ప్రభుత్వ భూములను అమ్మడం తెలంగాణను అమ్మకానికి పెట్టినట్లే

Spread the love

-తెలంగాణ మద్యం పాలసీ పై కూడా సమగ్రమైన విచారణ జరపాలి
-టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులైన బోర్డును తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి
-గోదావరి, కృష్ణ పై నిర్మించిన ప్రాజెక్టులతో ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాష్ట్ర సంపదను, ఆస్తులను అమ్ముకోవడానికి తెలంగాణ తెచ్చుకోలేదు. ప్రభుత్వ భూములను అమ్మడం తెలంగాణను అమ్మకానికి పెట్టినట్లే.హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను నిధుల సేకరణ పేరుతో ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సరికాదు.భవిష్యత్తు తరాలకు భూములు, నిధులు పోగుచేసి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనవర్గాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చింది.పేద, మధ్యతరగతి కుటుంబాలు, కిందిస్థాయి ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చడానికి లాభాపేక్ష లేకుండా హౌసింగ్ బోర్డు ద్వారా నిర్మాణాలు చేపట్టి ఇచ్చింది.స్వగృహ పథకం కింద నిర్మాణానికైనా ఖర్చు మాత్రమే తీసుకొని ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ ఎత్తివేయడం విడ్డూరం.హౌసింగ్ బోర్డ్, దిల్ భూములను అమ్మాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన.ఇల్లు లేకుండా లక్షల మంది పేదలు తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నారు. భూముల అమ్మకానికి పెట్టడం భవిష్యత్తు తరాలకు ప్రమాదకరం.ప్రభుత్వ భూముల అమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.

మోడీ అమిత్ షా తరహాలోనే కేసీఆర్ కూడా తెలంగాణ వనరులను తనకు కావలసిన వారికి దారాదత్తం చేస్తున్నారు.బొగ్గు గనులను ప్రైవేటు చేసినట్టే… మిగతా తెలంగాణ వనరులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్న కేసీఆర్.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కారకులైన బోర్డును తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నాం.2018 ముందస్తు ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్న అమలు చేయని కేసీఆర్ ప్రభుత్వం.

నాలుగు సంవత్సరాలకు సంబంధించిన నిరుద్యోగ భృతి లెక్క కట్టి చెల్లించాలి.చతిస్గడ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి నెలకు 2,500 చొప్పున ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పడి 9 ఏళ్లు దాటుతున్న గోదావరి, కృష్ణ పై నిర్మించిన ప్రాజెక్టులతో ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.ప్రశ్నిస్తే కేసులు, సంక్షేమ పథకాలు బందు చేస్తామని బెదిరింపులకు పాల్పడడం గొంతు నులమడమే.

కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా సాగునీటినందిస్తూ కాళేశ్వరం నీళ్లు అని గొప్పలు చెప్పుకోవడం సరైనది కాదు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగిన కాలువలు తొవ్వలేదు.ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను సీతారామ గా పేరు మార్చి ఏళ్లు గడుస్తున్న ఒకే ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వని సర్కారు. కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎందుకు?

తెలంగాణ మోడల్ లిక్కర్ పాలసీని ఢిల్లీలో అమలు చేశారని గతంలో ప్రభుత్వ పెద్దలు చాలా గొప్పగా చెప్పారు.తెలంగాణలో రూపొందించిన మోడల్ మద్యం పాలసీ ఢిల్లీలో కుంభకోణానికి దారితీస్తే మరి, తెలంగాణలో కూడా మద్యం స్కాం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ మద్యం పాలసీ పై కూడా సమగ్రమైన విచారణ జరపాలి అని దర్యాప్తు సంస్థలకు లేక రాస్తాను.

బెల్టు షాపులు వద్దంటున్న సర్పంచులపై పరోక్షంగా అధికారుల ఒత్తిడిలు, వేధింపులు పెరిగిపోతున్నాయి.లక్షల కోట్ల ప్రజల సంపద దోపిడీ చేసి పోగేసుకొని ఎన్నికలు రాగానే కొత్త స్కీములు తెస్తూ డబ్బుతో గెలుస్తామని చూస్తున్న ప్రభుత్వాలు.తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, డబ్బు ఒకటే చూడరు.

సింగరేణి ఆస్తుల ప్రైవేటీకరణ ను కాంగ్రెస్ అంగీకరించదు. బెల్లంపల్లి నియోజకవర్గం లోని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని పొట్యాల గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం, అడవి అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, అక్కడి గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.

వారి భూములను వారికే దక్కేలాగా పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులకు ఆదివాసులకు పోడు భూములపై పట్టాలు ఇస్తామని తెలిపారు. గతంలోని పార్లమెంట్ లో పోడు భూములపై బిల్లు చేసినప్పటికీ, ప్రభుత్వం పార్లమెంటును ధిక్కరించి రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుందని మండిపడ్డారు.

Leave a Reply