-మా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం
-మీరు చొక్కా మడతపెడితే మేం కుర్చీలు మడతపెడతాం
-యువత వద్దకు వెళ్లే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
-నెల్లిమర్ల నియోజకవర్గం రామతీర్థం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్
నెల్లిమర్ల : ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్రప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. చెడు చేస్తే పాతేస్తారు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం చేసినా విజయం సాధించడం ఖాయం. అందుకే ఇక్కడ నుంచే శంఖారావం ప్రారంభించాను. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి దేవాలయంతో పాటు, రామతీర్థం దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన నేల ఈ ప్రాంతం.
ఉత్తరాంధ్రకు వచ్చి జగన్ ఏదో చెబుతున్నారు. వైకాపా నాయకులు చొక్కా చేతులు మడతపెట్టుకుని పోరాటానికి సిద్ధంగా ఉండాలంటున్నారు. ఆ బూమ్ బూమ్ బ్యాచ్ కు చెబుతున్నా.. చేతులు మడతపెట్టుకుంటే ఊరుకునే వారు ఎవరూ లేరు. మీరు చొక్కా మడతపెడితే మేం కుర్చీలు మడతపెడతాం. మా జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టం. మా పార్టీ, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడిస్తే మీరు ఉండరు. మా జోలికి వస్తే నీకు సీటు లేకుండా చేస్తాం. మీరు రెడీనా?
జగన్ రెడ్డిని చూస్తే ప్యాలెస్ లో పిల్లి కనిపిస్తోంది. రాజధాని ఫైల్స్ సినిమా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆ సినిమా చూస్తేనే జగన్ రెడ్డికి భయం. రాజధాని విషయంలో జగన్ రెడ్డి ఎన్నో యు టర్న్ లు తీసుకున్నారు. రాజధానికి కనీసం 30వేల ఎకరాలు కావాలన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం ఇష్టం లేదన్నారు.
రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పి నమ్మించారు. జగన్ రెడ్డి ఓ సైకో. వైకాపాలో ఉన్నవారందరూ సైకోలే. బ్లేడ్ బ్యాచ్ లే. రాజధానికి మద్దతిస్తామని చెప్పి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు. సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఐదేళ్లు ఉండాలని చెబుతున్నారు. సిగ్గుండాలి. ఉన్న రాజధానిని చెడగొడతారు. మీరు రాజధానిని కట్టలేరు. అవకాశం లేని హైదరాబాద్ కావాలంటారా?
యాత్ర-2 సినిమా వైకాపాకు అంతిమయాత్రలా మారింది. రాజధాని ఫైల్స్ సినిమా ఆడుతున్న ధియేటర్ల వద్దకు పోలీసులను పంపారు. ఎంతగా భయపడుతున్నారో చూడండి. ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్ అని జగన్ అంటున్నారు. టైం, డేట్స్ మీరు ఫిక్స్ చేస్తే బూమ్ బూమ్ షాపుల వద్దకు వెళ్లి, వారేం మాట్లాడుతున్నారో విందాం. సాక్షి పేపర్, జగన్, వైకాపా నాయకులు సిద్ధమా?
మద్య ధరలు పెంచడంతో పాటు నాసిరకం బ్రాండ్లతో పేదల ఆరోగ్యాన్ని పాడుచేస్తారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పుడేం చేశారు. అధికారులకే టార్గెట్లు పెట్టి మరీ జె-బ్రాండ్లు అమ్మిస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసి, పెట్రోల్, డీజిల్ ధరలు, చెత్తపన్ను, నిత్యావసర ధరలు పెంచి పేదవారి ఇళ్ళు గుల్లచేస్తున్నారు. ప్రజలు వైసిపికి కరెంట్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
జనానికి సమాదానం చెప్పలేక పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి జగన్. యువత వద్దకు వెళ్లే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? జాబ్ కేలండర్ ఏమైంది? జగన్ ఎక్కడ కనబడతాడా కర్ర తీసుకుని తరిమితరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్ ఏం పనిచేసినా ఓ స్కాం దాగి ఉంటుంది. సెంటు స్థలాల పేరుతో 7వేల కోట్లు కొట్టేశారు. లెవలింగ్ పేరుతో 2200కోట్లు దోచేశారు. టీడీపీ వచ్చిన తర్వాత వడ్డీతో సహా ఆ సొమ్ము కక్కిస్తాం.
