Home » చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పోలీస్ వ్యవస్థకే అవమానకరం

చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పోలీస్ వ్యవస్థకే అవమానకరం

– జగన్ రెడ్డి అండ, ప్రోత్సాహంతోనే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రుల హత్యారాజకీయాలు
• గతంలో స్థానికఎన్నికల సమయంలో మాచర్లవెళ్లిన మాపై తన రౌడీలతో దాడిచేయించాడు. ఆ కేసుని డీజీపీ ఏనాడైనా సమీక్షించారా?
• మాపై మారణాయుధాలతో దాడిచేసిన తురకా కిశోర్ ను, మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ ని చేసి, చట్టప్రకారం పనిచేసిన డీఎస్పీని వీ.ఆర్.కు పంపడం పిన్నెల్లి పైశాచిక ఆనందానికి నిదర్శనం
• జగన్ హాయాంలో రాష్ట్రంలో 100మందికి పైగా టీడీపీనేతలు హత్యగావింపబడితే, పల్నాడులో 20మంది బలయ్యారు.
• చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడం పోలీస్ వ్యవస్థకే అవమానకరం
• 2020 మార్చి11న మాచర్లలో మాపై జరిగిన హత్యాయత్నం ఘటనల్లో డీజీపీ ఎన్నికేసులు పెట్టించారు… పుంగనూరుఘటనలో ఎన్ని పెట్టించారు?
• చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న డీజీపీ భవిష్యత్ లో న్యాయవ్యవస్థకు సమాధానం చెప్పక తప్పదు : పారా కిశోర్
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, హైకోర్ట్ న్యాయవాది పారా కిశోర్

జగన్ రెడ్డి దుర్మార్గాలు, దాష్టీకాలు, హత్యారాజకీయాలతో రాష్ట్రం ఎప్పుడో బీహార్ ను తలదన్నిందని, రాష్ట్రాభివృద్ధి.. ప్రజాసంక్షేమంపై చంద్రబాబు ఆలోచిస్తే, ఏపీని ఎలా నా శనంచేయాలి…ప్రజల్ని ఎలా హింసించి, తన ఖజానా నింపుకోవాలని జగన్ ఆలోచిస్తా డని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన న్యాయవాది కిశోర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సహా, కొందరు వైసీపీఎమ్మెల్యేలు.. మంత్రులు మారణహోమంలో పోటీపడుతున్నారు జూలకంటిపై పిన్నెల్లి నిఘా పెట్టాడు
“ జగన్ రెడ్డి అండ, ప్రోత్సాహంతోనే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు హత్యారాజకీయాల్లో పోటీ పడుతున్నారు. వారిలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అలియాస్ పిల్లి రామకృష్ణా రెడ్డి ముందుంటాడు. గతంలో తాను, టీడీపీనేత బొండా ఉమా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు మాచర్ల వెళ్తే, మాపై పిన్నెల్లి తన రౌడీలతో దాడిచేయించాడు. ఎమ్మెల్యే అనుచరుడు తురకా కిశోర్ 200మంది కిరాయిమూకలతో మాపై దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో మాతోపాటు హైకోర్ట్ న్యాయవాది పారా కిశోర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. బీసీ నాయకుడిని అయిన నాపై పెద్ద దుంగలతో దాడిచేశారు.

చంపే యడానికే ఆనాడు పిల్లి రామకృష్ణారెడ్డి మాపై తన రౌడీలతో దాడిచేయించాడు. ఆ రోజు మమ్మల్ని కాపాడి, తన విధినిర్వహణ తాను సక్రమంగా చేశాడన్న అక్కసుతో అక్కడి డీఎస్పీని పిన్నెల్లి వీ.ఆర్.కు పంపించాడు. మాచర్ల టీడీపీ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్రహ్మా నందరెడ్డే లక్ష్యంగా పిల్లి రామకృష్ణారెడ్డి తన కుట్రరాజకీయాలు అమలుచేస్తున్నాడు. పోలీసులతో నిత్యం బ్రహ్మనందరెడ్డి, అతని అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరిపించడం, వారి వాహనాలు తనిఖీ చేయడం, వారి కదలికలపై రెక్కీ నిర్వహించడం చేస్తున్నారు.

గతంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవీంద్రను హతమార్చడానికి ముందు ఇలా నే పరిటాల ఇళ్లు, కార్యాలయాలు, ఆయన అనుచరుల ఇళ్లల్లో పోలీసులతో తనిఖీలు జరిపించాడు. అదే పంథాను ఇప్పుడు మాచర్ల టీడీపీ ఇన్ ఛార్జ్ పై పిన్నెల్లి అనుసరిం చడం పలు అనుమానాలకు తావిస్తోంది. హత్యారాజకీయాలు చేయడం.. దాడులు దుర్మార్గాలకు పాల్పడేలా తన అనుచరుల్ని ప్రోత్సహించడం పిన్నెల్లికి పైశాచిక ఆనం దాన్ని ఇస్తుంది. మాపై దాడిచేసిన తురకా కిశోర్ అనే రౌడీకి రామకృష్ణారెడ్డి తరువాత మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టాడు.

పిన్నెల్లి, జగన్ రెడ్డి రక్తదాహానికి బలైన వారిలో బీసీలే ఎక్కువ
టీడీపీలోని బీసీలే లక్ష్యంగా పిన్నెల్లి హత్యారాజకీయాలు నడిపాడు. తన పదవీ కాంక్షతో టీడీపీకి అండగా నిలిచే బీసీలను దారికి తెచ్చుకోవడానికి వేధింపులు, బెదిరింపులు, దాడులు, తప్పుడుకేసులు, హత్యలే మార్గంగా ఎంచుకున్న పిన్నె ల్లి నాలుగేళ్లలో 10 మందివరకు బీసీలను బలితీసుకున్నాడు.

అమర్నాథ్ గౌడ్, తోటచంద్రయ్య, కంచర్ల జల్లయ్యయాదవ్, షేక్ అలీషా, ఏ.ఖాదర్ బాషా, ఆరెద్దులకోటయ్య, బత్తుల సుబ్బులు, తమ్మిశెట్టి నీలకంఠబాబు, సైదుజాను, పిచ్చయ్యయాదవ్ లను పొట్టనపెట్టుకున్నాడు. వైసీపీప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దారుణాలు ఒకెత్తు అయితే, పల్నాడులో జరిగిన అరాచకాలు మరోఎత్తు. జగన్ రెడ్డి రాష్ట్రంలో 100మందికి పైగా టీడీపీనేతలు, కార్యకర్తలను హతమారిస్తే, పల్నాడులోనే 20మందికిపైగా చంపబడ్డారు.

టీడీపీప్రభుత్వంలో సమర్థతతో పనిచేసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి…నేడు తన విధినిర్వహణను జగన్ రెడ్డి కాళ్లదగ్గర పెట్టడం పోలీస్ వ్యవస్థకే తలవంపులు
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారమదంతో రెచ్చిపోతుంటే డీజీపీ చోద్యం చూడటం బాధాకరం. టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ సీపీగా, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా సమర్థవంతంగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డి, నేడు డీజీపీగా ఉండి తన విధినిర్వహణను జగన్ రెడ్డి కాళ్లదగ్గర పెట్టడం నిజంగా పోలీస్ శాఖకే అవమానకరం. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా చంద్రబాబునాయుడు ఉమ్మడిచిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె వెళ్తున్న సందర్భంలో వైసీపీ గూండాలు, కిరాయిమూకలు ఆయనపై హత్యాయత్నం చేస్తే, తప్పుచేసిన వారిని శిక్షించాల్సిన పోలీస్ శాఖ మాజీముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసుపెట్టడం సిగ్గుచేటు.

నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలో అక్రమమద్యం తరలిస్తున్నవారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులపై వైసీపీ కార్యకర్తలు, అక్కడి వార్డువాలంటీర్లు దాడిచేసి చావగొడితే, సాటిపోలీసులకు అండగా నిలవకుండా, తప్పుచేసిన వారికి వత్తాసుపలకడం ఎలాంటి పోలీసింగో డీజీపీ చెప్పాలి. టీడీపీసహా, ఇతర పార్టీలనేతలు, కార్యకర్తలపై దాడిచేసిన వైసీపీవాళ్లను దగ్గరుండి రక్షిస్తున్న పోలీసులు, ఆఖరికి తమపై దాడిచేస్తున్న వైసీపీవా ళ్లను కూడా ఏమీచేయలేని దుస్థితికి రావడంపై డీజీపీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది.

