశ్రమించను. పేదలను పైకి తీసుకువచ్చే పి4 అనే విధానాన్ని అమలు చేస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలి. గోపాలపురంలో యువకుడైన వెంకటరాజుకు అందరూ సహకరించాలి.

రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా…..తెలుగు దేశం వస్తే నే మళ్లీ రోడ్లు. తెలుగు దేశం వస్తే ఆటోమేటిక్ గా అభివృద్ది…..వైసీపీ అంటే ఆటోమేటిక్ గా అవినీతి. వాలంటీర్లు మంచి పనులు చేస్తే అభినందిస్తా….కానీ వ్యక్తి గత వివరాలు తీసుకుంటే మాత్రం సహించేది లేదు. టెక్నాలజీతో ఎంత ఉపయోగం ఉందో…అంత ప్రమాదం ఉంది. సిఎం కార్యాలయంలోనే టెక్నాలజీ ద్వారా ఫైళ్లలో అక్రమాలు చేశారు.

సిఎం పేషీలో అక్రమాలు జరిగితే కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. రేపు జరిగే ఎన్నికలు ఒక పక్క సైకో…మరో పక్క 5 కోట్ల రాష్ట్ర ప్రజలు ఇలాంటి సిఎంను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. పిచ్చి చేష్టలు, తప్పుడు పనులు.కోడికత్తి డ్రామాలు, బాబాయ్ హత్య డ్రామాలు మనం చూశాం. చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వలేని జగన్…మన ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేదు. జగన్ సిఎం అయ్యాడు…చెల్లికి కనీసం ఆస్తి లో వాటి ఇవ్వలేడా… అందుకే చెపుతున్నా…సైకో పోవాలి…సైకిల్ రావాలి.

LEAVE A RESPONSE