పోలీసుల ద్వారా ఎక్కువ కాలం రాజ్యమేలలేరు

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం: పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ విద్యార్ధులను, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో కలసి పరామర్శించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు.
ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది.ప్రశాంతంగా నిరసన తెలపడం తప్పా.పోలీసులకు, డిఎస్పి వీరరాఘవ రెడ్డికి కాలేజీలో పనేంటి? ఒక్క విద్యార్థి అయినా రోడ్డు మీదకి వచ్చాడా? అమ్మాయిలను కూడా కొట్టారు. సీఎం ఈ ఘటన ని ఖండించాలి. పోలీసుల పై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన ఎయిడ్ ఆగిపోతే చదువు ఎలా సాగుతుంది? విద్యార్థుల కోసం మేము రాజకీయం చేస్తాం. లక్షలాది మంది విద్యార్థుల కోసం రాజకీయం చేస్తాం. ఎవరికీ ఇబ్బంది లేదని ప్రభుత్వం అంటుంది. మరి రాష్ట్రమంతా విద్యార్థులు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేశావ్. తల్లిదండ్రులను బెదిరిస్తారా? పోలీసుల ద్వారా ఎక్కువ కాలం రాజ్యమేలలేరు. విద్యార్థి సంఘాల వారిని బెదిరిస్తారా? మేమే స్వయంగా రంగంలోకి దిగుతాం. పోలీసులు కాలేజ్ లోకి వస్తే మ్యానేజ్మెంట్ ఎం చేస్తుంది. జిఓ ఉపసంహరించుకోవాలి. ఎయిడ్ కొనసాగించే వరకూ మా పోరాటం కొనసాగుతుంది