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. కొల్లి రఘురామిరెడ్డిలాంటి పోలీస్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న తప్పులన్ని లెక్కిస్తున్నాం. ఖాకీ డ్రస్ వేసుకొని కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తల్లా రెచ్చి పోతున్న పోలీసుల జాబితా మొత్తం మా దగ్గరుంది. ఆరునెలల్లో జగన్ రెడ్డి కథ ముగిసి, టీడీపీ శకం ఆరంభమవుతుందని గుర్తుంచుకోండి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ రెడ్డి అండతో రెచ్చిపోతున్న ప్రతి పోలీస్ కు చెప్పాల్సిన పద్ధతిలో బుద్ధిచెబుతాం. మొత్తం పోలీస్ వ్యవస్థను మేం తప్పుపట్టడంలేదు. చట్టాన్ని ఉల్లంఘించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, వైసీపీ కి ఊడిగం చేస్తున్నవారినే మా లిస్ట్ లో పెట్టాం.

చంద్రబాబు శాంతిపరుడు..అనుకుంటున్నారేమో..ఇంతకుముందు చూసిన చంద్రబా బు వేరు, 2024 తర్వాత చూడబోయే చంద్రబాబు వేరని తెలుసుకోండి
చంద్రబాబునాయుడిపై దాడిచేసినా…మరోటిచేసినా ఆయన శాంతిపరుడు మనల్నేమీ చేయడులే అనుకుంటున్నారేమో? అలాంటి పిచ్చిఆలోచనలు మానుకోండి. తనను, తన కుటుంబాన్ని అవమానించిన పిచ్చికుక్కల్ని చంద్రబాబు వదిలేస్తాడు అనుకోవడం భ్రమే. ఇంతకుముందున్న చంద్రబాబు వేరు.. 2024లో ముఖ్యమంత్రి అయ్యాక ఉండే చంద్రబాబు వేరు. ఇప్పుడు జగన్ రెడ్డి విసిరే బిస్కట్లకు ఆశపడి మొరుగుతున్న కుక్కలన్నీ చంద్రబాబు పాలనలో గొంతెత్తలేదేం? తన అధికారానికి మార్గం సుగమం చేసిన తల్లిని, చెల్లినే వాడుకొని వదిలేసిన జగన్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి అధికా రుల్ని కాపాడతాడా?

చంద్రబాబునాయుడు హత్యాయత్నం చేసేవాడే అయితే, ఆయన మమల్ని కట్టడిచేయకుండా స్వేచ్ఛగా వదిలేస్తే, వైసీపీవాళ్లెవరూ రాష్ట్రంలో కనిపిం చరని తెలుసుకోండి. చంద్రబాబు ఇంటిపైకి దాడికెళ్లిన జోగి రమేశ్ కు మంత్రి పదవి ఇవ్వడం, మాచర్ల లో మాపై దాడిచేసి వాడిన మున్సిపల్ ఛైర్మన్ ను చేయడం ఇవన్నీ జగన్ రెడ్డి పైశాచిక ఆనందానికి పరాకాష్టలే. చంద్రబాబుసహా, టీడీపీనేతల్ని ఇబ్బందులు పెట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా, వైసీపీఎమ్మెల్యేలు మంత్రులు, వారికి సహకరిస్తున్న పోలీసుల్ని ఎవర్నీ వదిలిపెట్టం. పోలీసుల్లో కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే అలవెన్సులు ఎందుకు నిలిపేశారని జగన్ రెడ్డిని అడిగే ధైర్యం డీజీపీకి ఉందా? చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి పోలీస్ యూనిఫామ్ వేసుకున్న వైసీపీనేత, అతని ప్రవర్తన, మాటలు పోలీస్ వ్యవస్థకే కళంకం.

నిజమైన హీరో చంద్రబాబే
కార్యకర్తలు, పోలీసుల్ని అడ్డంపెట్టుకొని రోడ్లమీదకు వచ్చి హీరోయిజం చేసేవాళ్లు ఎప్ప టికీ హీరోలు కాలేరు. అధికారం, బలగం, డబ్బుతో పనిలేకుండా గుండెధైర్యంతో, రొమ్ము విరిచి నిలబడేవాడే నిజమైన హీరో. అలాంటి హీరోయిజం చంద్రబాబుకే సాధ్యం . పుంగనూరు సమీపంలో వైసీపీగూండాలు దాడికి యత్నించినా వెనకడుగు వేయకుం డా ముందుకు వెళ్లాడు.. అదీ మానాయకుడు. గతంలోఎన్నోసార్లు ఆయనపై దాడికి యత్నించినా ఎప్పుడూ, ఎక్కడా తొణకలేదు.. బెణకలేదు.” అని వెంకన్న తెలిపారు.

