– అమరావతి రైతులు
అమరావతి: ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలను సీఎం జగన్ మోసం చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు ఆరోపించారు.ఈ నేపథ్యంలో రాజధాని పరిధిలోని గ్రామాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కృష్ణాయపాలెం, తుళ్లూరు శిబిరాల వద్ద నల్ల జెండాలు, బెలూన్లతో నిరసన చేపట్టారు.
ఆర్-5 జోన్ అంశంపై హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణంపై ముందుకెళ్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులంటే జగన్‌కు పట్టింపు లేదని మండిపడ్డారు.
”అమరావతి రైతులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. కోర్టులంటే సీఎం జగన్‌కు పట్టింపు లేదు. రాజధాని రైతులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అమరావతి రైతుల సమాధుల పైనుంచి ఎన్నికులకు వెళ్తున్నారు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..