Suryaa.co.in

Andhra Pradesh

యాజమాన్య, కార్మికుల సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తాం

– సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి వాసంశెట్టి సుభాష్

విజయవాడ: సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు,యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు.

భేటీ లో కార్మికుల సమస్య లు పై మంత్రి వాసంశెట్టి సుభాష్ చర్చించారు. సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యులు పడుతున్న పలు సమస్యలు మంత్రికి ఫ్యాక్టరీ యాజమాన్యలు విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి ప్రభుత్వం హయంలో కార్మికులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE