Suryaa.co.in

Editorial

లడ్డుల్లో గొడ్డు మాంసమా?.. థూ.. మీ బతుకు చెడ!

  • తిరుమల శ్రీవారి లడ్డులో గొడ్డుమాంసం కలిపిన జగన్ సర్కారు

  • భగ్గుమన్న కోట్లాది హిందువుల హృదయాలు

  • ల్యాబ్ నివేదికలో బట్టబయలు

  • లడ్డు తయారు చేసేందుకు రోజుకు 15 కేజీల నెయ్యి అవసరం

  • దానితో నవరంధ్రాలూ మూసుకున్న వైసీపీ సోషల్‌మీడియా

  • బటర్ ఆయిల్‌తో లడ్డు చేశారన్న బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ

  • విజయవాడ వరదలు ఆ అపచార ఫలితమేనన్న మాజీ సీఎస్ ఎల్వీఎస్

  • ఆలయం మొత్తం శుద్ధి చేయాలని హితవు

  • కర్నాటక నందిని డైరీని వ్యూహాత్మకంగా తప్పించిన జగన్ సర్కారు

  • ముస్లిం కంపెనీకి ఆవునెయ్యి ఆర్డరు ఇచ్చిన వైనంపై ఆగ్రహం

  • తమిళనాడు కంపెనీకి ఆర్డరు ఎలా దక్కింది?

  • జగన్ అపచారంపై సోషల్‌మీడియాలో నెటిజర్ల ఆగ్రహం

  • అన్నం తింటున్నావా? అశుద్ధం తింటున్నావానంటూ కన్నెర్ర

  • సర్వనాశనమవుతావని శాపనార్ధాలు

  • సీబీఐ విచారణకు పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్

( మార్తి సుబ్రహ్మణ్యం)

పుట్టు క్రైస్తవుడయిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు ప్రసాదం తింటుండగా చూశారా? ఐదేళ్లలో, అంతకుముందుగానీ భార్య భారతితో కలసి తిరుమల వెళ్లిన దృశ్యం చూశారా? లేదు కదా?! అయితే.. ఇప్పుడు తిరుమల లడ్డులో గొడ్డుమాంసం కలుపుతారన్న నివేదిక వెలుగుచూసిన తర్వాత.. అప్పుడు జగన్, తిరుమలలో అర్చకులు ఇచ్చిన లడ్డును, వాసన చూసి ఎందుకు వదిలేశారన్న దానిపై ఇప్పుడు కోట్లాదిమంది హిందువులకు స్పష్టత వచ్చేసింది.

అంటే తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులో.. గొడ్డుమాంసం కలుపుతారన్న రహస్యం, నాటి సీఎం జగన్‌కు ముందే తెలుసన్న మాట. అందుకే ఆయన నుదుట బొట్టుపెట్టుకుని, పంచె కట్టుకుని తిరుమల వెళ్లినా.. లడ్డు ప్రసాదం మాత్రం తినకపోవడానికి, అసలు రహస్యం అదేనని తేలిపోయిన వైనం.. ఇప్పుడు కోట్లాదిమంది హిందువుల హృదయాలను రగిలిస్తోంది. ఇది హిందూమతం, దానిని పాటిస్తున్న కోట్లాదిమంది హిందువుల హృదయాలను గాయపరిచే దారుణ కుట్ర. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు మతపరంగా జరిగిన వ్యూహాత్మక దాడి.

దేవుడు ఉన్నాడని నమ్మేవారికి.. ఉన్నాడు. లేడని నమ్మేవారికి లేడు. అది నమ్మకానికి సంబంధించిన వ్యవహారం! దానిపై జరిగే తర్క-వితర్కాలను పక్కనపెడి తే.. దేవుడు ఉన్నాడని నమ్మే కోట్లాది మంది మనోభావాలు, విశ్వాసాలకు గౌరవించడం అందరి ధర్మం. ముఖ్యంగా పాలకులకు! కానీ ఒక మతాన్ని మాత్రమే నమ్మే ఓ ముఖ్యమంత్రి తన పాలనలో.. మెజారిటీ మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే?.. ఆ మెజారిటీ మతస్తుల మనోభావాలు గాయపరిస్తే?.. స్వామివారి ప్రసాదం తింటే పుణ్యమన్న విశ్వాసంతో, తినే ఆ లడ్లలో గొడ్డు మాంసం కలిపితే.. ఆ భక్తుల హృదయాలు ఎలా మండుతాయి? అసలు హిందువుల మనసులో గూడుకట్టుకున్న శ్రీవారి ప్రసాదానికి , మరో మతం కంపెనీ నెయ్యి వాడితే, హిందువుల గుండెలు ఎలా రోదిస్తాయి?

