-వైసీపీపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ ఇక్బాల్
-పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా
-రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అన్యాయాన్ని వివరిస్తా
-చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరమని వెల్లడి
హిందూపురం: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇటీవల ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండలి చైర్మన్‌కు ఫార్మాట్‌లో రాజీనామా పంపి ఆయనతో మాట్లాడి ఆమోదించాలని కోరారు. మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం లేదని, మైౖనార్టీల ద్రోహి జగన్ ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అంతేకాకుండా తీవ్ర ఆరోపణలు చేసి షాక్ ఇచ్చారు. బైజూన్, లిక్కర్ భారీ స్కామ్‌లని ఆరోపణలు చేశారు. సీఏఏకు మద్దతు కూడా ఇచ్చిందని చెప్పిన ఆయన వైసీపీలో గౌరవం లేకపోవడంతో బయటకు వచ్చేసినట్లు తెలిపారు. అనుభవజ్ఞుడు చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరమని అన్నారు. మైనార్టీలకు ఒక్క పథకాన్ని అమలు చేయని వైసీపీ తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని వెల్లడిరచారు.