Suryaa.co.in

Andhra Pradesh

నేరాలు, ఘోరాలకు రాజు జగన్‌!

– బూతుల తిట్లంటే మాజీ సీఎంకు ఇష్టం!
– లోకేష్ కి, జగన్‌కు పోలిక లేదు
– దిశా చట్టం లేదు అది కేవలం బిల్లు మాత్రమే..
– దానిని కేంద్రం ఆమోదించలేదు
– దీనిపై లోకేష్‌ సవాల్‌ చేస్తే ఉలుకుపలుకు లేదు
– మీరు పెంచిన గంజాయి మూలాలు పెకిలిస్తున్నాం…
– ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

మంగళగిరి: ఈ భూమి మీద ఏ మనిషి చేయనన్ని నేరాలు, ఘోరాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈ మేరకు ఆమె గురువారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

నేరాలు, ఘోరాలు, మనీ లాండరింగ్ ప్రజల ఆస్తుల్ని కొట్టేసి 31 కేసుల్లో నిందితునిగా ఉండి బెయిల్ మీద బయట తిరుగుతూ 2019-2024 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పీడలా దాపురించి, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, నవ రత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడడటం, పరిశ్రమలను వెళ్లగొట్టడం, యువతను గంజాయికి, డ్రగ్స్ కి బానిసలుగా మార్చడం, 2 లక్షల మంది మహిళలు, చిన్నారులపై దాడులు జరిగితే మిన్నకుండి పోవటం, ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయడం, పోలవరాన్ని గాలికొదిలేయడం ఇన్ని నేరాలు ఘోరాలు చేసి ప్రజలు ఛీ కొడితే 11 సీట్లకు పరిమితమయిన జగన్మోహన్ రెడ్డి… ఈ రోజున తల్లి తండ్రులను దైవ సమానంగా భవిస్తూ, 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించి, 26 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించి, నీ వలన ఇబ్బందులు పడ్డ విద్యార్థుల భవితకు చేయూతనందిస్తూ, లక్ష మందికి ఈ పాటికే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పెట్టుబడుల ఆకర్షణకు తన వంతు ప్రయత్నం చేస్తున్న లోకేష్ గారిపై విమర్శలు చేయడానికి సిగ్గు పడాలన్నారు.

లేని దిశా చట్టం గురించి పదే పదే ప్రస్తావిస్తూ లోకేష్ పై, హోం మంత్రి అనిత పై విమర్శలు చేయటం సరి కాదు. మీ హయాంలోనే దిశా చట్టం లేదు అది కేవలం బిల్లు మాత్రమే. కేంద్రం దానిని ఆమోదించలేదు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని లోకేష్ సవాలు విసిరితే దానికి అంగీకరించే దమ్ముందా? గంటల తరబడి రోజుల తరబడి అబద్దాలు చెప్పడమే మీ పని కదా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు.
నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా టీసీఎస్ , ఫాక్స్కాన్, ఇతర ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు కష్టపడుతుంటే లోకేష్ పై విమర్శలు చేస్తూ జగన్ రెడ్డి కి ఉన్న భయాన్ని బయట పెట్టుకుంటున్నారు.

కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల నిధిని ఏర్పాటు చేసిన నారా లోకేష్ కి, కార్యకర్తలను గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి కి పోలికే లేదన్నారు. మహిళలను బూతులు తిట్టించి సంతోష పడే వ్యక్తి జగన్మోహరెడ్డి అని మీ పార్టీ కోసం పని చేసిన మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. దీనికి మీ దగ్గర సమాధానముందా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు,. జగన్ రెడ్డి ఇంటికి కూత వేటు దూరంలో అత్యాచారం జరిగితే బయటకు రాని జగన్ రెడ్డి మహిళా భద్రతకు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మసి పూసి మారేడు కాయ చేయడం రాష్ట్ర మహిళలు గమన్నిస్తున్నారని జగన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయని, గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం వంటి పనులన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కి గురవుతున్నాడు. ప్రజల సొమ్ము కొట్టేసి సంపాదించిన ఆస్తుల్ని చెల్లికి ఇవ్వడానికి మాట తిప్పి, మడమ తిప్పి నాటకాలాడుతున్నారు. మీ హయాంలో జరిగిన ఇసుక, మద్యం మాఫియా, స్కాములు, కబ్జాలపై సమాధానముందా, మిస్సయిన 30,000 మంది మహిళలపై సమాధానముందా అని ప్రశ్నించారు. మీరు పెంచిన గంజాయి మూలాలు పెకిలించటానికి కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు చంద్రబాబు గురించి, లోకేష్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే జాగ్రత్త అని హెచ్చరించారు.

LEAVE A RESPONSE