-న్యాయవాదుల పై దాడులు చేయించాడు
-న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
-కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం
-కోర్టుల్లో కూర్చోడానికి కుర్చీలు, బాత్ రూం లు కూడా లేవు
-న్యాయవాదుల పై ప్రొఫెషనల్ ట్యాక్స్ భారం పడకుండా చేస్తాం
-కడప జిల్లా న్యాయవాదులతో సమావేశమైన నారా లోకేష్
జగన్ పాలనలో న్యాయవాదుల పై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారు. మాకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలి. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లేదు. హెల్త్ కార్డులు ఇవ్వాలి. న్యాయవాదులు చనిపోతే ఇతర రాష్ట్రాల్లో 10 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఏపిలో మాత్రం 4 లక్షలు ఆర్ధిక సాయం అందుతుంది.హౌస్ సైట్స్ ఇవ్వాలి.
సరైన కోర్టు భవనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం కారు పార్క్ చేసుకునే అవకాశం కూడా కోర్టు వద్ద సదుపాయం లేదు.
హైకోర్టు ను కర్నూలు కి తరలిస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం మోసం చేసింది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే హై కోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చెయ్యాలి. కడప లో స్పెషల్ కోర్టులు రాలేదు. ఎసిబి, లోకాయుక్త లాంటి అన్ని స్పెషల్ కోర్టులు ఇతర జిల్లాల్లో ఉన్నాయి. మాకు స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. జూనియర్ న్యాయవాదులకు ఆర్ధిక సాయం అందించింది మొదట టిడిపి నే. కానీ ఇప్పుడు అర్హులకు జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులు అందరికి సాయం అందించాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ నుండి మమ్మలని మినహాయించాలి.
సిద్ధవటం కోర్టు భవనం నిర్మాణం పెండింగ్ లో ఉంది. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చెయ్యాలి. జగన్ ప్రభుత్వం లో న్యాయవాదులకు ఎటువంటి సంక్షేమం అందడం లేదు. లైబ్రరీ, పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నాం. లాయర్ల పైనే పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. న్యాయవాదులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కడప జిల్లా న్యాయవాదులు
వారి సమస్యలపై స్పందించిన లోకేష్ ఏమన్నారంటే..జగన్ ఒక ఉగ్రవాది. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసాడు. ప్రజావేదిక కూల్చి పరిపాలన ప్రారంభించాడు. జగన్ పాలనలో న్యాయవాదులు కూడా బాధితులే. న్యాయవాదుల పై దాడులు చేయించాడు జగన్. న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన జగన్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.రాజకీయ లబ్ది కోసమే జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు.మూడు రాజధానుల పేరుతో మోసం తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.నేషనల్ లా కాలేజ్ కర్నూలులో ఏర్పాటు చెయ్యాలి అని టిడిపి అనుకుంటే దానిని జగన్ వేరే ప్రాంతానికి తరలించాడు.
కోర్టుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో నేను స్వయంగా చూసాను. కనీసం కూర్చోడానికి కుర్చీలు, బాత్ రూం లు కూడా లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ శాఖ కు అధిక నిధులు కేటాయించి నూతన భవనాలు, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. మొదటి మూడు ఏళ్ల లోనే కొత్త భవనాలు ఏర్పాటు చేస్తాం.
సరైన మౌలిక వసతులు, సదుపాయాలు లేకపోవడంతో కేసులు కూడా ఆలస్యం అవుతున్నాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితులు మెరుగుపరుస్తాం. న్యాయవాదులు చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన హెల్త్ కార్డులు అందిస్తాం. నాణ్యమైన ఇళ్లు కట్టించి న్యాయవాదులకు ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల పై ప్రొఫెషనల్ ట్యాక్స్ భారం పడకుండా చేస్తాం.
టీడీపీ లీగల్ సెల్ ని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడు కష్టపడిన వారికి ఖచ్చితంగా పదవులు ఇస్తాం. నామినేటెడ్ పదవులు కూడా న్యాయవాదులకి ఇస్తాం. చట్టాన్ని అతిక్రమించి న్యాయవాదుల పై కేసులు పెట్టిన అధికారుల పై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటాం.