Suryaa.co.in

Andhra Pradesh

2.50 లక్షల మంది వాలంటీర్లను రెన్యువల్‌ చేయకుండా జగన్‌ మోసం!

– 7 నెలలకే కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం ఏందీ జగన్ రెడ్డి
• రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసి ఒక్క రూపాయి అభివృద్ధి పనినీ చేయలేదు
• పులివెందులకే నీళ్లు ఇవ్వలేని మీరా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేది
• చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ పథకాలు దశలవారీగా అమలు
– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి

మంగళగిరి: పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలివేస్తోందని… ఏడు నెలలు అధికారం కోల్పోయి ఏం చేయాలో పాలుపోక నేడు ప్రజల ముందుకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని దోపిడి చేసి దేశంలోనే 29 వ స్థానానికి తీసుకెళ్లాడు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రం విడిపోయి అనేక కష్టాల్లో ఉన్నా రాష్ట్రానికి రాజధాని కావాలని సంకల్పించుకొని అప్పటి సీఎం చంద్రబాబు 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు.
పోలవరం ప్రాజెక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగు నీటికి ఎంతో ఉపయోగపడుతుందని ఢిల్లీ చూట్టు పరుగులు పెట్టి 2019 కల్లా 72 శాతం పనులు పూర్తి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని సర్వ నాశనం చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ ను గాలికొలిలేశాడు. అమరావతిలో జరుగుతున్న అనేక నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. సొంత జిల్లా కడపలో ఒక్క నీటి ప్రాజెక్ట్ ను కూడా నిర్మిచలేదు. కనీసం ఒక్క రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయలేదు. పోనీ సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజలకు ఏమైనా చేశావా అంటూ ఐదేళ్ల కాలంలో మంచినీరు లేదని రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చారు.

ఇప్పుడు బయటికి వచ్చి ఈ ప్రభుత్వంపై ఏడు నెలల కాలంలో అప్పులు చేశారని మాట్లాడుతున్నావ్. రూ.12 లక్షల కోట్లు అప్పు చేశావ్. చేసిన అప్పులో ఒక్క రూపాయితో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం చేపట్టావా.? సంక్షేమం పేరుతో దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించావ్. ఈ రూ.12 లక్షల కోట్లపై ముందు జగన్ సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా జగన్ రెడ్డి. పాలనలో కూటమి దూసుకుపోతోంది.

6.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంపద రాష్ట్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పటికే 4.28 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ప్రణాలికలు రచిస్తోంది.

2.50 లక్షల వాలంటీర్ ఉద్యోగాలుపోయాయని ఏడుస్తున్నావ్. ఆగస్టులో వాలంటీర్లను రెన్యువల్ చేయాల్సిన బాధ్యత మీదే. కానీ ఆ పని మీరు చేయలేదు. ఎన్నికల వేల రాజకీయం కోసం వాడుకొని వారి చేత రాజీనామాలు చేయించి… 2.50 లక్షల మంది వాలంటీర్ ఉద్యోగులను రెన్యువల్ చేయకుండా పచ్చి మోసం చేసింది నువ్వు కాదా? అని శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు.

LEAVE A RESPONSE