-జగన్ పాలన ఫేక్.. మాటలు ఫేక్.. చేతలు ఫేక్. రాష్ట్రాన్ని పాలిస్తున్నదే ఫేక్ ప్రభుత్వం, ఫేక్ ముఖ్యమంత్రి
• ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా 98శాతం హామీలు అమలుచేశానంటున్న జగన్, ఏం చేశాడో చెప్పాలి.
• 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలభర్తీ మొదలు రైతులకు రూ.12,500రైతుభరోసా, డ్వాక్రామహిళల రుణమాఫీ, 25లక్షల ఇళ్లనిర్మాణం, అమరావతి, పోలవరం నిర్మాణం హామీలు ఏమయ్యాయో జగన్ ప్రజలకు చెప్పాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ 5కోట్లమంది ప్రజల్ని నాలుగేళ్లనుంచి ఫూల్స్ నిచేస్తూనే ఉన్నాడని, తాను ప్రజలకుఏంచేసింది, ఇకముందు ఏంచేయబోతోంది వివరిస్తూ, ఆయన ప్రభుత్వం విడుదలచేసిన కరపత్రమే అందుకు నిదర్శన మని, ఈ వాస్తవాలను ప్రపంచ ఫూల్ దినోత్సవం సందర్భంగా నేడు ప్రజల ముందు ఉంచుతున్నామని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
“జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వముద్రతో విడుదలచేసిన కరపత్రంలోని ప్రతి అక్షరం బోగ సే. రాష్ర్ట్రాన్ని పాలిస్తున్ జగన్ ఫేక్.. అతనిపాలన ఫేక్.. అతనిమాటలు, చేతలు మొత్తం ఫేక్. జగన్ నాలుగేళ్లపాలనే అందుకు నిదర్శనం. నవరత్నాలపేరుతో 5కోట్లమందిని జగన్ దోచుకుంటూ, నల్లడబ్బుని తన నేలమాళిగల్లో దాచుకుంటున్నాడు. ప్రతిబహిరంగసభలో 98శాతం హామీలు అమలుచేసినట్టు జగన్ చెప్పుకుంటున్నాడు. అతనిమంత్రులుకూడా అ దే చెబుతున్నారు. ఎక్కడ అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ ఇచ్చిన హా మీల్లో ప్రధానమైనది 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలభర్తీ, మెగాడీఎస్సీ అమలు, ఏటా జాబ్ క్యాలెండర్ … వీటిలో నాలుగేళ్లలో జగన్ దేన్ని అమలుచేశాడు? గ్రామవాలంటీర్, వార్డ్ వాలంటీర్లను ని యమించడమేనా జగన్ అమలుచేసింది?
అప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు.. ఇప్పుడు మద్యం అమ్మకాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నా డు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఊరూవాడా తిరిగి మరీ కాపురాల్లో చిచ్చుపెడుతున్న మద్యాన్నిదశలవారీగా నిషేధిస్తానన్నాడు. ఎక్కడ మద్యాన్ని నిషేధించాడో చెప్పాలి. జగన్ నాలుగేళ్లలో మద్యాన్ని నిషేధించకపోగా, నేరుగా డోర్ డెలివరీచేస్తోంది. మద్యం అమ్మకాలపై జగన్ ఖజానాకు విపరీతంగా ఆదాయంవస్తోంది. జే-బ్రాండ్ పేరుతో నానాఛండాలమైన మం దు అంతా ఏపీలోనే అమ్ముతున్నారని పొరుగురాష్ట్రాల్లో చెప్పుకుంటున్నారు. జే-బ్రాండ్ మద్యం తాగి, జనమంతా పిచ్చిక్కి రోడ్లపై తిరుగుతున్నారనేది పచ్చినిజం. కల్తీమద్యం తాగి చనిపోయినవారి లెక్కకు అంతేలేదు.
