కోట్లాదిమంది మహిళల మోడెస్టీ కన్నా సిఎంకు డర్టీ ఎంపినే ఎక్కువయ్యాడా?

  • ముఖ్యమంత్రి గారూ… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
  • టిడిపి మహిళా నేతలు పంచుమర్తి అనూరాధ, పీతల సుజాత

న్యూడిస్టు ఎంపి గోరంట్ల మాధవ్ పై చర్యకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మాధవ్ కేసు విషయంలో నిజాలు నిగ్గుతేల్చడం కన్నా వాస్తవాలను మరుగుపర్చేందుకు జగన్ రెడ్డి ప్రయాసపడుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రికి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా మేం అడిగే ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పండి.

1. 6-8-2022న మహిళా కమిషన్ మాధవ్ డర్టీ వీడియోపై విచారించాలని డిజిపికి లేఖరాసినా సంబంధిత వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకపోవడం కేసును తప్పుదారి పట్టించడం కాదా?
2. ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో పంపకుండా ఆ వీడియో మార్ఫింగ్ అనే విధంగా మాట్లాడటం సిఎం ఆదేశాలను అమలుచేయడం కాదా?
3. ఎంపి రఘురామకృష్ణంరాజు ఫోన్ సీజ్ చేసిన జగన్ ప్రభుత్వం… ఎంపి మాధవ్ ఫోన్ ను వారంరోజులైనా ఎంధుకు సీజ్ చేయలేదు?
4. కోట్లాది మహిళల మోడెస్టీ కన్నా ఒక డర్టీ ఎంపినే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువయ్యాడా?
5. ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్ ముగిసిన వెనువెంటనే డిల్లీలో డర్టీ ఎంపి ప్రెస్ మీట్ పెట్టడం దొంగ – పోలీసు కుమ్మక్కుకు నిదర్శనం కాదా?
6. డర్టీ ఎంపిని రక్షించడానికి కులచిచ్చు కుట్ర, ప్రతిపక్షనేతలపై నీచమైన భాషాప్రయోగం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం కాదా?
7. తన నేరాల సపోర్టుకోసం నేరస్తులందరినీ వెనకేసుకురావడం జగన్ రెడ్డి వ్యూహంలో భాగం కాదా? మహిళలపై నేరాల్లో ఎపి దేశంలోనే 2వస్థానంలో ఉండటానికి జగన్ రెడ్డి నేరచరిత్ర కారణం కాదా?