Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలను జగన్‌ దగా చేశారు

-బీసీలకు జగన్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
-తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్‌

-అందరితో పాటు వారికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు..
-ప్రత్యేకంగా వారి కోసం ఏమైనా అందించారా..
-సబ్‌ప్లాన్స్‌, రుణాలు, సబ్సిడీ పథకాలు రద్దు చేశారు
-ఆయన ఓ గంట కుర్చీలో ఉన్నా నష్టమే

బీసీలకు వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికలపూడి శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. అందరితో పాటు వారికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు.. ప్రత్యేకంగా వారి కోసం ఏమైనా అందించారా అని ప్రశ్నించారు. తిరువూరులో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ పథకాలు 27, బీసీలకు అందించే 30 పథకాలు రద్దు చేశారు..జగన్‌ ప్రభుత్వంలో అధికంగా నష్టపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలేనని మండిపడ్డారు. 1975లో ఈ తరగతుల వారు వెనుక పడ్డారని చట్టం రూపొందించారు.

గతంలో బడుగు బలహీన వర్గాల వారికి టీడీపీ ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేసింది. జగన్మోహన్‌రెడ్డి ఒక గంట అధికారంలో ఉన్నా ఆయా వర్గాలకు నష్టమే… జగన్‌ పాలన వల్ల పేదరికం పెరిగింది, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు, జీతాలు లేవు, కంపెనీలు రావు, రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. జగను బటన్‌ నొక్కితేనే ప్రజలు బతికే విధంగా తయారు చేశారు. రాష్ట్రం విభజన అనంతరం 42 శాతం తెలంగాణ ఉద్యోగు లతో పాటు ఆంధ్ర ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ చంద్రబాబు ఇచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పండుగలకు కానుకలు ఇచ్చారు. తిరువూరులో బీసీ వర్గాలు కూటమికి మద్దతు తెలపడం ఆనందదాయకమని…అభివృద్ధికి సోపానమని కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE