‘రాజధానిఫైల్స్’ విడుదలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమంగానే ఉన్నాయని కోర్టు చెప్పింది. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న (గురువారం) కోర్టు స్టే విధించింది. మరోసారి శుక్రవారం విచారణకు రాగా… సీఎం, ప్రభుత్వం ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. స్టేను కొనసాగించాలని కోరారు.

అయితే స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని, హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply