Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు

– సైకో సీఎం అమరావతి రైతుల ఉసురు పోసుకున్నాడు
– అమరావతిని విచ్ఛిన్నం చేసిన తుగ్లక్ సీఎం జగన్
– పక్క రాష్ట్రాల దగ్గర రాజధాని కావాలని అడుక్కునే స్థితిలో ఏపీ
– టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట: రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. ఒక్క సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి. రైతుల బతుకు చిత్రం పై తీసిన సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారుతుందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూఅన్నారు. సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమిటని జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు.

ఈ సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భయంతో వైసిపి ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని 34,000 మంది రైతులు త్యాగాలకు వాస్తవ రూపంగా నిలిచింది రాజధాని ఫైల్స్ సినిమా అని వేలమంది రైతుల త్యాగాలను బూడిదలో పోసిన పన్నీరు చేశాడు ఈ సైకో సీఎం అమరావతి రైతుల ఉసురు పోసుకున్నాడు ఈ జగన్ రెడ్డి రాష్ట్రం కోసం ప్రజల కోసం తీసిన సినిమాను ఆ రాష్ట్ర సీఎం అడ్డుకోవడం దారుణమని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసిన తుగ్లక్ సీఎం జగన్ అని మూడు రాజధానుల పేరుతో మోసం చేసిన మూర్ఖుడు జగన్ అన్నారు.

ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలియజేసిన ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చాడని అన్నారు. మడమ తిప్పని నేత ఆంధ్రుల రాజధాని అమరావతి ఎందుకు యూ టర్న్ తీసుకున్నాడో చెప్పాలని అన్నారు.జగన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఇలాంటి విపరీత బుద్ధులు పుట్టాయని తెలుగుదేశం పార్టీకి వస్తున్న మైలేజ్ చూసి ఓర్వలేకే సైకో చేష్టలు చేస్తున్నాడని జగన్ రెడ్డిని ప్రజలందరూ తిప్పికొట్టే పరిస్థితి త్వరలోనే వస్తుందని అన్నారు.

రాజధాని నిర్మించడం వైసిపికి రాదు. నిర్మించిన అనుభవం కూడా లేదు. చంద్రబాబు నాయుడు మహోన్నత పనితనంతో ప్రారంభించిన అమరావతిని కావాలని అడ్డుకున్నారని.. నిన్నటిదాకా మూడు రాజధానులని వైసీపీ నేతలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలి అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. పక్క రాష్ట్రాల దగ్గర రాజధాని కావాలని అడుక్కునే స్థితిలో ఏపీ దిగజారిందని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీని నిలువు దోపిడీ చేసిందిజగన్ అండ్ కో అని అన్నారు.

ఈ ఐదేళ్లలో దోచుకోవడం దాచుకోవడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదని రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని జ్యోతుల నెహ్రూ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, కొత్త కొండబాబు, కన్నబాబు, గాజిగం సత్తిబాబు, కందుల బాబ్జి, దాపర్తి సీతారామయ్య, ఉంగరాల రాము, కుంచే రామకృష్ణ, కంచుమర్తి రాఘవ, ఆకుల కాశీ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE