• చంద్రబాబు రెచ్చగొట్టి దౌర్జన్యాలు చేయించేవాడే అయితే జగన్, వైసీపీ రాష్ట్రంలో ఉండేవా సజ్జలా?
• పోలీసుల వైఫల్యం వల్లే ప్రతిపక్షనేత లక్ష్యంగా వైసీపీ మూకలు పేట్రేగిపోయాయి
• పోలీస్ అధికారుల కాల్ డేటా బయటపెడితే, వారిని ఎవరు ఆదేశించారో, ఎక్కడుండి ఆదేశించారో తెలుస్తుంది.
• చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు పోలీస్ వ్యవస్థకే మాయనిమచ్చలు
• అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ కు అంతగా జగన్ రెడ్డి, సజ్జలపై మోజు ఉంటే ఖాకీ దుస్తులుతీసేసి, వారిళ్లలో ఊడిగం చేసుకోవచ్చు
• అసలు జిల్లాలోనే లేనివారిని ముద్దాయిలుగా ఎలా చేర్చారో ఎస్పీ సమాధానం చెప్పాలి?
• బూర్ల మనోహర్ నాయుడు ఘటన జరిగినరోజున నాసిక్ లో ఉంటే, ఆయనపై కేసు పెట్టడం పోలీసుల దిగజారుడుతనం కాదా?
• సజ్జల చెప్పినట్టు నిజంగా చంద్రబాబునాయుడు రెచ్చగొట్టి, దౌర్జన్యాలు చేసేవాడు అయితే జగన్ రెడ్డి, అతని పార్టీ రాష్ట్రంలో ఉండేదా?
– మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
అంగళ్లు, పుంగనూరు సమీపంలో చంద్రబాబుపై జరిగిన దాడిపై క్యాంప్ క్లర్క్ సజ్జల వల్లించిన నీతిసూత్రాలకు, వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగినదానికి ఎక్కడా పొంతన లేదని, నిస్సిగ్గుగా వైసీపీశ్రేణులు, కిరాయిమూకలతో పథకంప్రకారం టీడీపీ అధినేతపై దాడి చేయించింది కాక, దాన్ని సమర్థించుకోవడం ఈ నీతిమాలిన ప్రభుత్వానికే సాధ్య మైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే … టీడీపీ నేతల సంగతి పోలీసులు చూసుకుంటారంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అధికారపార్టీ నేతలకు పోలీస్ వ్యవస్థ ఎంత గా ఊడిగం చేస్తున్నారో చెప్పడానికి సజ్జల మాటలే నిదర్శనం.
ప్రతిపక్షనేతపై దాడిచేస్తుంటే చోద్యంచూసిన పోలీసుల్ని హెచ్చరించక, శభాష్ అని భుజం తట్టాలా సజ్జలా?
రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం నడుస్తోందా..అటవిక రాజ్యం కొనసాగుతోందా? అనంతపురం జిల్లాలో నిన్న వైసీపీనేతలు, స్థానిక వార్డు వాలంటీర్లు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వీరంగం వేసి, మహిళాకానిస్టేబుల్ బట్టలు చింపి దుర్భాషలాడి, ఎస్.ఐ కుర్చీలో కూర్చొని అక్కడిసిబ్బందిపై దౌర్జన్యం చేస్తే నిందితులపై ఒక్క కేసు నమోదుకాలేదు. అధికారపార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక తాడిపత్రిలో సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ అధికారుల సంఘం స్పందించదు. గుడివాడలో విజయ్ కుమార్ అనే సబ్ ఇన్ స్పెక్టర్ వైసీపీనేతల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇలాంటివేవీ సజ్జలకు, డీజీపీకి కనిపించవు. అంగళ్లు సెంటర్లో పోలీసులు వారి పని వారు చేయడం లేదని చంద్రబాబు మైక్ లో హెచ్చరించడం ప్రభుత్వసలహాదారుకి తప్పుగా కనిపించడం సజ్జల మతిలేనితనానికి నిదర్శనం. ప్రతిపక్షనేతపై రాళ్లదాడి జరుగుతుంటే నియంత్రించకుండా చోద్యంచూస్తున్న పోలీసుల్ని మెచ్చుకొని భుజం తట్టాలా అని సజ్జలను ప్రశ్నిస్తున్నాం.
ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో మంత్రిపెద్దిరెడ్డి చేస్తున్న దోపిడీని, రైతులకు జరిగినఅన్యాయాన్ని చంద్రబాబు ప్రశ్నించకూడదా?
అన్నమయ్యజిల్లా ఎస్పీ గంగాధర్ ప్రకటన చూశాక, పోలీస్ శాఖ సిగ్గుతో తలదించు కోవాలి. చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు సందర్శించడానికి వెళ్తే, ఉమ్మడి చిత్తూరుజిల్లా మొలకలచెరువు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్ట్ చూడటానికి వెళ్తే, ఆయనపై దాడిచేయిస్తారా? రాష్ట్రానికి ఆప్రాజెక్ట్ తో ఎలాంటి ఉపయోగం లేకపోయినా, స్థానికరైతులకు దానితో అవసరం లేకపోయినా బలవంతంగా భూము లు తీసుకొని నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ని ప్రతిపక్షనేత చూడకూడదా?
రైతులపక్షాన వారికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని అక్కడి మంత్రి పెద్దిరెడ్డిని నిలదీయకూడదా? జగన్ రెడ్డి కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దోచిపెట్టడానికే వేలకోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి, ప్రాజెక్ట్ పనులు మంత్రిసంస్థకు కట్ట బెట్టింది నిజంకాదా? నిబంధనలకు విరుద్ధం గా, పర్యావరణానికి తూట్లుపొడిచేలా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పై అక్కడిరైతులు ఎన్.జీ.టీని ఆశ్రయిస్తే, రైతుల వాదనలు విని ఎన్.జీ.టీ ప్రభుత్వానికి రూ.100కోట్ల జరిమానా విధించింది నిజంకాదా? దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జగన్ ప్రభుత్వానికి అక్క డకూడా చుక్కెదురైంది వాస్తవంకాదా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్.జీ.టీ ఇచ్చిన తీర్పుని దేశఅత్యున్నతన్యాయస్థానం సమర్థించి, రూ.100కోట్ల జరిమానాలో తక్షణమే రూ.25 కోట్లుచెల్లించాలని ఆదేశించలేదా?
సుప్రీంఆదేశాలతో రూ.25కోట్ల ప్రజలసొమ్ము ని జగన్ సర్కార్ ఎన్.జీ.టీకి చెల్లించి, మంత్రిపెద్దిరెడ్డి సంస్థకు రూపాయి నష్టంలేకుండా చేయలేదా? ఇవన్నీ జరిగాక, స్థానిక రైతులు చంద్రబాబుకి తమ సమస్యలు చెప్పుకు న్నాక, ఆయన ప్రాజెక్ట్ పేరుతో జరిగే పనులు చూడటానికి వెళ్లకూడదు అనే హక్కు జిల్లా ఎస్పీకి ఎక్కడుంది. చంద్రబాబు తమసంస్థ చేస్తున్న నాసిరకం పనులు చూసి, వాటిని రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతాడన్న అక్కసుతోనే వైసీపీమూకల్ని అంగళ్లులో పెద్దిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రిపైకి ఉసిగొల్పింది నిజంకాదా?
మాజీ ముఖ్యమంత్రి వచ్చే దారిలో ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అల్లర్లు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?
చంద్రబాబు పర్యటన ఉందని తెలిసికూడా అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం వైసీపీనేతలకు ఎలా అనుమచ్చింది…వారిని రోడ్లపైకి ఎలా రానిచ్చిందో జిల్లాఎస్పీ సమాధానం చెప్పాలి. మాజీముఖ్యమంత్రి వచ్చేదారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసి, రూట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎస్పీకి లేదా? జగన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే అన్నిపార్టీలనేతల్ని ముందస్తుగా అరెస్ట్ లు చేసి… దుకాణాలు మూయించి… ఆయన వెళ్లేదారిపొడవునా పరదాలు కట్టే పోలీసులకు, టీడీపీఅధినేత పర్యటనలో ఎలా వ్యవహరించారో తెలియదా?
