-లడ్డూలో చేప నూనె, గొడ్డు మాంసం, పంది కొవ్వు…
(మంచాల శ్రీనివాస్)
ఎవ్వడేం రాస్తున్నాడో నాకు తెలియదు… ఏం కూస్తున్నాడో తెలియదు… ఏం సవాళ్లు విసురుతున్నారో తెలియదు… కానీ తిరుమల లడ్డూ కోసం ఉపయోగించే ఇంగ్రెడియెంట్స్ రాను రాను నాసిరకంగా మారుతున్నాయనీ, పెద్ద తలకాయలు అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ దాని నాణ్యతను, పవిత్రతను భ్రష్టుపట్టించారనేది నిజం.
నాసిరకం కాదు, ఏకంగా జంతువుల కొవ్వును కలిపారని సాక్షాత్తూ చంద్రబాబు ఆరోపించాడు… ఏయ్, పిచ్చి రాజకీయాలు చేయకు అని భూమన, సుబ్బారెడ్డి సవాళ్లు విసిరారు… భూమన పిరియడ్ గతంలో, మొన్న తిరుమలను భ్రష్టుపట్టించిందనే విమర్శ చాన్నాళ్లుగా ఉన్నదే… అన్యమతస్తుల బెడద కూడా తనదేనట…
జగన్‌కు ఇవన్నీ అనవసరం కదా… అసలే రాముడి తలను తెగనరికిన వాడినీ పట్టుకోలేక, శిక్షంచలేక… ఉద్దేశపూర్వకమో, నిర్లక్ష్యమో తెలియదు గానీ, అలాంటి సంఘటనలన్నీ అలా అలా గాలికి కొట్టుకుపోయాయి… హిందుత్వ అని దిక్కుమాలిన నినాదాలతో వోట్లు దండుకునే బీజేపీ మోడీకి, అమిత్ షాకు ఏ సోయీ లేకుండా పోయింది… అది మరొక దరిద్రం…
పైగా పిచ్చి జనం కళ్లు గప్పడానికి పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాలు, రిషీకేష్ యాగాలు… ఓ ఆధ్యాత్మిక దరిద్రానందేంద్ర స్వామి తనను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి, నాశనం పట్టించిన తీరు తెలిసిందే కదా… ఇదే రాస్తే కొందరికి కోపమొచ్చింది… చంద్రబాబే ఓ దరిద్ర నాయకుడు, జంతువుల కొవ్వుకు ఆధారాలేవి అని సవాల్ విసిరారు… ముందుగా ఈ డిబేట్ స్టార్ట్ చేశాను కదా, నాకూ సవాళ్లు విసిరారు… (కాస్త పక్కకెళ్లి ఆడుకొండి బ్రదర్స్…)
ఇదుగో… ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టారు…
Fish Oil, Beef tallow, Lard… పదాలకు అర్థం డిక్షనరీల్లో చూసుకొండి… కోట్ల మంది శ్రీవారి భక్తుల్ని జలదరింపుకి, జగన్ మీద ఏవగింపుకి గురిచేసే రిపోర్ట్… ఏడు కొండల జోలికి వెళ్లిన నాన్న గారు అదేదే కొండకు బలయ్యాడు జగన్… నీ మీద ద్వేషంతో చెప్పడం లేదు… రియాలిటీ చెబుతున్నా… ఏకంగా తిరుమల లడ్డూ జోలికి, పవిత్రత జోలికి వెళ్లావని ఈ నెయ్యి రిపోర్టులు చెబుతున్నాయి…
ఎస్, పిచ్చి రాజకీయ విమర్శలు చేస్తే నువ్వే మరో అలిపిరికి గురై మాయమైపోతావ్ అని నేనే ముందుగా చంద్రబాబును హెచ్చరించింది… ఇప్పుడిక నీ వంతు… ఈ రిపోర్టులు నిజం కావని నువ్వు నిరూపించు… నీలాపనిందలు అని నిగ్గుతేల్చు… నీ హయాంలోనే, ప్రత్యేకించి ది గ్రేట్ భూమన అనబడే నాస్తిక శిఖామణి, హిందూ వ్యతిరేకి నేతృత్వంలోనే అన్యమత ఆధిపత్యాలు, తిరుమల పవిత్రతకు అపచారాలు అని అంగీకరిస్తావా..? కోట్లాది మంది మనోభావాల్ని మరీ ఇంతగా భ్రష్టుపట్టించాలా జగన్..?
కాదు, నిజం కాదు, నాన్సెన్స్, చంద్రబాబు కుట్ర అంటావా..? జస్ట్, ఒక మాట చెప్పు… కేంద్రంలో నీకు ఇన్నేళ్లూ సపోర్టుగా నిలబడిన మోడీయే ఉన్నాడు కదా… సీబీఐ విచారణను కోరు… నీ చెల్లెలు షర్మిల కూడా అదే అంటోంది… ఆధ్యాత్మిక అపవిత్రతను ది గ్రేట్ మోడీ కూడా సపోర్ట్ చేస్తాడేమో చూద్దాం…!! అవునూ, సోకాల్డ్ యెల్లో మీడియా ఎందుకు దీన్ని అండర్ ప్లే చేస్తోంది..? బాబూ, నిన్నూ నమ్మలేం, సీబీఐకి అప్పగించు ప్లీజ్…