మాచర్లలో టీడీపీనేతలతో పాటు, న్యాయవాదిపై దాడిజరిగితే, ఆ కేసుని డీజీపీ ఏం చేశారు? నాటి ఘటనలో తీవ్రగాయాలపాలై, రక్తంతో తడిచిన నా దుస్తులు లేకుండానే కేసు దర్యాప్తు ముగిస్తారా? పారా కిశోర్
“ 2020 మార్చి 11న మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, బోదిలవీడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే, వారికి అండగా నిలవడా నికి వెళ్లిన టీడీపీనేతలతో పాటు న్యాయపరమైన సహాయంకోసం వెళ్లిన నాపై పిన్నెల్లి గూండాలు పాశవికంగా దాడిచేశారు. స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన టీడీపీ సానుభూతిపరులకు అండగా ఉండటానికి వెళ్లడం మేం చేసినతప్పా? మాపై దాడిచేసి, ఆ దృశ్యాలను వీడియోలు తీసిమరీ స్థానికఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి చూపించారు.

ఆనాడు మాచర్లలో ఎన్ని ఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టింది…నిన్న పుంగనూరులో ఎన్నిఘటనలకు ఎన్నికేసులు పెట్టారో చెప్పం డి. మాపై అతి దారుణంగా దాడిజరిగితే మాచర్ల వచ్చిన డీఐజీ చట్టప్రకారం ఎంతమం దిని శిక్షించాడు? బాధితులమైన మేం అన్నిఆధారాలను ప్రజలముందు, పోలీసుల ముందు పెట్టినా నిందితుల్ని ఎందుకు శిక్షించలేదు? మాచర్ల ఘటనసహా, ఈ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వైసీపీ ముష్కరుల రాక్షసచర్యలపై డీజీపీఏనాడైనా సమీక్షించాడా?

మాచర్లలో మాపై దాడిజరిగినప్పటి రక్తపు మరకల తాలూకా వస్త్రాలు మా వద్దే ఉన్నాయి. అవి లేకుండానే ఈ డీజీపీ, అప్పట్లో అక్కడపనిచేసిన పోలీసులు తూతూమంత్రంగా కేసులు కట్టి మమ అనిపించారు. మాచర్ల ఎమ్మెల్యే, అతనికి తొత్తు గా పనిచేసిన సీఐ భక్తవత్సల రెడ్డి ఎందరో టీడీపీనేతలు, కార్యకర్తల్ని చిత్రహింసలకు గురిచేశారు. భక్తవత్సల రెడ్డి పోలీస్ స్టేషన్లోనే టీడీపీ కార్యకర్తలను దారుణంగా హింసిం చాడు. మాచర్ల నియోజకవర్గం దంగలగుంట గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన బీసీ నేతల్ని ఒకకేసులో ఇరికించిన భక్తవత్సలరెడ్డి, వారిని 16రోజుల పాటు దారుణంగా చావగొట్టాడు.

ఆనాడు బాధితుల్ని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడ కూడా భక్తవత్సల రెడ్డి దాడిచేశాడు. దానికి సంబంధించి సదరు సీఐపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (287/2019)పై డీజీపీ ఏంచర్యలు తీసుకున్నారు? భక్తవత్సల రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఎందరో టీడీపీనేతలు, కార్యకర్తలు ఊళ్లు వదిలివెళ్లిపోయా రు. దానికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? పుంగనూరు ఘటనను డీజీపీ నిస్సిగ్గు గా సమర్థిస్తున్నాడు.

టీడీపీనేతలతోపాటు, న్యాయవాదులపైనా దాడిచేస్తే, ఎవరినీ శిక్షించరా? టీడీపీ కార్యాలయంపై వైసీపీకార్యకర్తలు దాడిచేసినప్పుడు రాంబాబు అనే డీఎస్పీ బయటఉండి కొందరిని ఉసిగొల్పాడు. ఆనాడు జరిగిన దానికి సంబంధించిన ఆధారాలను మేం బయటపెట్టినా, డీజీపీ సదరు డీఎస్పీపై ఎలాంటిచర్యలు తీసుకోలే దు. డీజీపీ తన విధినిర్వహణను విస్మరించి బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటా రు.” అని న్యాయవాది కిశోర్ హెచ్చరించారు.

Leave a Reply