Suryaa.co.in

Political News

బలిజలూ జగన్ బాధితులే

దశాబ్దాల తరబడి కాపు పేరు ప్రాభవంతో తెరమరుగైన బలిజలకు, టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్రతో కొంచెం భరోసా కనిపిస్తోంది. వివిధ వర్గాలకు ఆయన ఇస్తున్న హామీ, భరోసానే దానికి కారణం. సంఖ్యాపరంగా కాపుల కంటే బలిజల శాతమే ఎక్కువైనప్పటికీ, కాపుల మాదిరిగా బలిజలు ‘పొలిటికల్ మార్కెటింగ్’ చేసుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా బలిజలు కాపుల చాటున బతకాల్సిన దుస్థితి కొనసాగుతోంది. బలిజలను ముందు పెట్టి.. తమ రాజకీయ హక్కులు సాధించుకున్న కాపుల చాణక్యం ముందు బలిజలు బలయిపోయారు. ఇంకా పోతూనే ఉన్నారు. కాపు- బలిజ అంతా ఒక్కటే అని నినదించే కాపుల రాజకీయ మనుగడ వ్యూహం ఇకపై చెల్లదు. పారదు!
దివంగత ఎన్టీఆర్ ఇప్పటికీ బలిజల గుండెల్లో నిలిచిన మహానేత. ఆ స్థాయిలో ఈ జాతిని నెత్తినపెట్టుకున్న మహామనిషి ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆశ లోకేష్ హామీలతో చిగురిస్తోంది. గత ఎన్నికల్లో బలిజలను వాడుకుని వదిలేసిన జగన్‌ను, ఈ జాతి మళ్లీ నమ్మేందుకు సిద్ధంగా లేదన్నది నిష్ఠుర సత్యం.

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజలుగా పిలవబడే ఏకైక బలమైన సామాజిక వర్గం. గత దశాబ్ద కాలంగా , ఈ వర్గం రాజకీయంగా కొన్ని వర్గాల కుట్రలో భాగంగా అణకదొక్కబడుతునే ఉంది. ఉనికి కూడా రాజకీయంగా దాదాపు కోల్పోయే పరిస్థితి దాపురిస్తోందని , కొన్నేళ్లుగా ,మాధ్యమాల ద్వారా మా వాణి నీ , ఆవేదనని, నొక్కి వక్కాణించి, చెపుతూనే ఉన్నా, న్యాయం జరగలేదు.

అయితే, కనీసం ఇప్పటికయినా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత లోకేష్ బాబు బలిజలకు అన్యాయం జరుగుతోంది అని గ్రహించినందుకు వారికి ధన్యవాదాలు. అసలు ఈ వివక్షకు కారణమేంటి లోతుగా ఒకసారి విశ్లేషిస్తే.. రెండు రకాలుగా బలిజలు మోసపోవడం జరుగుతోంది.

కాపులు మొదటినుంచీ రాష్ట్రం లో అత్యధిక శాతం జనాభా కలిగిన జాతి. అంటే దాదాపు పాతిక శాతం ( అందులో బలిజలే ఎక్కువ) , రాజకీయంగా ఎక్కువ లబ్ది వారికే చెందటం, బలిజలకు , వర్గీకరణ లో మొత్తంగా కాపులుగా పరిగణించబడ్డం తో కాపులు ఎదగటం, బలిజలు ప్రాధాన్యత కోల్పోవటం జరిగింది. ఒకే జాతిలో జరిగే ఈ అసమానతలను గుర్తించిన ఒకే నాయకుడు ఎన్టీరామారావు గారు.

అందుకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం లోనే రాయలసీమలో బలిజలు దాదాపు 10 నియోజక వర్గాల్లో ( పార్లమెంటు తో కలిపి) అవకాశం ఇవ్వటం, గెలవటం కూడా జరిగింది. ఈ దామాషాలో కోస్తాలో ఉన్న కాపుల విషయానికి కి వస్తే .. అప్పట్లో ఆ ప్రాంతాల్లో రాజకీయంగా రాజులు ప్రాబల్యం ఉంటే, రాజశేఖరెడ్డి గారు కాపులకు ప్రాధాన్యత ఇవ్వటం దరిమిలా, క్రమేణా బలిజలు సంఖ్య తగ్గుతూ ఉన్నా, చంద్రబాబు గారు వీరి ప్రాధాన్యాన్ని కొంతలో కొంత విడబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా, కొనసాగించటం వలనే తెలుగుదేశం పట్ల అనుకూలత ఉండటం నిజం.

