Home » ఓటమి ఖాయమని జగన్‌ కు అర్థమైంది

ఓటమి ఖాయమని జగన్‌ కు అర్థమైంది

-అందుకే దళితులపై నరమేధం సృష్టిస్తున్నాడు
-సెంటిమెంట్‌ పండించి గతంలో ఓట్లేయించుకున్నాడు
-16 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు లాక్కున్నారు
-అరాచకాలపై ఎన్నికల కమిషన్‌ స్పందించాలి
-టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నాడనే సంగతి జగన్‌కు బాగా అర్థమైందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. గత ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో దళితులపై ప్రేమ ఉన్నట్లు వారిలో భ్రమలు కల్పించారు. ఆ భ్రమలో పడి దళితులు ఓట్లు వేయడంతో జగన్‌ గెలిచాడు. జరగబోయే ఎన్నికల్లో దళితులను భయభ్రాంతులకు గురిచేసి వారిపై దాడులు చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారు.

2019 ఎన్నికల్లో దళితులకు, తనకు రక్త సంబంధం ఉన్నట్లు నమ్మించాడు. దళిత పిల్లలకు తను మేనమామ అన్నాడు. జగన్‌ తల్లి, చెల్లిలి చేతిలో బైబిల్‌ ఉంచి వారిచేత ప్రార్థనలు చేయించి సెంటిమెంటల్‌గా వాడుకుని గెలిచాడు. తరువాత దళితులపై దేశంలో ఎక్కడా లేని విధంగా దాడులు చేయించి అవమానాలకు గురిచేసి దళితులపై నరమేథం సృష్టిం చాడు. ఇప్పుడు ఓటమి భయంతోనే దళితులపై దాడులకు వైసీపీ శ్రేణులను పురిగొల్పుతు న్నాడు. స్వాంతత్రానికి పూర్వం దళితులను అంటరానివారిగా చూసిన పద్ధతిని 2019 -24 మధ్య కాలంలో దళితులు భరించాల్సివచ్చింది.

దళితులపై మల, మూత్ర విసర్జన, అంటరా నితనం వంటి దుర్మార్గపు, అవమానకరపు క్రియలన్నీ జగన్‌ పాలనలోనే జరిగాయి. శిరోముం డనం చేసి 27 సంవత్సరాల తరువాత శిక్షకు గురికాబడిన తోటా త్రిమూర్తులును, దళితులను చంపి డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబును అందలమెక్కిస్తూ వారిని కాపాడుతున్న జగన్‌ దళితుల వ్యతిరేకి అని వారికి అర్థమైందన్నారు.

ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి
రాష్ట్రంలో జగన్‌ దాడులను ప్రోత్సహిస్తున్నాడు. నిన్న సత్తెనపల్లిలో మేరి బాబు ఘటన, ఢల్లీిలో శ్రీలక్ష్మి బొటన వేలు నరుక్కుని నిరసన వ్యక్తం చేసిన ఘటనలు చూస్తుంటే దళితులపై జగన్‌ అరాచకాలు ఎలా కొనసాగుతున్నాయో అర్థమవుతోందన్నారు. ఎన్నికల కోడ్‌లోనూ దళితుల మీద దాడులు, హత్యలు ఆగడం లేదని, ఎలక్షన్‌ కమిషన్‌ ఈ విషయంలో చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై దళితులకు నమ్మకం కలిగేలా చేయాలని కోరారు.

దళతులే కాదు బీసీలు, మైనార్టీలపై కూడా దాడుల పరంపర కొనసాగుతుందన్నారు. దళితులకు చెంది న 16 వేల ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్‌ లాక్కున్నారని ఆరోపించారు. జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటన లో ఆయన సభకు జనాలే లేక సభ వెలవెలబోయింది. తన పత్రికల్లో మాత్రం జన సునామీ, జన సంద్రం అని వేసుకుంటున్నారు. బొత్స ఒకపక్క జన సముద్రమైతే మరో పక్క బంగాళాఖా తం సముద్రం కనబడుతోందని మాట్లాడుతున్నాడు. అది సముద్రం కాదు పిల్ల కాలువ అని వ్యాఖ్యానించారు. ప్రజలు చైతన్యవంతులై తిరగబడుతున్నారు…ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Leave a Reply