అప్పుడు ప్రతిరైతుకి రూ.12,500లు రైతు భరోసా సాయం అన్నాడు.. ఇప్పుడు కేవలం రూ.7,500లతో సరిపెట్టి, రైతులనోట్లో మట్టికొట్టాడు
అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం ఇచ్చేసొమ్ముతో సంబంధంలేకుండా ప్రతిరైతుకి రైతుభరోసాకింద ఏటా రూ,.12,500లు ఇస్తానని జగన్ హామీ ఇచ్చాడు. కానీ ఇస్తున్నది కేవలం రూ.7,500లు మాత్రమే. కేంద్రమిచ్చే సొమ్ముతో కలిపి, అంతా తానే ఇస్తున్నట్టు పత్రి కలు, టీ.వీల్లో ప్రచారంచేసుకుంటున్నాడు. అప్పుడు 45ఏళ్లు నిండిన ప్రతిమహిళకు పింఛన్ అన్నాడు…ఇప్పుడు 15లక్షల పింఛన్లకు కోతపెట్టాడు
45 ఏళ్లునిండిన మహిళందరికీ రూ.3వేల పింఛన్ ఇస్తానన్నాడు. దాన్ని అమలుచేయకపో గా, గతప్రభుత్వం అర్హులైన వారికి ఇచ్చిన సామాజిక పింఛన్లకు కోతపెట్టాడు. అర్థంపర్థంలేని కారణాలు చెబుతూ, ఈ నాలుగేళ్లలో 15లక్షలకుపైగా పింఛన్లు రద్దుచేశాడు. 45ఏళ్లు పైబడిన ప్రతిమహిళకు రూ.3వేలు అన్న హామీని తుంగలో తొక్కాడు. పైసా విద్యుత్ ఛార్జీ పెంచనన్నాడు.. 4ఏళ్లల్లో రూ.57వేలకోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపాడు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పైసాపెంచనని ప్రజల్ని నమ్మించాడు. ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ ఇప్పటివరకు 8సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీలభారం మోపాడు. రూ.57 వేలకోట్ల భారంమోపి, ప్రజల్ని కోలుకోనీయకుండా దెబ్బతీశాడు. మరలా ఈ నెలనుంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో యూనిట్ కి 40పైసలచొప్పున ప్రతినెలా విద్యుత్ వినియోగదారులపై అదనపుభారం పడనుంది.
25మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానన్నవాడు..31 మందిని ఉంచుకొని కేసుల భయంతో మోదీకి వంగివంగి దండాలు పెడుతున్నాడు
ఎన్నికలకుముందు, 25మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలువంచుతా… మోదీని నిలదీస్తా… రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు. ఇప్పుడు తనచేతిలో 31మంది ఎంపీ లున్నా, కేంద్రానికి సాగిలబడ్డాడు. మోదీకి వంగివంగి దండాలుపెడుతున్నాడు. వైసీపీ 31 మంది ఎంపీలు పైరవీలు చేస్తుంటే, జగన్ మాత్రం ఢిల్లీకి తాడేపల్లికి తిరుగుతూ, రాష్ట్రానికి రా వాల్సిన వాటిని కూడా అడగలేని దుస్థితిలో ఉన్నారు. విభజనచట్టంలోని ఒక్క హామీని కూ డా జగన్ ఈ నాలుగేళ్లలో సాధించలేకపోయాడు. చివరకు పోలవరాన్ని 41.15మీటర్లకు కుదించేందుకు సిద్ధమై, రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టికొట్టాడు.
అమరావతి ఎక్కడికీ పోదన్నవాడు.. రాష్ట్రానికి రాజధానిలేకుండా చేశాడు. భూములిచ్చిన రైతుల్ని వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నాడు
అమరావతే రాజధాని.. అదిఎక్కడికీపోదు…నేనుకూడా అమరావతిలోనే ఇల్లుకట్టుకుంటాను అనిచెప్పి, భూములిచ్చిన రైతుల్ని, రాష్ట్రప్రజల్ని వంచించిన జగన్, 4ఏళ్లలో రాజధానిని సర్వనాశనంచేసి, మూడురాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనంచేశాడు. ఆఖరికి భూము లిచ్చిన రైతులకు కౌలుకూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. 1200రోజులుగా రైతులు రోడ్లపై కూర్చొని ధర్నాలుచేస్తున్నా..ఏనాడూ ఈ ముఖ్యమంత్రి కనీసం వారిముఖంకూడా చూసింది లేదు.
సీ.పీ.ఎస్ రద్దుచేస్తాను అన్నవాడు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపి, జీతాలే సక్రమంగాఇవ్వకుండా వేధిస్తున్నాడు
ఉద్యోగులకు సీ.పీ.ఎస్ రద్దుచేస్తానని చెప్పి మోసగించాడు. అధికారంలోకి వచ్చాక సీ.పీ.ఎ స్ రద్దుచేయమని అడిగారన్న అక్కసుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపా డు. సీ.పీ.ఎస్ రద్దుచేయడం చాలాకష్టమైనపని.. దానిగురించి తెలియక జగన్ హామీ ఇచ్చా డని సజ్జలతో సన్నాయినొక్కులు నొక్కించాడు. ఉద్యోగుల్ని వంచించి, వారికి సకాలంలో జీ తాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్న హామీని కూడా విస్మరించి, చివరకు తనను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో, ఉన్నఉద్యోగాలు పీకేస్తానంటూ వారినే బెదిరిస్తున్నాడు. 5కోట్లమందిని ఫూల్స్ చేసిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోయాడు.
5 ఏళ్లల్లో 25లక్షల ఇళ్లుకట్టిస్తాను అన్నవాడు.. 4ఏళ్లలో 5ఇళ్లుకట్టించి పేదల్నిరోడ్లపాలుచేశాడు
5ఏళ్లల్లో 25లక్షలఇళ్లు కట్టిస్తాను అని చెప్పాడు. తీరా 4ఏళ్లలో 5ఇళ్లు కట్టించి అభాసుపాలు అయ్యాడు. కేంద్రమే జగన్ ప్రభుత్వం 4ఏళ్లలో కేవలం 5 ఇళ్లుమాత్రమేకట్టిందని చెప్పింది. ఇ ళ్ల నిర్మాణం పేరుతో ఇప్పటికీ పేదల్ని వంచిస్తున్నాడు. చంద్రబాబు కట్టించిన ఇళ్లుపేదలకు ఇవ్వకుండా, తాను ఇళ్లనిర్మాణం చేపట్టకుండా పేద, బడుగుబలహీనవర్గాల్ని నట్టేట ముంచాడు. బాబాయ్ ని గొడ్డలితో వేసేసి, గుండెపోటుగా చిత్రీకరించి జగన్ అధికారంలోకివచ్చాడు. ఆ కేసు ఎక్కడ తనమెడకు చుట్టుకుంటుందోఅన్న భయంతో అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా పోలోమంటూ ఢిల్లీకి పరిగెత్తుతున్నాడు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు. 2022-23 ఆర్థికసంవత్సరంలో రూ.97వేలకోట్లఅప్పుతో దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలి పాడు. రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి దింపినఘనచరిత్రుడిగా జగన్ ను నిజంగా సన్మానించాల్సిందే.
బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని రూ.75వేలకు పెంచుతానని, బీసీలకు పదవులు, నిధులు రెండూ లేకుండా చేశాడు
అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల సబ్ ప్లాన్ ను రూ.75వేలకోట్లకు పెంచుతానని చెప్పిన జగన్, ఆఖరికి బీసీ కార్పొరేషన్ కు తాళాలేశాడు. చంద్రబాబు హాయాంలో బీసీలకు ఆదరణ కింద పనిముట్లు, కార్లు, వాషింగ్ మెషీన్లు, హెయిర్ సెలూన్ కుర్చీలవంటి వాటిని అందించా రు. జగన్ వచ్చాక ఆదరణ కింద ఒక్కచేతివృత్తిదారుడికి చిన్న దువ్వెనకూడా ఇచ్చిందిలే దు. బీసీ కార్పొరేషన్లన్నింటినీ మూసేసి, వాటిపరిథిలోని సొమ్మునికూడా తన ఖజానాలో వే సుకున్న ఘనుడు జగన్. కొత్త ఇసుకపాలసీ పేరుతో, భవననిర్మాణ కార్మికుల్ని, నిర్మాణ అనుబంధ రంగాలవారిని రోడ్డునపడేశాడు. పనికిరాని బీసీకార్పొరేషన్లు ఏర్పాటుచేసి, బీసీ ల్ని అవమానించాడు. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లకు కోతపెట్టి, 16,800 రాజకీయపద వుల్ని వారికిదూరంచేశాడు.
డ్వాక్రారుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు కుచ్చుటోపి పెట్టాడు
డ్వాక్రారుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి కోటి20లక్షలమంది డ్వాక్రామహిళలనెత్తిన కుచ్చుటోపీ పెట్టాడు. ఒక్కోసంఘం తీసుకునే రుణపరిమితిని రూ.7లక్షలకు పెంచుతాననిచెప్పి, ఆఖరికి బ్యాంకుల్లో పైసారుణం దొరక్కుండాచేశాడు. డ్వాక్రామహిళలు రుణాలు కట్టుకుంటుంటే, వారి అందించాల్సిన సాయాన్ని సకాలంలో ఇవ్వకుండా అప్పులభారం మరింతపెరిగేలా చేస్తున్నాడు. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి చేతిలో ఉన్న నీలిమీడియా, సోషల్ మీడియా సాయంతో నీతిమాలిన ప్రచారానికి తెగబడుతూ, ప్రతిపక్షాలపై, ప్రజలపై బురదజల్లుడు కార్యక్రమానికి తెరలేపాడు. ఫేక్ ప్రచారంతో ఫేక్ హామీలతో అధికారం ముగింపుదశలోకూడా జగన్ ప్రజల్ని వంచించడాని కి ప్రయత్నిస్తున్నాడు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నీచుల కే నీచుడు. ఐటీడీపీ ఆఫీస్ లో మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులు అంటూ నీతిమాలి న ప్రచారంచేస్తున్నాడు. టీడీపీమహిళానేతలు, కీలకమైన నేతల్ని కూడా వదలకుండా దు ష్ర్పచారంచేస్తున్నారు. ఆఖరికి నాపేరుతో కూడా పొత్తులగురించి ప్రస్తావిస్తూ దుష్ప్రచారానికి తెరలేపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిపేరుని దుర్వినియోగంచేస్తూ, ఆయన తప్పుడు సంతకంతో వైసీపీపేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారంచేస్తోంది. వైసీపీ పేటీఎం బ్యాచ్ కి ఉచ్ఛం..నీచం లేదు అనడానికి వారుచేస్తున్న విషప్రచారమే నిదర్శనం. టీడీపీ ఎవరితో ఎ ప్పుడు పొత్తుపెట్టుకుంటే, జగన్ కు అతని సోషల్ మీడియాకు, నీలిమీడియాకు ఏంటి సం బంధం? జగన్ అతని నీలిమీడియా, సోషల్ మీడియా చేసే దుర్మార్గపు ప్రచారం చూస్తుంటే నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తోంది. కానీసభ్యత అడ్డువచ్చి ఊరకుంటున్నాం.