అయితే వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత.. బలిజలు గుర్తింపు క్రమేణా తగ్గటమే గాక, ఒకరకమైన అభద్రతాభావం బలీయంగా ఉత్పన్నం కావటానికి ప్రస్పుటంగా, బలిజ భవన్ నిర్మాణాల్లో గానీ, ఆస్తుల, వ్యాపార పరిరక్షణలో కొంత ఇబ్బందికర వాతావరణం కొన్ని ప్రాంతాల్లో చవిచూసిన దరిమిలా , టీడీపీ వైపు మొగ్గు చూపాలని ఈ ప్రాంత జాతి ఆలోచిస్తున్నా, తిరిగి పోయిన దఫాలో జరిగినట్లు రాజకీయ కీయంగా మళ్ళీ టీడీపీ లో అన్యాయం జరుగు తుందేమో, అన్న మీమాంస బలంగా బలిజలు మదిలో తొలుస్తోంది.

దీనికి కారణం , బలిజ ల దగ్గర డబ్బులే దు అని బాహాటంగా మాధ్యమాల్లో వేరే సామాజిక వర్గాల వారు మాట్లాడటం. అది బలిజలని అవమానించటమే కదా! ఈ జాతికి రాజకీయ ప్రాధాన్యత కలిపించటమంటే.. ఎమ్మెల్యే టికెట్ల కోసమే కాదు కదా? అవకాశం, అర్హత, ప్రజాబలం ఉన్న చోట గుర్తించమని, లేనిచోట ప్రతి నియోజక వర్గం నుంచి, నియామకం ద్వారా ఏదొక విధంగా రాజకీయంగా గుర్తింపు ఇవ్వమన్నదే ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష.

కానీ ఇప్పటి.వాస్తవ పరిస్థితి చూస్తే ..ఈ జాతి ప్రాబల్యం కలిగిన 72 నియోజక వర్గాల్లో ఒకే ఒక శాసన సభ్యుడుంటం. వేరే ఎలాంటి చిన్న నామినేషన్ పదవి ( ఒకటో, అరో, తప్ప) లో కూడా బలిజలు కనిపించక పోవడం,. సంఖ్యా పరంగా చాలా తక్కువ ఉన్న సామాజిక వర్గాలను ప్రోత్సహించి, బలిజ ల ఉనికిని ఒక క్రమ పద్ధతిలో తీసేయటం చూస్తే.. రాజకీయం గా కనుమరుగు చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది.

వైఎస్సార్సీపీ గుర్తిస్తుంది అన్న ఒక చిన్ని ఆశతో , గత ఎన్నికల్లో చాలా వరకు అటువైపు మొగ్గు చూడటం జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ నాలుగేళ్ల లో అడియాశే మిగలటమే గాక, కొత్తగా అభద్రతాభావం అలుముకోవటంతో, టీడీపీ వైపు ఆశగా చూస్తున్న రాయలసీమ లోని బలిజలు కు.. తిరిగి పునర్వైభవం కలిగించి, టీడీపీ బడుగు, బలహీన వర్గాలకే గాక , సామాజిక పరంగా గతంలో మాదిరిగా ఖచ్చితమైన సమతూల్యం పాటించి ,ఆవిధంగా బలిజల ఆకాంక్షలు గుర్తించాలి. యువనేత లోకేష్ ఆ మేరకు బలిజల మనోభావాలు గౌరవించి, బలిజల మన్ననలు పొందాలని, పొందగలరన్న విశ్వాసం ఈ జాతిలో కనిపిస్తోంది. బలిజ జాతిని ఆదరించిన తాత దారిలో మనువడు కూడా నడుస్తారని, నడవాలన్నది అందరి ఆకాంక్ష

– ఓ.వి.రమణ
బలిజనాడు క న్వీనర్
                                                           (టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు)

LEAVE A RESPONSE