-పేదల పెన్నిధి చంద్రబాబు
-పేదవాడి కుమారుడు సంపన్నుడు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం
-టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న
పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పేదవాడి కుమారుడు సంపన్నుడు కావాలన్నదే చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు అన్న క్యాంటీన్లను నెలకొల్పితే జగన్ వాటిని రద్దు చేశారు. పేదలకై చంద్రబాబు విదేశీ విద్య ప్రవేశపెడితే.. జగన్ విదేశీ విద్యను రద్దు చేశారు.
జగన్ నాసిరకం బూం బూం బ్రాండ్లతో మద్యం ప్రియుల ఆరోగ్యాలను పాడుచేశారు. ధనవంతులకే అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్లు ఇచ్చిన వ్యక్తి జగన్. దుబాయి షర్టులు, లక్ష రూపాయల చెప్పులు తొడిగే వ్యక్తి జగన్. మద్యం, ఇసుక, గ్రానేట్ కావేవీ జగన్ కు అనర్హం అన్నట్లు అన్నింటా అవినీతే. రాష్ట్రాన్ని హోల్ సేల్ గా అమ్మేద్దామనే ఆలోచన జగన్ ది. రిక్షా కార్మికుడు రిక్షానే తొక్కాలి, భవన కార్మికుడి కొడుకు కార్మికుల్లాగానే ఉండాలన్నది జగన్ కాన్సెప్ట్.
పేద ప్రజల నివాసాలు తొలగించి జగన్ తన ఇంటికి రోడ్లేసుకున్నాడు. చంద్రబాబు బస్సులో ఉండి పరిపాలన చేశాడు, జగన్ అలా చేయగలడా?. చంద్రబాబుపై నిందలు వేసినవారికి నేడు శిక్ష పడడం గుర్తించుకోవాలి. సీఎం జగన్ రెడ్డి తానేదో పేదల్ని ఉద్దరిస్తున్నట్టు…చంద్రబాబు పేదల ద్రోహి అన్నట్టుగా అబద్దాలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలనుకోవటం సిగ్గుచేటు.
చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా పేదల పక్షపాతే
చంద్రబాబు అధికారపక్షంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా ఆయనెప్పుడూ పేదల పక్షమే, బడుగు,బలహీన వర్గాల బందువే. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్ధానం మొదలైన నాటి నుంచి నేటి వరకు ఆయన ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం పేద ప్రజల అభ్యున్నతి కోసమే. చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడితే వాటిని రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటికి రద్దు చేసి పేద ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ పిల్లల చదువులకు అడ్డంపడ్డ దుర్మార్గుడు జగన్ రెడ్డి.
చంద్రన్న బీమాను నీరుగార్చి కోటి 30 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత తొలగించిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. ఇసుక, సిమెంటు ధరలు మూడు రెట్లు పెంచి భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీసి 30 లక్షల కార్మికులను పస్తులు పాలుచేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. అన్న క్యాంటీన్ల ద్వారా రూ. 5 కే చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చితే వాటిని రద్దు చేసి పేదల పొట్ట కొట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.
ధరల పెంపులో నెంబర్ వన్ జగన్
డీజీల్, పెట్రోలు, గ్రీన్ టాక్స్, పోలీస్, ఆర్టీఓ జరిమానాలు పెంచి మోటార్ రంగ కార్మికుల పొట్టగొట్టారు. మధ్యం రేట్లు మూడు రెట్లు పెంచడమే కాకుండా, జగన్ రెడ్డి బినామీ కంపెనీల్లో తయారైన నాశిరకం మద్యం పోసి మందుబాబుల భార్యల తాళిబొట్లు తెంచుతున్న పేదల ద్రోహి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి నాసిరక మద్యం త్రాగి 35 లక్షల మంది అనార్యోగం పాలయ్యారు, 30 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరెంటు బిల్లులు మూడు రెట్లు పెంచి సంక్షేమ పథకాల్లో కోతల కోస్తున్న పేదల ద్రోహి జగన్ రెడ్డి కాదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ.1,14,664 కోట్లు దారిమళ్లించిన
సామాజిక న్యాయద్రోహి జగన్ రెడ్డి
20 వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అలాగే తన బినామీ విద్యుత్ కంపెనీల కోసం 75 వేల ఎకరాలు ఆదివాసీల భూములు కాజేస్తున్న గిరిజన ద్రోహి జగన్ రెడ్డి.
లక్ష బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోగా చంద్రన్న 6 లక్షలమందికి ఇచ్చిన నిరుద్యోగ భృతి రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. పండగ కానుకలు, పెళ్లికానుకలు, విదేశీవిద్య రద్దుచేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి. రంజాన్ తోఫా, దుల్హన్ రద్దు చేసిన మైనారిటీ ద్రోహి జగన్ రెడ్డి స్థానిక సంస్థల్లో 10 శాతం బీసీ రిజర్వేషన్లు రద్దు చేశారు.
16,800 రాజ్యాంగబద్ధ పదవుల్ని బీసీలకు దూరం చేసిన ద్రోహి జగన్ రెడ్డి
ఇలా పేదల విద్రోహాల్ని కప్పిపెట్టుకునేందుకు పేదల పట్ల కపట ప్రేమ ఒలకబోస్తూ సిద్దం సభల్లో తన నటనను రక్తి కట్టిస్తున్నారు. పెత్తందారుడు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి, కరుగుగట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అతని మాయ మాటలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్దంగా లేరు, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని బంగాళఖాతంలో కలిపేందుకు సిద్దంగా ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే పేదలకు మంచి రోజులొస్తాయి, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్ ఉంటుందన్న భావనలో రాష్ట్ర ప్రజలున్నారు. ఎన్నికల ముందే వైసీపీ ఓటమి ఖాయమైంది, అన్ని వర్గాల ప్రజలను జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమేందుకు సిద్దంగా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తెలిపారు