Suryaa.co.in

Andhra Pradesh

54 లక్షల పించన్లు టీడీపీ ఇచ్చిందని జగనే చెప్పాడు.. కాదని నిరూపిస్తే మా పార్టీ మూసేస్తాం

• మా సవాల్ ని స్వీకరించే దమ్ము, ముఖ్యమంత్రికి ఉందా?
• అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.3వేల పింఛన్ ఇస్తానన్న జగన్ రెడ్డి, దశలవారీ పెంపుతో పేదల్ని దగాచేస్తున్నాడు.
• జగన్ అసమర్థతతో ఈ మూడున్నరేళ్లలో ఒక్కో పింఛన్ దారుడు రూ.33వేలు నష్టపోయాడు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ది గ్రేట్ లయ్యర్ (పచ్చిఅబద్దాలకోరు) జగన్మోహన్ రెడ్డి, గోబెల్స్ ప్రచారంలో, వాస్తవాల వక్రీకరణలో ప్రపంచంలోనే ఉద్ధందుడిగా నిలిచాడని, కోట్లరూపాయలప్రభుత్వ సొమ్ముతో, ప్రజల్నితప్పుదారి పట్టిస్తూ, ముఖ్యమంత్రి, ఆయనప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికిచెప్పిన అబద్ధాలే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా చెప్తున్నాడు. మాటమార్చడం, మడమతిప్పడంలో తనకుతానే సాటి అయ్యాడు. ఎన్నికలకు ముందు సామాజిక పింఛన్ల పరిమితిని రూ.3వేలకు పెంచుతానని చెప్పాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఇస్తానన్నసొమ్ముని కొద్దికొద్దిగా పెంచుకుంటూ పోతున్నా డు. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 34లక్షలమందికి మాత్రమే సామా జిక పింఛన్లు అందేవి. 34 లక్షలపింఛన్లను 2019నాటికి చంద్రబాబుగ 54లక్షలకు పెంచారు. సామాజిక పింఛన్లసంఖ్య పెంచడమేగాక, గిరిజనప్రాంతాల్లోని వారికి వయసుసడలింపు కల్పించారు. అలానే ట్రాన్స్ జెండర్లకు కొత్తగా పింఛన్లు ఇచ్చారు. టీడీపీప్రభుత్వమే పింఛన్ ని రూ.2వేలకు పెంచింది అనేది వాస్తవం. దానికి సంబంధించిన జీవోలు, వాటిలోని వివరాలు ఈ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అవేవీ ప్రజలకు తెలియకుండా వాటిని ఎందుకు ఆపేశారో ఈ ప్రభుత్వం చెప్పాలి?

రాష్ట్రంలో 53,93,217 పింఛన్లు ఉన్నాయని వైసీపీప్రభుత్వమే సమాచా ర హక్కుచట్టం కింద అడిగినప్రశ్నకు సమాధానం చెప్పింది. వాటిలో వృద్ధుల పింఛన్లు-23,20,378, వికలాంగ పింఛన్లు– 6,32,113, వితంతు పింఛన్లు-19,80,539, ఇతరపిం ఛన్లు – 4,45,188 ఉన్నాయని, ఇవన్నీ టీడీపీప్రభుత్వంలో ఇచ్చినవేనని జగన్ సర్కారే వెల్లడించింది. 5ఏళ్లలో టీడీపీప్రభుత్వం 20లక్షలు పింఛన్లు పెంచింది. ఇన్నివాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వం పింఛన్లపై అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నాయి.

ఒకేసారి రూ.3వేలు ఇస్తానన్న జగన్, దశలవారీగా పింఛన్ సొమ్ము పెంచడం పేదల్ని మోసగించడం కాదా?
అసలు ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు ఇవ్వడం అనేది ప్రారంభించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడు తొలుత రూ.30తో పింఛన్లు ప్రారంభించారు. తరువా చంద్రబాబుగారు వచ్చాక దాన్ని రూ.70కి పెంచారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ మొత్తాన్ని రూ.200లకు పెంచాడు. మరలా విభజనానంతరం ఏపీ పగ్గాలుచేపట్టిన చంద్రబాబుగారు దాన్ని రూ.1000చేశారు. తరువాత ఆయనే దాన్ని రూ.2వేలకు పెంచారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి దాన్ని రూ.3వేలు చేస్తాననిచెప్పి, ముఖ్యమంత్రి అయ్యాక దశలవారీగా పెంచుతానని మాటతప్పాడు. దశలవారీ మద్యపాననిషేధం చూశాం కానీ, ఇలాదశలవారీ పింఛన్ సొమ్ముపెంపు ఇప్పుడే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వెంటనే పింఛన్ సొమ్ముని రూ.3వేలు పెంచకపోవడం వల్ల, రాష్ట్రంలోని ప్రతి పింఛన్ దారుడు ఇప్పటికే రూ.33వేలవరకు నష్టపోయాడు. ఇంకో ఏడాదికి ఆ నష్టం మరింత పెరుగుతుంది.

టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రబడ్జెట్ రూ.లక్షా40వేలకోట్లు, జగన్మోహన్ రెడ్డి వచ్చాక బడ్జెట్ రూ.2లక్షల 29వేలకోట్లు , ఇంతమొత్తంలో బడ్జెట్ పెరిగితే, రాష్ట్రంలో పింఛన్ దారుల సంఖ్య మాత్రం పెరగలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ43నెలల్లో దాదాపు 7.50లక్షలమంది చని పోయారు. వారిలో 70శాతం మందికి పింఛన్లు వచ్చినా, వాటిస్థానంలో ఈ ముఖ్యమంత్రి కొత్త గా ఎందరికి పింఛన్లు ఇచ్చాడు? ఒంటరిమహిళలు, వితంతువులకు ఇచ్చే పింఛన్ వయోపరిమితిని జగన్ 50ఏళ్లకు పెంచి, వారిని దగాచేశాడు. వికలాంగులకు సదరం సర్టిఫికె ట్లు ఇవ్వకుండా, సకాలంలో పింఛన్ అందించకుండా వారిని దగాచేస్తున్నాడు. టీడీపీప్రభు త్వంలో ట్రాన్స్ జెండర్లకు పింఛన్లుఇస్తే, ఈ ప్రభుత్వం వాటినిరద్దుచేసింది. ఈ ముఖ్యమంత్రి, ఒక ఇంట్లో ఒకే పింఛన్ నిబంధనతో ఎంతోమంది అర్హులకు తీరని అన్యాయం చేస్తున్నాడు. 3.50లక్షల పింఛన్లు పొరపాటునరద్దుచేశామని జగన్మోహన్ రెడ్డే చెప్పాడు. పొరపాటు ఏమిటి… ఏదోవంకతో దగాచేయడం. పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం సాల్మన్ ఆరోక్యరాజ్ ఇచ్చిన జీవోని బయటపెట్టాలి. ఆదాయంతో సంబంధం లేకుండా వివిధ అవసరాలకోసం పాన్ కార్డులు తీసుకుంటారు. కానీ ఈప్రభుత్వం పాన్ కార్డ్ ఉన్నవారికి కూడా పింఛన్ రద్దుచేసింది. పింఛన్లకు సంబంధించి ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్ ఇచ్చిన జీవోని ప్రభుత్వం బయటపెట్టాలి. సలహాదారులకు, ప్రభుత్వ ప్రకటనలకు దోచిపెట్టేసొమ్ముతో అర్హులైన ప్రతిఒక్కరికీ జగన్ రెడ్డి పింఛన్లు ఇవ్వవచ్చు. కానీ ఆపని చేయడు. టీడీపీ ప్రభుత్వం డప్పు కళాకారులకు, 50ఏళ్లునిండిన గిరిజనులకు కూడా పింఛన్లు ఇచ్చింది. కొన్నివర్గాలకు రూ.3వేలుగా ఉన్న పింఛన్ ని చంద్రబాబుగారు రూ.5వేలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక, ఆపింఛన్లు ఆపేసి, వారి ముఖాన మట్టి కొట్టా డు. ఈ విధంగా జగన్ అమలుచేసే ప్రతిస్కీమ్ లో మోసమే. ప్రజల్ని దగాచేయడంలో జగన్ ని మించినవారు లేరు. టీడీపీప్రభుత్వం వచ్చినవెంటనే అర్హు లైన ప్రతి ఒక్కరికీ మరలా పింఛ న్ అందిస్తాం.

టీడీపీ ప్రభుత్వం 54 లక్షల పింఛన్లు ఇవ్వలేదని నిరూపిస్తే తమ పార్టీ మూసేస్తాం.. మా సవాల్ స్వీకరించే దమ్ము, ముఖ్యమంత్రికి ఉందా?
ప్రతిపక్షాలను, టీడీపీఅధినేతను తిట్టడంతప్ప, రాష్ట్రానికి, ప్రజలకు ఈముఖ్యమంత్రి ఏం చేశా డు? ఇప్పటికే లక్షలకోట్ల అవినీతికి పాల్పడ్డాడు. సామాజిక సేవ ముసుగులో వైసీపీనేతలు విచ్చలవిడిగా దోపిడీచేస్తున్నారు. రేపు టీడీపీప్రభుత్వం వస్తే, జగన్మోహన్ రెడ్డి దోపిడీపై విచా రణ జరిపిస్తుంది. టీడీపీప్రభుత్వం 54 లక్షల సామాజిక పింఛన్లు ఇవ్వలేదని నిరూపిస్తే, మేం మాపార్టీనే రద్దు చేస్తామని ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. సవాల్ ను స్వీకరిం చే దమ్ము ఆయనకు ఉందా? ఇప్పటికే 6లక్షల పింఛన్ల తొలగింపుకు ప్రభుత్వం నోటిసు లిచ్చింది. రేషన్ కార్డులు రద్దుచేస్తోంది… ప్రతిపక్షఓట్లను రద్దుచేస్తోంది. ఇలా అన్నీ రద్దు చేస్తూ, ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారింది. కాలేజీ, పాఠశాలల విద్యార్థులు, డ్వాక్రామహిళలు, మెప్మాసిబ్బందిని బలవంతంగా జగన్ సభలకు తరలిస్తున్నారు. విద్యా సంస్థలబస్సులు, ఆర్టీసీబస్సుల్ని ప్రజల్ని తరలించడానికి వాడుకుంటున్నారు. ముఖ్య మంత్రి సుందరముఖారవిందంతో ప్రజల కు పంచే కరపత్రాలు, గోడపత్రికలు దేనికోసం?” అని గోరంట్ల ప్రశ్నించారు.

LEAVE A RESPONSE