జగనన్న ఇళ్లు చేతితో తాకితేనే కూలిపోయే పరిస్థితి ఉంది. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన టెక్నాలజీతో ఇళ్లు కట్టిస్తాం. జగన్ కు భయం పట్టుకుంది. రాత్రి కలలో కూడా చంద్రబాబు కనిపిస్తున్నారు. అందుకే ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపిస్తే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చాయి.
చంద్రబాబు అంటే పోలవరం రేంజ్.. నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. చంద్రబాబు అంటే కియా గుర్తుకువస్తుంది. జగన్ అంటే కోడికత్తి గుర్తుకువస్తుంది. బాబు గారు అంటే అభివృద్ధికి బ్రాండ్, జగన్ రెడ్డి అంటే చంచల్ గూడ జైలుకు బ్రాండ్. ఆయన కుటుంబ జైలు అది. ఆయన బాబాయి భాస్కర్ రెడ్డి కూడా చంచల్ గూడ జైలులోనే ఉన్నారు.
జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న రెడ్ బటన్ తో వంద లాగేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడేబాదుడు, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాదుడే బాదుడు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. నిత్యావసరాల ధరలు పెంచి బాదుడే బాదుడు.
అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, వృద్ధులు రావాల్సిన పెన్షన్ కట్, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సీడీ కూడా కట్. సంక్షేమానికి చిరునామా టీడీపీ. ఆనాడు ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం, రూ.50కే హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు. చంద్రబాబు దీపం పథకం, అన్నదాత సుఖీభవ లాంటి అనేక పథకాలు తీసుకువచ్చారు. దేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
ప్రజలు పడుతున్న కష్టాలు పాదయాత్రలో చూశా. అందుకే బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి ఏడాది డీఎస్సీ భర్తీ చేస్తాం. 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.
స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఏ రోడ్డు, భవనం చూసినా, ఆసుపత్రి, టూరిజం ప్రాజెక్టులు, సాగు-తాగునీటి ప్రాజెక్టులు కట్టాం. భోగాపురానికి భూసేకరణ చేశాం. నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణస్వామి నాయుడు నా దగ్గరకు వచ్చి అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేయించుకున్నారు.
రామతీర్థంలోని రాముడి ఆలయంలో రాముడి విగ్రహం తలనరికివేసింది ఈ ప్రభుత్వం, ఎంతో బాధాకరం. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఆయన కొడుకు మణిదీప్ ఇక్కడ ఉన్న మైన్ లన్నీ కాజేస్తున్నారు. కొండలను పిండేస్తారు, ఇసుకను కూడా వదిలిపెట్టడం లేదు. పేద ప్రజల భూములు కూడా వారి పేర్లపై ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారు. అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.
టీడీపీ-జనసేన వచ్చిన తర్వాత రెండేళ్లలో జెట్టీ ఏర్పాటుచేస్తాం. గతంలో మత్య్సకారులకు పడవలు, వలలు ఇచ్చాం. స్కూటర్లు, ఐస్ బాక్స్ లు ఇచ్చాం. మేం వస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.
తారకరామా రిజర్వాయర్ పూర్తిచేస్తాం. భోగాపురంకు భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తాం. సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ చేస్తాం. మూతపడిన జూట్ మిల్లును తెరిపిస్తాం. పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్లను వంద రోజుల్లో పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తాం. అనంతకు కియా మాదిరిగా ఉత్తరాంధ్రకు పరిశ్రమలు తీసుకుస్తాం. కియా మాదిరిగా సెజ్ ఏర్పాటుచేసి పెద్దపరిశ్రమలు ఏర్పాటుచేసి స్థానికులకే ఉద్యోగులు ఇస్తాం. ఇవన్నీ చేయాలంటే టీడీపీ-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
నేను తప్పు చేయలేదు. మంత్రిగా ఉన్నప్పుడు నేను 1500 ఫైల్స్ క్లియర్ చేశా. ఒక్క ఫైల్ లో తప్పు చేసినట్లు నిరూపించినా రాజకీయాలకే దూరంగా ఉంటానని సవాల్ విసురుతున్నా. అన్న ఎన్టీఆర్, బాబు గారి అంత పేరు రాకపోయినా నేనెప్పుడూ చెడ్డపేరు తీసుకురాను. పట్టుదలతో, క్రమశిక్షణతో పార్టీకోసం పనిచేస్తాను.
ఎవరు పనిచేశారో లేదా నాకు ఫోన్ లో తెలిసిపోతుంది. నా చుట్టూ కాకుండా ప్రజల్లో తిరిగితే.. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. సీనియర్లను, జూనియర్లను గౌరవమిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు కలసికట్టుగా పనిచేయండి.