అధికారం కోసం నీచంగా, హేయంగా దుర్మార్గంగా వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం సాగు తోంది. ఈ వ్యవహారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి నిర్వహిస్తున్నాడు
ప్రభుత్వముద్రవేసి మరీ వైసీపీ ప్రజలకు పంచిన కరపత్రంలోని హామీలు, వాటి అమ లుపై వైసీపీసోషల్ మీడియాకు సమాధానంచెప్పే ధైర్యముందా అని ప్రశ్నిస్తున్నాం. జగన్, అతని నీలిమీడియా, సోషల్ మీడియా ఎల్లకాలం ఫేక్ ప్రచారంతో ప్రజల్ని మోసగించలేరు. ఏప్రియల్1న జగన్ 5కోట్లమందిని ఎలా ఫూల్స్ ని చేశాడో, ఇకముందు ఎలాచేయబోతున్నా డో వివరించాము. ప్రజలు ఈ అబద్ధాలకోరు ముఖ్యమంత్రిని, నీతిమాలిన ప్రభుత్వాన్నినమ్మే స్థితిలో లేరు.
అమరావతి నిర్మాణం జగన్ పూర్తిచేసుంటే, హైదరాబాద్ ను మించిన నగరంగా మారేదన్న కేటీఆర్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి వినపడలేదా?
భారతదేశంలోనే అత్యంత అద్భుతంగా డిజైన్ చేయబడిన నగరంగా ఏపీ రాజధాని అమరావ తి నిలిచిందని, దాన్ని జగన్ నిలిపేయకుండా పూర్తిచేసుంటే, హైదరాబాద్ ఎప్పుడో వెనకబ డి పోయేదని స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆరేచెప్పారు. అమరావతిపై టీడీపీ ఎప్పుడూ ఒకేవైఖరికి కట్టుబడి ఉంది. అమరావతిని రాష్ట్రరాజధానిగా ప్రకటించింది తెలుగుదేశమే.. దాన్ని పూర్తిచేసేది కూడా టీడీపీ, చంద్రబాబే. అమరావతిప్రాంతంలో నిన్న బీజేపీ నేతలపై వైసీపీమూకల దాడి ముమ్మాటికీ ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందే. బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై ఆలోచించాల్సిన సమయం వచ్చింది. టీడీపీకార్యాలయంపై, టీడీపీనేతల ఇళ్లు, సంస్థలపై దాడులుచేసిన వైసీపీనేతలు, కిరాయిమూకలు ఇప్పుడు బీజేపీనేతలపైకి దాడుల కు పాల్పడుతున్నారు. ఇదిచూశాకైనా బీజేపీనేతలు ఏంజరుగుతుందో అర్థంచేసుకోకపోతే ఎలా? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమల్లోలేదు. టీడీపీనేతలపై దాడులుచేసిన వారికే పదవులు ఇస్తున్నారు. కీలకస్థానాలు కట్టబెడుతున్నారు. కొందరు పోలీస్ అధికారులు ప్రభుత్వానికి ఊడిగంచేస్తూ, శాంతిభద్రతల్ని, చట్టాల్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. పోలీస్ వ్యవస్థ ను జగన్ ప్రభుత్వం రాజకీయకక్షసాధింపులకు వాడుకుంటోంది అనడానికి అనేకఘటనలు నిదర్శనాలుగా ఉన్నాయి.”అని ఉమా స్పష్టంచేశారు.