వైసీపీ నుంచి 40 మంది టైలర్స్ కుటుంబాలు టీడీపీలో చేరి

– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
– రోజు రోజుకు పెరుగుతున్న చేరికలతో అయోమయంలో దిక్కుతోచని స్థితిలో మంత్రి అంబటి
– కన్నా దెబ్బకు తలపట్టుకుంటున వైనం

ఇటీవల మాజీ మంత్రి , నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా మీద విమర్శలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణనా లేక కండువాల నారాయణనా అని విరుచుకుపడ్డ ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు నేడు అయోమయంలో దిక్కుతోచని స్థితిలోకి వచ్చారు. రోజు రోజుకు పెరిగిపోతున్న చేరికలతో ఎందుకు ఆ విమర్శలు చేసానా అని తల పట్టుకుంటున్నారని నియోజకవర్గంలో టాక్. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన తన పని తాను చేసుకుంటూ పోతా అనే శైలిలో కన్నా నియోజకవర్గంలోని అని వర్గాలకు దగ్గర అవుతూ ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉండగా నిన్నటి వరకు మంత్రి అంబటి రాంబాబు విశ్వాసం, విశ్వసనీయత అని పలుకులు పలికిన కానీ,అంబటికి నేడు మళ్ళీ షాక్ ఇస్తూ.. ఆ పార్టీ మీద నమ్మకం లేక అధికార వైసీపీ పార్టీ నుంచి పట్టణానికి చెందిన 40 మంది టైలర్స్ కుటుంబాలు, టైలర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీని వీడి ..మాజీ మంత్రి, నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ టైలర్స్ అసోసియేషన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, మీ సమస్యలన్నీ తెలుగుదేశం,జనసేన కూటమి ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యెల్లినేడి రామస్వామి, రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నూర్ భాషా జానీ బాబు, పల్నాడు జిల్లా పార్టీ కార్యదర్శి సర్వేపల్లి సీతయ్య, తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు తోట అంబిక,నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ రాంబోబుడే , పట్టణ మహిళా అధ్యక్షురాలు యెల్లినేడి లక్ష్మి తులసి, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధులు పూజల వెంకట కోటయ్య, కంబాల వెంకటేశ్వర్లు, నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొక్క సంగీతరావు, పార్టీ నాయకులు వీరేశం మరియు నియోజకవర్గ,పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply