Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగులు, టీచర్లను జగన్ మోసం చేశారు

-టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం
-లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించిన డీఎస్సీ అభ్యర్థులు

విజయనగరం: ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం శంఖారావం సభలో యువనేత లోకేష్ ను కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. హామీ ఇచ్చిన విధంగా 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించకుండా జగన్ రెడ్డి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా జాబ్ కేలండర్ విడుదల హామీపై మాటతప్పి మడమ తిప్పడంతో పాటు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి జగన్ మోసం చేశారన్నారు.

డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను సావధానంగా విన్న లోకేష్.. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో రెండు డీఎస్సీలు నిర్వహించి పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేశామన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా క్రమపద్ధతిలో జాబ్ నోటిఫికేషన్ లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఈ విషయాన్ని అసెంబ్లీలో స్వయంగా జగన్ అంగీకరించారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల విషయంలో రేషనలైజేషన్ కోసం 117 జీవో విడుదల చేయడం సరికాదన్నారు. పేదవారికి చదువు దగ్గరగా ఉండాలని, టీడీపీ-జనసేన ప్రభుత్వంలో మెరుగైన విద్యను అందిస్తామని తెలిపారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

LEAVE A RESPONSE