Suryaa.co.in

Telangana

17 ఎంపీ స్థానాలు గెలుచుకొని నీ మగతనం ఏంటో నిరూపించుకో

-సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని అవమానించినట్లేనా?
-సీఎం కుర్చీ నీకు ఇనాం కిందనే వచ్చింది
-సీఎం రేవంత్ రెడ్డి మాటలు జుగుప్సాకరం
-సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం ఫైర్

హన్మకొండ : రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని అనే సోయి మరచి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ప్రతిపక్షలపై దాడి. మగాడివి అయితే ఒక్క ఎంపీ సీటు గెలువు అని ఒక ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు. మల్కాజిగిరి ఎంపీ గా ఉన్న నువ్వు 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క సీటు కూడా ఎందుకు గెలిపించుకోలేదు? రాజకీయాలలో మగతనం గురించి మాట్లాడుతున్నావు అంటే మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని అవమానించినట్లేనా?

ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యతా సంస్కారం? తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను గెలుచుకొని నీ మగతనం ఏంటో నిరూపించుకో. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఈనాం కింద రాలేదు, వారసత్వంగా రాలేదు అంటున్నాడు. కచ్చితంగా సీఎం కుర్చీ నీకు ఇనాం కిందనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలపై మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఇప్పటి కూడా ఇందిరా గాంధీ పేరు చెప్పంది మీకు పూట గడవదు. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ. నిజానికి ప్రాంతీయ పార్టీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గా కాకుండా, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి గా వ్యవహారించాలి. గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు.

కాళేశ్వరం అంటే ఒక్క మెడిగడ్డ మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ది కోసమే కాళేశ్వరాన్ని వాడుకుంటుంది. కాళేశ్వరం పై నిపుణుల కమిటీతో విచారణ జరిపి బాద్యులపై చట్టారీత్య చర్యలు తీసుకోవాలి. మెడిగడ్డను రిపేర్ చేయకుండా మొత్తం కొట్టుకుపోవాలనే దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు, నీచ రాజకీయాలు మానుకోవాలి. ముఖ్యమంత్రి మంత్రి భాషను సవరించుకొని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి.

వరంగల్ జిల్లా ఎంపీ పసునూరి దయాకర్ , వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ,మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి .బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE