Suryaa.co.in

Andhra Pradesh

పేదల కోసం జగన్-పెత్తందార్ల కోసం టీడీపీ

ఎంపీ విజయసాయి రెడ్డి

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శ్రమిస్తుంటే, పెత్తందార్ల బాగు కోసం తేదేపా పరితపిస్తోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. ప్రజలే తన ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకుంటారని, అదే ధైర్యంతో ఆయన ప్రతిపక్షాలతో యుద్ధం చేస్తున్నారని అన్నారు.

పోర్టు ఆధారిత పరిశ్రమలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి
పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారనుందని విజయసాయి రెడ్డి అన్నారు. మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, గొట్టాబ్యారేజీ ఎత్తిపోతల పథకం, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రోజక్టులతో శ్రీకాకుళం జిల్లా అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్ గా మారుతుందని అన్నారు.

ప్రజలకు అందుబాటులో సేంద్రీయ పాలు
ప్రజలకు సేంద్రీయ పాలు అందించే లక్ష్యంతో నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి అన్నారు. సేంద్రీయ పద్దతిలో పండించిన పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోందని అన్నారు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రస్తుతం సేంద్రీయ పాలు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేపద్యంలో సేంద్రీయ పద్దతిలో పశుసంరక్షణ చేపట్టాలని తీసుకున్న నిర్ణయంతో రైతులు, పశువుల కాపరులు లాభపడతారని అన్నారు. సేంద్రీయ పాలలో ఒమేగా -3 ఫేటీ యాసిడ్, సంయోజిత లినోలెయిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారని అన్నారు. రసాయనాలు లేని సేంద్రీయ పాలతో ప్రజల అదిక ప్రయోజనాలు పొందుతారని మిక్కిలి ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు.

విద్య, ఉపాధి కల్పన, మహిళా అక్షరాస్యతపై దృష్టి సారించాలి
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్టు ప్రకారం ఇండియా జనాభా చైనాను మించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్న వార్త ఆందోళన కలిగించే అంశమని విజయసాయి రెడ్డి అన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు విద్య, ఉపాధి కల్పన, మహిళల అక్షరాస్యత మెదలగు అంశాలపై పెట్టుబడి పెట్టాలని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE