ఒంగోలు నగరంలో రోడ్లు,అభివృద్ధికి అవకాశం లేదా?

దశాబ్దాలు గడుస్తున్నా ఒంగోలు నగరంలో రోడ్లు,అభివృద్ధికి అవకాశం లేదా ?
ఒంగోలు నగరం 100 సంవత్సరాలు పైగా మున్సిపాలిటీ ఏర్పాటు అయింది.గత 10 సంవత్సరాల క్రితం ఒంగోలు నగర పాలక సంస్థ గా ఏర్పాటు అయింది పేరు కు మాత్రమే కానీ అభివృద్ధి మాత్రం ” A గ్రేడ్ ” మున్సిపాలిటీలో జరగాల్సిన అంత అభివృద్ధి జరగలేదు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి…పోతున్నాయి. కానీ కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి అంటారు. తరువాత ఎన్నికలు అయిపోయాయి. తరువాత తమకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ లు మార్చుకోవడం.. ఎందుకు మాస్టర్ ఫ్లాన్ లు రూపొందిస్తారో తెలియదు .
1 నుంచి 5 సంవత్సరాలు వరకు బాల్యం ఒక రకంగా , 5 నుంచి 16 సంవత్సరం వరకు ఎదుగుదల ఉంటుంది . 16 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో పరిపక్వత చెందుతున్నారు. ఈమధ్య వయస్సు లో మనిషి ఎదుగుదల లేకపోతే.. పక్కదోవ పట్టే వయస్సు . అలాగే మున్సిపాలిటీ కూడా, నాలుగు స్టేజ్ లు ఉంటాయి అభివృద్ధి చెందడానికి . కానీ ఒంగోలు నగరం అభివృద్ధి లో, రెండో స్టేజ్ లో మాత్రమే ఉంది . ప్రజలకు పన్నులు మాత్రం 4 వ స్టేజ్ వరకు విధించే పన్నులు వసూలు చేస్తున్నారు . అభివృద్ధి మాత్రం 30 శాతం చిన్న మున్సిపాలిటీ స్ధాయి .
నగర ప్రజలు మాత్రం రోజు రోజుకి పెరుగుతున్న దానికి తగినట్లు.. నగరంలో రోడ్లు , పార్క్ లు , వినోదం సంబంధించిన ఎలాంటి ప్రాజెక్టులు నిర్మాణం లేదు. ఎక్కడ కూడా ఆటస్ధలాలు లేవు. ఉన్న అందులో రాజకీయ పార్టీల కార్యక్రమం తో సరిపోతుంది. దానిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మరచి పోతున్నారు . కొత్త ప్రాంతం విస్తరణ పనులు లేవు. .ప్రతి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం, ఒకటి రెండు ప్రాజెక్టులు ఆమోదించడం, పనులు ప్రారంభించడం, నిధులు సమస్య తో ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది. పనులు మాత్రం శూన్యం .
గత 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. A1 , కార్పొరేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు , ప్రపంచ బ్యాంకు నిధులు , రాష్ట్ర నిధులు , లోకల్ గా పన్నులు వసూలు ద్వారా నిధులు వస్తుంటాయి. కానీ వచ్చిన నిధులు ఎందుకు సరిపోవడం లేదు . బడ్జెట్ లు అంచనాలు ఎందుకు సరిపోవడం లేదు. ఎందుకు అభివృద్ధి జరగడం లేదు. ఎందువలన మాస్టర్ ప్లాన్ లు అమలు చేయలేక పోతున్నారు ? ఉదాహరణకు 30 గదులు స్ధలంలో మాస్టర్ ప్లాన్ అనుగుణంగా నిర్మాణం చేయాలి. అంతవరకుబాగుంది .అడుగు- రెండు అడుగులు ఎక్కువగా నిర్మాణం చేస్తే, పెద్ద ఎత్తున దాని మీద నోటీసులు , ఫేనాల్డీలు , భారీగా లంచాలు ఇవ్వాలి . అందుకు కూడ సరే అనుకుందాం .
నగరంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో, ప్రత్యేకంగా టౌన్ ఫ్లానింగ్ విభాగం ఉంటుంది. .వీరి ఆధ్వర్యంలో నగరంలో ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాలు సరిపడే ప్రజలకు అభివృద్ధి చేయడానికి ఇంజనీర్లు , మేదావులు , ప్రముఖులు కొన్ని నెలలు సమయం కేటాయించి, మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారు . దానికి అనుగుణంగా రోడ్లు , పార్కింగ్ లు , పార్క్ లు , క్రీడా మైదానాలు , షాపింగ్ కాంప్లెక్స్ లు , యూరినల్స్ , ప్రభుత్వ కార్యాలయంలు , ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం , సెంటర్స్ లలో వాటర్ ఫౌంటెన్స్ లు , డ్రేనేజ్ లు , కల్వర్టు లు , వీధి దీపాలు స్ధంభాలు , స్కూల్స్ నిర్మాణం , లేఆవుట్స్ నిబంధనలు అనుగుణంగా అమలు పరచాలి .
అలాగే కేంద్ర ,రాష్ట్ర ప్రణాళిక విభాగాలు , ఆర్థిక శాఖ అమోదం తరువాత నగర టౌన్ విభాగాం అమలు పరచాలి. అని బాగున్నాయి. ఎందుకు మాస్టర్ ప్లాన్ అనుగుణంగా ఎందుకు అమలు పరచడం లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? . వర్షాలు కురుస్తున్నపుడు నగరంలో చాల చోట్ల, నీళ్ళతో కాలనీలు రోడ్డు లు మునిగి పోతున్నాయి . పోతురాజు కాల్వ పరిష్కారం 40 శాతం మాత్రమే పూర్తి స్ధాయి పరిష్కారం మీద ఆలోచన చేయడం లేదు . అండర్ గ్రౌండ్ డ్రేనేజ్ కావాలి అని ప్రజలు బావిస్తున్నారు.
దానిమీద పాలక మండలి ఆలోచన చేయాలి. అవసరం ఉందా లేదా ప్రకటన చేయాలి. అలాంటి ఆలోచన లేకపోవడం చాల పెద్ద లోపం . నగరంలో ఎన్నో ఖాళీ స్ధలాలు ఉన్నాయి. నగర పాలక సంస్థ సంబంధించి రోజు రోజుకి డంపింగ్ కేంద్రాలు పెరుగుతున్నాయి. అలాగే ఖాళీ స్ధలాలు ఊరచెరువు , పి.వి.ఆర్ హైస్కూల్ ఎదురు గా ఖాళీ స్ధలలు , పాత మార్కెట్ స్ధలం , రంగుల ఫ్యాక్టరీ దగ్గర ఖాళీ స్ధలంలలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి., నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం నగర పాలక సంస్థ కు ఆదాయం ఉండాలి. కానీ వాటికి విరుద్ధంగా చాల చోట్ల అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎక్కడ కూడా దానిని అరికట్టేందుకు ప్రయత్నం నామమాత్రంగా ఉంటుంది.
చిన్న పని చేసి 10 సంవత్సరాలు ప్రచారం చేయడం ఇదే తంతు. వంద సంవత్సరాలు దాటింది మున్సిపాలిటీ అయి. గత 20 నుంచి 30 సంవత్సరాలు నుంచి A1 గ్రేడ్ మున్సిపాలిటీ అయి, దాని తరువాత 10 సంవత్సరాలు క్రితం నగర పాలక సంస్థ గా హోదా వచ్చింది . ప్రస్తుతం 3.5 లక్షల మంది నగర పాలక సంస్థ లో ప్రజలు నివాసం ఉంటున్నారు అనే అంచనాలు . ఒక్క సారి ఆలోచన చేయాలి. కార్పొరేషన్ స్ధాయికి అనుగుణంగా నగరంలో అభివృద్ధి జరిగిందా?
ఇంకా 60 శాతం నగరంలో మౌలిక సదుపాయాలు లేవు ఎక్కడ లోపం జరుగుతుంది ?. గతంలో మున్సిపల్ పాలక మండలి , ప్రస్తుత నగర పాలక సంస్థ పాలక మండలి , రాజకీయ పార్టీలు , నగర జిల్లా యాంత్రాంగం , నగర ప్రజలు ఆలోచన చేయాలి. నగర అభివృద్ధి జరగాలని కోరుకునే వారు ఒక్క సారి ఆలోచన చేయండి. నగర అభివృద్ధి జరగకపోతే నగర విస్తరణ జరగదు . నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉండవు .నగర ప్రజలకు వినోద పరమైన సౌకర్యాలు కల్పించలేరు . దీనివలన యువతీ యువకులు చెడు మార్గాలు వైపు వెళ్ళకుండ చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది .
అలాగే అధికారులు , ప్రజాప్రతినిధులు , రాజకీయ నాయకులు కూడ ఆలోచన చేయాలి. అందులో మీ కుటుంబ సభ్యులు , బంధువులు కూడా ఉంటారు అనేది మరచి పోవద్దు . ఇప్పటికే నగరం మాస్టర్ ప్లాన్ అనుగుణంగా అభివృద్ధి , జరగాల్సిన స్ధాయిలో జరగక పోవడం, చాలా నష్టపోవడం జరిగింది . నగరంలో ఒక్కటి కూడ గొప్పగా చెప్పే ” ఐకాన్ ” కట్టడం- ప్రదేశం లేక ఒక్క రోడ్డు కూడ లేదు చెప్పుకోవడానికి . ఇప్పటికైనా అందరూ ఆలోచన చేయండి. నగరంలో మీరు కూడ 60 నుంచి 70 జీవించాలి. .
గతంలో జిల్లా కలెక్టర్ నగరంలో పర్యటన చేస్తే, నగర ప్రజలకు మంచి జరుగుతుంది అనుకొనే వారు. దేవుడుగా చూసే వారు. ఇప్పుడు నగరంలో పర్యటన చేసి 10 సంవత్సరాలు గడుస్తుంది . ఒక వేళ పర్యటన చేసేది ముఖ్యమంత్రి , మంత్రులు వచ్చే ముందు ఏర్పాటు చూడడానికి మాత్రమే వస్తున్నారు. కారణం రాజకీయ జోక్యం వలన వారికి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి లేదు .
నగరంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు. కానీ నగర పాలక సంస్థ పాలక మండలి కి పట్టదు. వాళ్ళకు ప్రజలకు సంబంధించి సమస్యలు కనబడవు. వారికి వ్యక్తి గతంగా ఉపయోగం ఉంటే మాత్రం, సమస్యగా కనబడుతుంది. నగర ప్రజలకు మొత్తానికి ఉపయోగపడే పనులు అవసరం లేదు.ప్రజలు ఏదైనా అడిగితే, కొత్త గా కొవిడ్ వైరస్ పేరు చెప్పి నిధులు సమస్య ని ముందు ఉంచుతున్నారు.నగరంలో గతంలో మూడు రకాల వసూలు చేస్తే, వారు ఇప్పుడు రెండు రకాల ట్యాక్స్ లు అదనంగా వచ్చాయి . కొంత మంది కడుతున్నారు . వసతులు సౌకర్యాలు మాత్రం నామమాత్రం. ఎప్పుడు నగర కార్పొరేషన్ స్ధాయి అభివృద్ధి జరుగుతుందో అని నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

– కొల్లా మధు
ఒంగోలు సిటిజన్ అసోషియేషన్ అధ్యక్షుడు

Leave a Reply