ఎలా అంటే.. ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని గొడ్డు మాంసంతో కలిపి తయారుచేశారని తెలినప్పుడు! తమ మత విశ్వాసాలతో జగన్ ఆడుకున్నారని తెలిసినప్పుడు!! ఆ ఆగ్రహం.. ఆవేదన.. రోదన.. ఉక్రోషం కట్టలు తెంచుకుని.. జగన్ కుటుంబం సర్వనాశనమవ్వాలంటూ సోషల్‌మీడియా బద్దలయ్యేలా విరుచుపడేంత ఆవేశం వచ్చినప్పుడు!

జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో తిరుమల కొండపై.. రెడ్డిరాజ్యమే నడిచిందన్నది మనం మనుషులం అన్నంత నిజం. వైవి సుబ్బారెడ్డి.. భూమన కరుణాకర్‌రెడ్డి.. ధర్మారెడ్డి.. జవహర్‌రెడ్డి.. అక్కడ అంతా ‘రెడ్డి’ కార్పెట్టే! వాళ్లు మాత్రమే కాదు. టీటీడీకి అనుబంధంగా ఉండే యూనివర్శిటీ, ఆసుపత్రులు, స్కూళ్లలో పెద్దరెడ్ల పెళ్లాలు.. కొడుకులు, కూతుళ్లు, బామ్మర్దులు ఏదో ఒక రూపంలో తిష్టవేసిన వైనం దాచినా దాగని నిజం.

దానితో వదలని జగన్ మతప్రీతి.. మతపిచ్చ చివరకు రోజూ గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించే ఆలయంలోకీ చొరబడింది. ఎందుకంటే జగన్ పక్కా క్రైస్తవుడు. తండ్రి అంత్యక్రియలు సహా, కుటుంబ సంప్రదాయాలన్నీ క్రైస్తవమతాచారం ప్రకారమే జరిగాయి. జరుగుతున్నాయి. ఇకపై జరుగుతాయి కూడా. ఎందుకంటే ఆయన పుట్టు క్రైస్తవుడు కాబట్టి! ఆయన భార్య భారతీరెడ్డితో ఏనాడూ తిరుమల వచ్చిన దాఖలాలు లేవు.

కానీ జగన్ హిందువని.. ఎన్నికల ముందు హిందువులను నమ్మించేందుకు.. స్వామి స్వరూపానంద వంటి స్వయంప్రకటిత పీఠాథితులు, జగన్‌ను రిషికేష్‌కు తీసుకువెళ్లి ఆయనను ఎన్నిసార్లు నీళ్లలో ముంచినా, జగన్ నిఖార్సైన క్రైస్తవ బిడ్డడే. ఇది మెడపై తల ఉన్న ఎవరికైనా తెలిసిన పచ్చి నిజం.

జగన్ క్రైస్తవుడవటం తప్పు కాదు. తన మత విశ్వాసాలు పాటించడం అంతకంటే తప్పు కాదు. ఎందుకంటే ఎవరి మత విశ్వాసాలు వారివి కాబట్టి. ఆయన ముఖ్యమంత్రి అవడమూ తప్పు కాదు. ఎందుకంటే ప్రజలే ఆయనకు ఆ స్థానం ఇచ్చారు. కానీ ఈ దేశంలో మెజారిటీ మతమైన హిందువులు కొలిచే తిరుమల వెంకన్న ఆలయంలో.. భక్తులకు ఇచ్చే లడ్డులో, గొడ్డుమాంసం వినియోగించేందుకు అనుమంతించడం దారుణాతిదారుణం.

జగన్ ఐదేళ్ల జమానాలో తిరుమల లడ్లలో గొడ్డు మాంసం వినియోగించారంటూ, గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెలప్‌మెంట్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ నివేదిక, ఇప్పుడు హిందూ సమాజంలో కలవరం రేపుతోంది. నిజానికి దీనిపై సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో హిందూసమాజం ఉలిక్కిపడింది.

తర్వాత వెంటనే ఆయన మాటలు నిజం చేస్తూ.. వెలుగుచూసిన నివేదిక వివరాలు, హిందువుల హృదయాలు భగ్గుమనేందుకు కారణమయ్యాయి. తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డుమాంసం, ఫిష్ ఆయిల్, కుళ్లిపోయిన జంతుమాంసం వాడారన్న, ఆ నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ నివేదిక, ఇప్పుడు హిందువుల మనసును గగుర్పొచేందుకు కారణమయింది.

అసలు తిరుమల లడ్లలో గొడ్డుమాంసం వినియోగిస్తున్నారని, ఆ నెయ్యి కాంట్రాక్టు అంతా ఓ ముస్లిం కంపెనీకి కట్టబెట్టారని చాలాకాలం క్రితమే, ప్రఖ్యాత పాత్రికేయుడు ఎంవిఆర్ శాస్త్రి బయటపెట్టారు. కానీ దానిపై చర్యలు శూన్యం. అసలు హైందవ దేవాలయంలో, అన్యమత కంపెనీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

నిజానికి ఆ లడ్లను పరీక్ష కోసం.. ప్రభుత్వం మారిన తర్వాత, గుజరాత్‌కు పంపించినట్లు అర్ధమవుతోంది. కానీ అది మీ హయాంలోనే జరిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు వెగటు పుట్టించేవే. ఈ నివేదిక బయపడిన తర్వాత, ఎగిరెగిరిపడే వైసీపీ సోషల్‌మీడియా, నవరంధ్రాలూ మూసుకుంది. అసలు ఈ కిరాతనికి కారణమైన వైసీపీ కొన్నాళ్లు అన్నీ మూసుకుని ఉండాల్సి ఉండగా, ఎదురుదాడి చేసిన సుబ్బారెడ్డి , ఇప్పుడు హిందువుల దృష్టిలో విలన్‌గా మారారు.

నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు జూలై 8వ తేదీన ఎన్డీడీబీ కాప్ ల్యాబ్‌కు పంపించారు. ఎన్డీడీబీ కాప్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలించింది. దీనికి ఐఎస్‌ఓ 17025 గుర్తింపు పొందింది. డెయిరీ ఉత్పత్తులను పరిశీలించడంలో మంచి అనుభవం ఉంది.

ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ కంపెనీలు నెయ్యి, ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి. సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా, ప్రభుత్వరంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ ఉపయోగించిన నెయ్యిని పరిశీలించి ఆ నెల 16వ తేదీన నివేదిక అందజేశారు.

టీటీడీ ఉపయోగించిన నెయ్యిలో.. సోయాబిన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తిగింజలతోపాటు చేప నూనె వాడినట్లు స్పష్టమైంది. బీఫ్ టాలో పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇందులో ఎస్ వ్యాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది.

95.68 నుంచి 104.32కు ఉండాల్సిన ఎస్ వ్యాల్యూ 20.32 ఉండడానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ నిర్ధారించింది. నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా, గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్‌ కు పంపించగా.. వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె అందులో ఉందని నిర్ధారణ అయ్యింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లయ్ చేసిన నేతిని ల్యాబ్‌కు పంపితే, అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని పేర్కొన్నారు. ఆ సంస్థను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదంపప్పు ఇతర పదార్థాలు నాసిరకం ఉపయోగించారు. దాంతో లడ్డూల్లో నాణ్యత లోపించింది. కర్ణాటకకు చెందిన నందిని కో-ఆపరేటివ్ డెయిరీ రాయితీతో నెయ్యి సరఫరా చేసేది. నందిని సంస్థ నెయ్యి సరఫరా చేస్తే కమిషన్లు రావనే ఉద్దేశంతో, ఆ సంస్థను గత పాలకులు పక్కనపెట్టారు. కాసులకు కక్కుర్తి పడి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.

మాజీ ఈవో ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తనకు కావాల్సిన వారి కోసం టెండర్‌ను అప్పగించారు. కేజీ ఆవు నెయ్యి రూ.400 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. రూ.320కే సరఫరా చేస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థల గురించి విచారణ చేయకుండా ఒప్పందం చేసుకున్నారు. ఆ సంస్థలు నాసిరకం నెయ్యిని రూ.320కే సరఫరా చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారు చేసేందుకు, రోజుకు 15 కేజీల నెయ్యి అవసరం అవుతుంది.

ఇదిలా ఉండగా..జగన్ జమానాలో.. లడ్లలో గొడ్డుమాంసం వాడారన్న నివేదిక బట్టబయలయిన తర్వాత, హిందూజాతి భగ్గుమంది. తాము ఆ ఐదేళ్లు తాదాత్మ్యంతో కళ్లకద్దుకుని తిన్న శ్రీవారి ప్రసాదంలో, గొడ్డు మాంసం కలిపారన్న విషయం తెలిసిన తర్వాత కడుపు దేవినట్లు ఫీలవుతున్నారు.

అందుకు కారణమైన జగన్ కుటుంబం సర్వనాశనమవుతుందని, సోషల్‌మీడియా పోస్టింగులలో శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఉసురు ఊరకనే పోదు. నీ పిల్లలు, కుటుంబాన్ని నాశనం చేస్తుంది.. నువ్వు లడ్డు తినని అసలు రహస్యం ఇదేనా?.. నీ క్రైస్తవ మత పిచ్చితో మా హిందూమతాన్ని అవమానిస్తావా? అందుకే మట్టికొట్టుకుపోయావ్. థూ మీ బతుకు చెడ..అంటూ నెటిజన్లు శాపనార్ధాలు లంకించుకుంటున్నారు.

అటు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సైతం ఈ అపచారంపై భగ్గుమన్నారు. ‘ఈ అపచారం వల్లే విజయవాడ నీట మునిగింది. తక్షణం ఆలయాన్ని శుద్ధి చేయండి’ అని హితవు పలికారు. టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ నేత, బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓవీ రమణ ‘‘అసలు బటర్ ఆయిల్ తో లడ్డు ఎలా తయారుచేస్తారు? ధర్మారెడ్డి ఇలాంటి కిరాతకాలు ఇంకా చాలా చేశారు. దశాబ్దాల నుంచి టీటీడీకి ఆవు పాలు, నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డైరీ, కమిషన్లు ఇవ్వదన్న కారణంతో దాన్ని తప్పించి, ఆల్ఫాకు ఇచ్చారు.

తిరుపతికి ఢిల్లీలో ఉన్న ఆల్ఫా కంపెనీ దగ్గరనా? పక్కనే ఉన్న కర్నాటక నందిని కంపెనీ దగ్గరనా? పోనీ ఆల్ఫాకంపెనీ ఏమైనా ఆవుపాలు, నెయ్యి ఉత్పత్తి చేస్తుందా అంటే అదీ కాదు. అది విదే శాల నుంచి బటర్ ఆయిల్ తెప్పించుకుని సరఫరా చేసే కంపెనీ. ఇదంతా కమిషన్లు కొట్టేసే కుట్రలో భాగమే. భూమన, సుబ్బారెడ్డి హయాంలో జరిగిన అన్ని

కొనుగోళ్లపై విచారణ చేయాల్సిందే. అయితే అది టీటీడీ పవ్రితకు భంగం కలిగించేలా ఉండకూడదు. అసలు జగన్ జమానాలో టీటీడీలో జరిగిన అన్ని అరాచకాలపై నేను సీఎం చంద్రబాబుకు ఒక నివేదిక ఇవ్వబోతున్నా’’ని రమణ వెల్లడించారు.

తాజా పరిణామం జగన్- వైసీపీని హిందువుల నుంచి పూర్తిగా దూరం చేసేదే. ఇది ఆ పార్టీలోని హిందువులకూ సంకట పరిస్థితి. హిందువులను అవమానించిన పార్టీలో ఎలా ఉంటావని ఎదురుదాడి చేస్తే, సమాధానం చెప్పలేని నిస్సహాయత. ఒక్కముక్కలో చెప్పాలంటే.. కోట్లాదిమంది హిందువుల హృదయాల్లో.. ఇప్పుడు జగన్ సారథ్యంలోని వైసీపీ, పూర్తి హిందూ వ్యతిరేక పార్టీ. ఆ పార్టీలో ఉండేదంతా హిందూ వ్యతిరేకులే. రేపటినుంచి వైసీపీపై జరిగే ప్రచారం ఇదే!

LEAVE A RESPONSE