-పది ఇచ్చి వెయ్యి రూపాయలు కొట్టేస్తున్న జగన్
-సామాన్యుల రక్తం పీలుస్తున్న జగన్ సర్కారు
-ఈ దిక్కుమాలిన సర్కారును సాగనంపండి
– సత్తెనపల్లి పట్టణ ప్రగతి టైలర్స్ అసోసియేషన్ టైలర్స్ డే వేడుకలలో మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సమాజంలో గౌరవం మర్యాదలు పొందాలంటే మంచి దుస్తులు వేసుకునే దాన్ని బట్టి అంచనా వేస్తారు, మనిషికి కూడు,గుడ్డ,నీరు ఎలా అవసరమో ఆ వస్త్రం తయారీలో భాగంగా మీరు నైపుణ్యం తో అందిస్తున్న సేవలు అంత విలువైనవి. గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం పండుగలా జరుపుకోవటం అభినందనీయమని మాజీ మంత్రి, నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు.
మనం ఎన్నికల సమయంలో ఉన్నామని, ఈ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ఈ రాష్ట్రంలో ఎవరు అయిన బాగున్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి,ఆయన దొంగల ముఠా మాత్రమే అని వ్యాఖ్యానించారు. సమాజంలో ఉన్న అని వర్గాల వారిని పీడిస్తూ, రక్తం పీలుస్తూ తాను ఒక్కడే సంతోషంగా ఉండాలి అనుకుంటునాడు అని విమర్శించారు.
అందుకు ఉదాహరణగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేశారు, చేసాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా చెలించాల్సిన జీతం, జనవరి నెలలో చెలించాల్సిన జీతం ఇప్పటి వరకు చెలించలేదని, వారిని పస్తులు పెట్టి వాటిని తన ఎన్నికల ప్రచారం కోసం అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సుమారు 45 కోట్ల రూపాయలు దారి మళ్లించి తన రాక్షసత్వంతో కూడుకున్న సైకో తనం అని ఎద్దేవా చేశారు. ఈ రకమైన సైకో పైకి పేదలు, పెత్తందారులు అని మాటలు చెబుతూ.. జనం దగ్గర వసూలు చేస్తున్న డబ్బులు నుంచి 10 రూపాయలు వారికి ఇచ్చి 1000 రూపాయలు మళ్ళీ వారి దగ్గర నుంచి లాకుంటున్నాడు.
2019 లో కరెంట్ బిల్ 250 వస్తే ఇప్పుడు 2000 వసూలు చేస్తున్నారు. అమ్మవొడి ద్వారా 13000 వేలు ఇస్తూ ఆ సొమ్ము మళ్ళీ కరెంట్ చార్జెస్,ఆర్టీసీ చార్జీలు, గ్యాస్ ధరలు,నిత్యావసర వస్తువులు, ఇంటి పన్ను, చెత్త పన్ను అని ప్రజలకు 10 పైసలు ఇస్తూ వారి దగ్గర నుంచి1000 రూపాయలు తిరిగి వసూలు చేస్తున్నాడు. ఈ రకమైన దోపిడీ చేస్తూ తాను మాత్రమే ఈ దేశంలో ధనికుడు అవ్వాలి అని రాష్ట్రంలో ప్రతి వ్యాపారం ఆయనే స్వయంగా చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.
ఈ రకంగా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ మళ్ళీ సిద్ధం అని వస్తున్నాడు, దేనికి సిద్ధం జైలుకు పోవటానిక అని ప్రశించారు.అయిదు సంవత్సరాల నుంచి ముద్దాయి అయి ఉండి 3500 వాయిదాలలో ఒక్క వాయిదాకి కూడా హాజరు కాలేదు అని, ఇది ఎవరికైనా సాధ్యమా అని, తన దగ్గర ఉన్న అక్రమ డబ్బుతో వ్యవస్థలను వాడుకుంటున్నాడు అని విమర్శించారు.
ఈ రకమైన ముఖ్యమంత్రి మనకు అవసరమా మనకు రోడ్లు వేయకుండా,రాజధాని లేకుండా, పోలవరం ఆపేసి,మన రక్తాన్ని పీల్చుకుతింటు మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో యేల్లినేడి రామస్వామి రాష్ట్ర పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి, చౌట శ్రీనివాసరావురాష్ట్ర పార్టీ కార్యదర్శి,ఆతుకూరి నాగేశ్వరరావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్,నూర్ బాషా జానీ బాబు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, సర్వేపల్లి సీతయ్య పల్నాడు జిల్లా పార్టీ కార్యదర్శి,తోట అంబిక పల్నాడు జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు, సయ్యద్ రాంబో బుడె నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు,యేల్లినేడి లక్ష్మి తులసి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు, పూజల వెంకట కోటయ్య పల్నాడు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి,కంబాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ నాయకులు వీరేశం,జనసేన నాయకులు తవిటి భవన్ నారాయణ సిరిగిరి మణికంఠ తెలుగుదేశం నాయకులు శిరసాల భుజంగరావు దేసు శ్రీనివాసరావు మరియు నియోజకవర్గంలో వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు కార్యకర్తలు పాల్గొన్నారు.