స్థానికపోలీసులు, వైసీపీనాయకత్వం, మంత్రిపెద్దిరెడ్డి కుమ్మక్కై చంద్రబాబుపై దాడిచేయించారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? చంద్రబాబు వస్తున్నాడని తెలిసే అక్కడిపోలీసులు వైసీపీ వాళ్లను బయటకురప్పించి, పెద్దిరెడ్డి మెప్పు కోసం ప్రతిపక్షనేతపై దాడిచేయించారు అనడానికి, ఆ రోజు జరిగిన పరిణామాలే నిదర్శనం. ప్రజలు.. మాలాంటి ప్రజా ప్రతినిధులు పోలీసులకు గౌరవం ఇచ్చేది వారు వేసుకున్న ఖాకీ దుస్తులకే కానీ వారికి కాదు. అలాంటి యూనిఫామ్ ను, పోలీస్ మాన్యువల్ ను పక్కనపెట్టి వైసీపీకి, జగన్ రెడ్డికి ఊడిగంచేసే వాళ్లను ఏమనాలి? అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఆ వృత్తిలో కొనసాగే అర్హతలేదు.
అంగళ్లు సెంటర్లో జరిగిన విధ్వంసంలో బాధ్యుల్నిచేస్తూ పోలీసులు రాష్ట్రంలో లేని టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం, ముమ్మాటికీ భయపెట్టి దారికి తెచ్చుకోవడానికే
చంద్రబాబుపై దాడిచేసింది వైసీపీనేతలైతే, పోలీసులు టీడీపీనేతలపై కేసులు పెట్టారు. అంగళ్లు సెంటర్లో అంత విధ్వంసకాండ జరిగితే దానిలో ఒక్క వైసీపీకార్యకర్త కూడా ఎందుకు లేడో ఎస్పీ సమాధానం చెప్పాలి. జరిగిన ఘటనతో సంబంధంలేనివారిని కావాలనే పోలీసులు కేసుల్లో ఇరికిస్తున్నారు. ఎవరో దారినపోయే వైసీపీకార్యకర్త గుర్తిం చాడని చెబుతూ అతని స్టేట్ మెంట్ ఆధారంగా అసలు జిల్లాలో లేని కొందరు టీడీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. బూర్ల మనోహర్ నాయుడుని 20 వ ముద్దాయిగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ లో చేర్చారు.
ఘటన జరిగిన నాడు ఆయన నాసిక్ లో తన కొడుకుపాల్గొన్న మిలటరీ పరేడ్ లో ఉన్నాడు. ఇంతగొప్పగా కేసులు నమోదుచేసిన పోలీసుల్ని ఏమనాలి? చంద్రబాబుపై జరిగిన దాడిఘటనను అడ్డం పెట్టుకొని, సంబంధంలేని వారిపై తప్పుడు కేసులు నమోదుచేసి వారిని వేధించి, భయపెట్టాలన్నదే ప్రభుత్వ పన్నాగమని అర్థమవుతోంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉండే టీడీపీనేతలు, కార్యకర్తల్ని భయపెట్టడానికే పోలీ సులు అడ్డగోలుగా కేసులు నమోదుచేశారు. ఈ విధంగా కేసులు నమోదుచేయడంపై అన్నమయ్య, చిత్తూరుజిల్లాల ఎస్పీలు ఏం సమాధానం చెబుతారు? ఇద్దరు ఎస్పీలు వారి పనితీరు, ప్రవర్తనతో డిజ్ గ్రేస్ టూ ది పోలీస్ సిస్టమ్ అనిపించుకున్నారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీకి జగన్ రెడ్డి, సజ్జలపై అంతమోజే ఉంటే ఖాకీ డ్రస్ తీసేసి, వారిళ్లలో ఊడిగంచేసుకోవచ్చు
చంద్రబాబునాయుడిపై రాళ్లువేసి, టీడీపీ నేతలు, కార్యకర్తల తలలు పగలగొట్టి, నల్లజెండాలతో విధ్వంసంచేసి, వాహనాలు తగలబెట్టినవారిని వదిలేసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ నిస్సిగ్గుగా ప్రతిపక్షనేతపై హత్యాయత్నం కేసు పెట్టాడు. అన్నమయ్య జిల్లా ఎస్పీ సక్రమంగా, చట్టప్రకారం పనిచేయకపోతే, ఇప్పుడు తాను పెట్టిన అక్రమకేసుల తాలూకా మంటల్లోనే కాలిపోడం ఖాయం.
ఎస్పీకి అంతగా జగన్ రెడ్డిపై, సజ్జలపై మోజు ఉంటే ఖాకీ దుస్తులు తీసేసి వారిళ్లల్లోనే ఊడిగం చేసుకోవచ్చు. ఎప్పుడో 4వ తేదీన ఘటన జరిగితే, దానిపై 8వతేదీన స్థానిక మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఫిర్యాదుచేశా డని నాలుగురోజుల తర్వాత తప్పుడు కేసులు పెడతారా? అధికారం ఉందని, పాలకుల అండ ఉందని రెచ్చిపోతే, ఇంతకింత మూల్యం చెల్లించుకోవడం ఖాయం.
చంద్రబాబుపై జరిగిన దాడి మంత్రి సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కనుసన్న ల్లో అతను దగ్గరుండి చేయించిందే. పోలీస్ అధికారుల కాల్ డేటా బయటపెడితే వాస్త వాలు బయటకొస్తాయి. అంగళ్లు కేంద్రంలో చంద్రబాబుపై దాడిజరిగినప్పుడు, మంత్రిపెద్దిరెడ్డి తమ్ముడు, ఎమ్మె ల్యే ద్వారకానాథ్ రెడ్డి స్థానిక రైస్ మిల్ లో కూర్చొని, దాడికి పథకరచన చేసినట్టు తమవద్ద ఉన్న సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది.
సీ.సీ.కెమెరాల నుంచి చూస్తూ, తన కార్యకర్తలను పర్యవేక్షించాడని అర్థమవుతోంది. టీడీపీనేతలు కొందరు పరిచయం ఉన్న పోలీసులతో మాట్లాడటానికి వెళ్లినప్పుడు, వారే ఎమ్మెల్యే చూస్తున్నాడు.. వెళ్లి పోండి అన్నది నిజంకాదా? చొక్కాలు, ప్యాంట్లు విప్పి రాళ్లతో రోడ్డపైకి వచ్చినవారిని కొట్టి తరిమేయాల్సిన పోలీసులు చూస్తూ నిలబడ్డప్పుడే ఎవరి ఆదేశాలతో ఎవరు చంద్రబాబుపై దాడిచేయించారో అర్థమవుతోంది. పోలీస్ అధికారుల కాల్ డేటా బయట పెడితే అసలు దొంగలెవరో తెలుస్తుంది. ప్రతిపక్షనేతపై వైసీపీమూకల రాళ్లదాడి ము మ్మాటికి పోలీసులు, స్థానిక వైసీపీ పెద్దల సమన్వయంతో, ముందుస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది.
చంద్రబాబు రెచ్చగొట్టి, దౌర్జన్యాలు చేస్తే జగన్ రెడ్డి, వైసీపీ ఉండేవా?
సజ్జల చెప్పినట్టు నిజంగా చంద్రబాబునాయుడు రెచ్చగొట్టి, దౌర్జన్యాలు చేసేవాడు అయితే జగన్ రెడ్డి, అతని పార్టీ రాష్ట్రంలో ఉండేదా? సజ్జల, కొడాలినాని, నోరు పారేసుకుంటున్న మంత్రులు ఇప్పుడు మాట్లాడేవారా? చంద్రబాబు ప్రజస్వామ్య వాది కాబట్టే వైసీపీ కబోదులు కండకావరంతో రెచ్చిపోతున్నారు. ప్రజలు తిరగబడుతుంటే వైసీపీవాళ్లకు అంతిమ దినాలు కళ్లముందు కనిపిస్తున్నాయి.
ప్రజాగ్రహం పెల్లుబికితే జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని కాపాడటం పోలీసులు కాదుకదా.. దేవుడి వల్లకూడా కాదు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు, బీసీ..ఎస్సీ..ఎస్టీలు.. మహిళలపై జరుగుతున్న దాడులపై కుహాన మేథావులు ఎందుకు నోరెత్తడంలేదు? గతంలో చంద్రబాబు, లోకేశ్ లపై చీటికిమాటికి మాట్లాడిన ప్రబుద్ధుల నోళ్లు ఇప్పుడెందుకు పడిపోయాయి?” అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.