Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం శాపంగా మార్చిన పాపం జగన్ రెడ్డిదే

  • మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

పోలవరం శాపంగా మార్చిన పాపం జగన్ రెడ్డిదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి జగన్ రెడ్డే కారణమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ జులై 15, 2022న ఏపీ సీఎస్ కు లేఖ రాసింది. కాంట్రాక్ట్ సంస్థ, జలవనరులశాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేంద్ర జల వనరుల శాఖ, జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మార్గదర్శకాలనూ పాటించలేదు. కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా జగన్ రెడ్డి అన్నింటినీ పెడచెవిన పెడుతోంది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక యాజమాన్య విభాగం ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా పీపీఏ చెబుతున్నా.. జగన్ రెడ్డి పట్టించుకోలేదు. గోదావరి వరదల్లో దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరదనీరు పోటెత్తి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి ప్రాజెక్టు నిర్మాణ పనులు నెమ్మదిగా జరగడమే ప్రధాన కారణం. 2022 మే 22న కేంద్ర జల్‌శక్తి మంత్రి సలహాదారు నిర్వహించిన సమావేశంలో.. అనేక కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే గడువులను ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూనే ఉన్నారన్నారు. 2022 ఏప్రిల్‌లో ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలు మారుస్తూ కమిటీ నివేదిక ఇచ్చింది. 2022 జులై 31 నాటికి దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేస్తామని అందులో పేర్కొన్నారు. 2024 జూన్‌ నాటికి డిస్ట్రిబ్యూటరీలతో సహా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.

2022 ఫిబ్రవరి నుంచి జులై వరకు కేంద్ర జల్‌శక్తిశాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్వహించిన వివిధ సమావేశాల్లో దిగువ కాఫర్‌ డ్యాం జులై నెలాఖరుకు పూర్తి చేయాలని మేం చెబుతూనే ఉన్నాం. దిగువ కాఫర్‌డ్యాంలో 25.46 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాల్సి ఉంది. 3.37 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని జరిగింది. మిగిలిన పనిని మేఘా ఇంజినీరింగుకు అప్పచెప్పారు. వారు 2020 నవంబరు నుంచి పనిచేసేలా షెడ్యూలు రూపొందించారు. 2021 జులైకే పని పూర్తిచేయాలి. 2020 వరదల్లో భారీ గుంతలు ఏర్పడటంతో 2022 జులై 31 నాటికి ఈ నిర్మాణం పూర్తిచేసేలా షెడ్యూలు సవరించారు. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు 2022 జులై 31 నాటికి పూర్తిచేస్తామని పోలవరం ప్రాజెక్టు సీఈ 2022 మే 9న ప్రాజెక్టు అథారిటీ సీఈవో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా చెప్పారు.2022 మే 21, 22, 24 తేదీల్లో కేంద్ర జల్‌శక్తి మంత్రి ప్రధాన సలహాదారు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, సమీక్షించారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులను 2022 జులై 31కి పూర్తిచేస్తామని ఈఎన్‌సీ తెలియజేశారు. దిగువ కాఫర్‌ డ్యాం డిజైన్లు కూడా ఏప్రిల్‌ మధ్యనాటికే ఖరారయ్యాయి. ఏదేమైనా పోలవరం శాపంగా మార్చిన పాపం జగన్ రెడ్డిదే అని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

LEAVE A RESPONSE