13ఏళ్ల తర్వాత..నెల్లూరుకు దగ్గరగా వస్తున్న తుఫాన్

నెల్లూరు జిల్లాకు తుఫాన్ ముప్పు తప్పేలా కనిపించడం లేదు. తుఫాన్ నెల్లూరు తీరంవైపు దూసుకొస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరింతగా పెరిగి.. ఈ రోజు సాయంత్రానికి అతి భారీ వర్షాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. 13 సంవత్సరాల తర్వాత, తిరిగి నెల్లూరును తుఫాన్ కమ్మేస్తోంది. 2008 నవంబర్ లో తుఫాన్ ఒకసారి నెల్లూరు తీరాన్ని తాకింది. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండండి.. బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి. చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయి. వరదలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండండి.. సేఫ్ గా ఉండండి.