Suryaa.co.in

Andhra Pradesh

బెయిల్‌పై తిరుగున్న జగన్ బయటా? జనం కోసం బతికే బాబు జైల్లోనా?

– అధికారం ఉందని విర్రవీగవద్దు
– పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే నష్టపోతారు
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య

డజన్ల కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి బెయిల్‌పై ఉన్న జగన్ బయట.. జనం కోసం అవిశ్రాంతంగా పనిచేసే టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటం దురదృ్టష్టకమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగవద్దని, ఇలాంటి అధికారం టీడీపీకి కొత్తకాదన్నారు. ఎటొచ్చీ అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులే నష్టపోతారని హెచ్చరించారు.

పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకులు, ఎటువంటి అవినీతి మచ్చలేనటువంటి చంద్రబాబునాయుడుపై రాజకీయ దురుద్ధేశ్యంతో అక్ర మ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 43 వేల కోట్ల రూపాయలు స్కాంలో ఆర్థిక నేరగాడిగా సిబిఐ 11 ఛార్జ్ షీట్లు నమోదు చేసి 16 నెలలు జైలుశిక్ష అనుభవించి, ఏ1 గా ఉన్న నిందితుడు చట్టాన్ని దిక్కరించి బయట తిరుగుతున్నాడన్నారు.

కానీ అహర్నిశలు, రాష్ట్రం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసిన చంద్రబాబును జైలులో పెట్టడం ఎంతవరకు సమంజస మన్నారు.ప్రపంచ వ్యాప్తంగా బాబు అరెస్టును అందరూ ఖండిస్తున్నారన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేయాలనుకుంటే అది తిరిగి మన మీదే పడుతుందన్న విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. పోలీసులు వైసీపీ నాయకులను సంతృప్తి పరచడానికి ఆదుపుతప్పుతున్నారన్నారు.వైసీపీ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందన్నారు. త్వరలో చట్టం గెలవబోతుందన్నారు.

రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వానికి 2024 ఎన్నికల్లో నారా లోకేష్ ను భారీ మేజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవినితిపై ఘటుగా స్పందించారు. ఉండవల్లి కొండను అక్రమంగా తవ్వి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గిరి ప్రదక్షిణ పేరుతో మంగళగిరి కొండ గ్రావెల్ దోపిడీ, కాజా, ఇప్పటంలో మట్టి దోపిడీ, నీరుకొండ, ఎయిమ్స్ కొండలను అక్రమంగా దోచేశారన్నారు.

కొన్ని రోజుల క్రితం నవులూరు చెరువును 40 అడుగుల లోతున అక్రమంగా తవ్వేస్తే ఆ చెరువులో పడి చిన్న పిల్లవాడు చనిపోతే ఇప్పటి వరకు అధికారులు, ఎమ్మెల్యే పరామర్శించలేదన్నారు. గౌతమ్ బుద్ధ రోడ్డు వెడల్పు పేరుతో దోపిడీ చేశారన్నారు. నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకోని పెద్ద పెద్ద మిషన్లు, జేసీబీలతో నిత్యం వందలాది లారీలతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి వందలాది కోట్లు కూడగట్టుకున్నారని ఆరోపించారు.

ప్రజా వేదిక కూల్చివేత నుండి తెలుగునాడు చేనేత కార్మిక భవనం,పేదలకు అన్నం పెట్టె మంగళగిరి అన్న కాంటీన్ లను జేసీబీలతో కూల్చివేశారన్నారు. చరిత్రలో మొదటిసారి కృష్ణాయపాలెంలో ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్ట్రాసిటీ కేసు నమోదు చేసిన ఘనత కరకట్ట కమల్ హాసన్ కు చెందుతుందని విమర్శించారు. నియోకవర్గంలో వేలాది పేదల ఇళ్లను తొలగించారన్నారు.

తాడేపల్లిని గంజాయి అడ్డాగా మార్చివేశారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో మహిళపై అత్యాచారం జరిగితే ఇంతవరకు నిందితులను పట్టుకోలేదన్నారు. బీసీ ముస్లీం మహిళ ఎంపీపీ కాకుండా బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. బీసీ మహిళాపై అత్యాచారం, హత్యా జరిగితే నిందితులకు అండగా నిలిచి, పరామర్శకు వెళ్లిన లోకేష్ పై రాళ్ల దాడి, ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ బాధతత్వ హృదయాలతో నిరసనలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ లాంటి వ్యక్తిని నాయకుడిని సీఎంగా ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అన్నారు. పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు చేయించుకున్న జగన్‌కు మానవతా విలువలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

దుగ్గిరాలలో బీసీ ముస్లీం మహిళ ఎంపీపీ కాకుండా బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రధాన సూత్రదారులు జగన్, కేసీఆర్ లే అన్నారు. రాజధాని లేని అమరావతిని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారన్నారు. జగన్ తన సొంత సామాజికవర్గానికే అన్ని కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క అవకాశం అంటూ ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి.. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. కూల్చివేతలు, ప్రతిపక్షాలపై వేధింపులు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.

పోలీస్ వ్యవస్థను తన అధినంలో పెట్టుకొని జగన్ రాష్ట్రంలో విధ్వంసలు సృష్టిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టడం వంటి కార్యక్రమాలకే నాలుగున్నరేళ్ల సమయం సరిపోయిందన్నారు. జగన్ రూ. 43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని స్వయంగా సీబీఐ నిర్ధారించిందన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలన్న ప్రతి ఒక్కరు భావిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలలో జగన్ కు పతిపక్షం హోదా కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. న్యాయం చంద్రబాబువైపే ఉందని, ఆయన కడిగిన ముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి తన ఫ్యాక్షన్ రాజకీయంతో నాలుగున్న సంవత్సరాలుగా రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టేశారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై అనేక ఆరోపణలు గుప్పించారని, వాటిలో ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని అన్నారు. కేవలం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి కక్షపూరితం గా కుట్ర పన్నారన్నారు. చేయని తప్పు నకు కేసు మోపి చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని అన్నారు.

42 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు కళ్ళముందే కన్పిస్తున్నాయన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా కొన్ని లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో వారు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రకరకాల విన్యాశాలు చేస్తారని విమర్శించారు. ఆర్కేకు ఫిర్యాదు చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదన్నారు. 2018 జూలైలో ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అభ్యంతరాలు ఉంటే తెలియజేశాలని బహిరంగ ప్రకటన ఇస్తే 1000 మంది సి.ఆర్.డి కార్యాలయానికి వెళ్ళీ తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటే అప్పడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కిలోమీటర్లు ఫైబర్ నెట్ కేబుల్స్ వేస్తే 2019లో ఆ కేబుల్స్ ను కత్తిరించి వాళ్ళే ఎదురు టీడీపీ నాయకులపై కేసులు బనాయించారని మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా కేసులుపై బయట తిరుగుతున్న వ్యక్తి ఈ ప్రపంచంలో ఏవరు లేరన్నారు. మేము తప్పు చేయలేదు కాబట్టే అన్నీ డాక్యూమెంట్స్ చూపిస్తున్నామని వ్యాఖ్యనించారు. కల్తీ మద్యం తాగి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 10 వేల మంది వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్సా పొందగా, విశాఖపట్నం జీజీహెచ్ లో 37 మంది చనిపోవడం బాధాకరమన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ వెంట సెక్షన్లు పరుగెడతాయని ఎద్దెవా చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కేకు సహకరిస్తున్న అధికారులను కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. వారు రిటైర్డ్ అయిన చర్యలు తప్పవన్నారు. చంద్రబాబు ను అక్రమ కేసులో ఇరికించడాన్ని ప్రజలు సైతం జీర్ణించుకోలేక పోతున్నారని, 2024 ఎన్నికల్లో సీఎం జగన్ అందుకు తగిన మూల్యం చెల్లించు కోక తప్పదన్నారు.

నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరాధారమైన కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఆనాడు రాజధానికి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమరావతిని విచ్చిన్నం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేందుకు టీడీపీతో కలిసి జనసేన పనిచేస్తుందని తెలిపారు.

ఈ నిరసన దీక్షలో కూర్చున్న రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, కేసంనేని శ్రీఅనిత, వల్లభనేని వెంకట్రావు, మంగళగిరి పట్టణ ఉపాద్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివసాంబిరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివసరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, రాష్ట్ర మహిళ కార్యదర్శి వింజమూరి ఆషాబాల, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, నియోజకవర్గ తెలుగుయువత పడవల మహేష్, తాడేపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి, మహ్మద్ ఇబ్రహీం, పేరం ఏడుకొండలు, అన్నం నాగబాబు, వాకా మాధవరావు, అన్నె కుసుమా, దిండ్ల సత్యానందం, దామర్ల రాంబాబు, కృష్ణవందన, పాలది ఏసుదాసు, నల్లగొండ పరమేశ్వరరావు, బట్టు వెంకటేశ్వరరావు, తెనాలి మాణిక్యం, నెమలకంటి అనూష, ఎండీ జీలాలుద్దీన్, అప్పల శాంతి, యలమంచిలి పద్మజా, వాసా పద్మవతి, విశ్వనాథపల్లి ఉమాదేవి, బెజ్జం కుమార్, ఉన్నం ఝాన్సీ, గడ్డిపాటి తులసీ, అల్లూరి వసంతి, ముక్కపాటి కవిత, యలమంచిలి సింధూష, చిన్న సంతోష్ కుమార్, జాస్తీ ప్రవీణ్, మన్నెం పద్మ, షేక్ నూరిల్లా, పాల అశోక్ యాదవ్, పారా రామకృష్ణ, తాతినేని వెంకట్, లాయర్లు తోట శివరాం ప్రసాద్ యాదవ్, జవ్వాది విజయ్ కుమార్, శ్రీ భాష్యం రంఘనాథ్, కురపాటి బాబు అంబేడ్కర్, జొన్నాదుల లేనిన్ బాబు, కురపాటి మురళీ రాజు, ఈస శ్రీనివాసరావు, వేమూరి రత్న ప్రసాద్, బేతపూడి నాయుడమ్మ, బుర్రముక్కల శివ రాజేష్ రెడ్డి, కట్టేపొగు కోటేశ్వరరావు, సొమినేని వెంకట రేఖశ్రీ, రాచబత్తుని శ్రీనివాసరావు, కురగంటి రమేష్, మన్నం వెంకయ్య, వడ్డేశ్వరం ప్రసాద్ రావు, మునగపాటి ప్రసాద్, ముక్కు పద్మ కళ్యాణి, గుడవల్లి ప్రదీప్ కుమార్, చిలకా హేమంత్, నెమలకంటి రజిని, జంజనం అమర్నాథ్, ముల్పూరి లేవిన్ బాబు, నంబూరు కోటేశ్వరరావు, రాజేష్, ఆషాబాల, రాచబత్తిన శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE