– ముకుల్ రోహద్గి లాయర్ కు ఇచ్చిన రూ.5 కోట్లతో అన్న క్యాంటిన్ పెట్టి అనేకమంది పేద ప్రజల కడుపునింపొచ్చు
– ఓబులాపురం మైన్స్ ని గాలి జనార్ధన రెడ్డికి ఇవ్వడానికి అభ్యంతరం లేదని పిటిషన్ వేయడం అన్యాయం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరుల సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
‘‘రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని అనవసర కేసులకు వృధా చేస్తున్నారు. ఈ తంతు గత మూడున్నరేళ్ళుగా కొనసాగుతుంది. దేశంలోని ఏ రాష్ట్రమైన న్యాయపరమైన హక్కుల కోసం, ఇతర రాష్ట్రాలతో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ ల సాధనకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రభుత్వ, ప్రైవేటు లాయర్లని నియమించుకుంటారు. ఏ రాష్ట్రమైన అవలంబించే పద్ధతి ఇది.
ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అతని మీద, అతని కుటుంబం మీద ఉన్న సిబిఐ, ఈడి కేసులు వాదిస్తున్న లాయర్లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున కోట్ల రూపాయలు లాయర్లకు ముట్టజెబుతున్నారు. అవసం లేని కేసులలో కూడా వాళ్లని లాయర్లగా ఏపీ ప్రభుత్వం తరపున నియమిస్తున్నారు. వారికి కోట్ల రూపాయల ప్రజాధనం ఫీజులు రూపాన చెల్లిస్తున్నారు. గతంలో అనేకసార్లు ఇది రుజువైంది.
పోలవరం పై గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ కేసును వాదించడానికి అమిత్ షేక్ షింగ్రి అనే ప్రైవేటు లాయర్ ని నియమించారు. అతను ఆ కేసుకు హాజరుకాకపోవడంతో అప్పటికప్పుడు వెంకట్రామయ్యను తీసుకొచ్చారు. ఇలా ఎంతో మందిని లాయర్లుగా నియమించి రాష్ట్ర ప్రజల ధనాన్ని నీళ్ళ లాగా ఖర్చు పెడుతున్నారు. జగన్ రెడ్డి తీరును చూసి సుప్రీం కోర్టే నివ్వెరపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడ ప్రైవేటు లాయర్లని నియమించుకోవడం లేదు. గంటకు లక్షల రూపాయలు ఫీజులు తీసుకొనే లాయర్లని ప్రభుత్వం నియమించింది. ఈ వైఖరికి సుప్రీం కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాయరు ఎవరు? ఎందుకు ఇంత మందిని నియమిస్తున్నారు? ప్రభుత్వం ఖర్చు చేసే లెక్కలపై నోటిసు ఇవ్వాల్సివస్తుందని సుప్రీం కోర్టు బెంచి సీరియస్ కామెంట్స్ చేసింది.
ఎన్ని సార్లు హైకోర్టు, సుప్రీం కోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా చీమ కుట్టినట్లుగాకూడా లేదు. ప్రభుత్వం చేస్తున్న లోపాల్ని ఎన్ని సార్లు ఎత్తి చూపించినా ప్రయోజనంలేదు. జగన్ రెడ్డి వ్యక్తిగత సిబిఐ కేసులని వాదించే లాయర్లంతా ప్రభుత్వ కేసులకు అవసరం లేకపోయినా నియమిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఉంటే ప్రైవేటు లాయర్లని నియమించి సాధించిందేంటో శ్వేత పత్రం విడుదల చేయాలి. అమరావతిని ధ్వంసం చేయడానికి ముఖుల్ రోహిత్ అనే సీనియర్ లాయర్ ని నియమించుకొని 22/01/20220 నాడు జీవొ నెం. 1 ప్రకారం రూ.5 కోట్లు ముట్టచెప్పారు. జీవొలు ఇచ్చి మరీ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఈ విషయంపై జగన్ రెడ్డి వివరణ ఇవ్వాలి.
ఏ కేసుకు ఎంత డబ్బులు చెల్లించారు, వందల కోట్లు ఏ విధంగా ఖర్చు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశంలో ఏ రాష్ట్రం చేయని ఖర్చు ఆంధ్ర రాష్ట్రం చేస్తుందనేది వాస్తవం. జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ లు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్, లాయర్లు లేరా? ఉన్నవాళ్ళు పనికి రారా? సుప్రీం, హైకోర్టులలో ఉన్న కేసులకు జగన్ రెడ్డి సిబిఐ కేసులని వాదించే అడ్వకేట్లని మీరెందుకు తీసుకొస్తున్నారు? నిమ్మగడ్డ కేసు, భారతి సిమెంటు కేసులు, సాక్షి పేపరు కు సంబంధించిని కేసులు వాదించే వారిని ఎందుకు తీసుకొస్తున్నారు? వీటన్నింటికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా రాజధాని అమరావతిని దెబ్బ తీయాలని చూస్తున్నారు. మూల్ ముహిత్ కు ఇచ్చిన 5 కోట్ల రూపాయలతో అన్న క్యాంటిన్ ని పెట్టి ఎంతో మంది పేద ప్రజల కడుపునింపొచ్చు . ప్రతి దాంట్లో అంతులేని అవినీతి జరుగుతుంది.
లాయర్లకి ఇచ్చేది ప్రభుత్వ డబ్బు.. వాదించేది జగన్ రెడ్డి వ్యక్తిగత కేసులు. మూడేన్నరేళ్లలో జగన్ రెడ్డి గెలిచిన కేసు ఒక్కటైనా ఉందా? ఓబుళాపురంలోని లక్ష కోట్ల విలువైన ఖనిజాన్ని దొంగలించి, ఆస్తులన్ని సీజ్ కాబడి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న జగన్ రెడ్డి అన్న గాలి జనార్ధన్ కి మేలు చేయడానికి ప్రైవేటు లాయర్లని పెట్టి ఓబులాపురం మైన్స్ ని గాలి జనార్ధన రెడ్డికి ఇవ్వడానికి అభ్యంతరం లేదని పిటిషన్ వేశారు. ఇది క్విట్ ప్రోకో కాదా, వాటాలు పంచుకొనే తీరు కాదా?
ఏపీ ప్రభుత్వం ఓబుళాపురం కేసులో ఎందుకు పిటిషన్ వేసింది. అసలు ఇన్ని ఏళ్లు ఎందుకు ఆ కేసుని పెండింగ్ పెట్టారు. త్వరితగతిన విచారణ జరిపి నేరస్థులు ఎవరో తెల్చాలని సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. 2012లో జగన్ రెడ్డి మీద పెట్టిన కేసులు కూడ త్వరితగతిన విచారణ జరపాలని కోర్టులు కోరుతున్నాయి. జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేసును ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారో ప్రజలందరికి తెలుసు.
జగన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్ధాయి శివ శంకర్ రెడ్డి తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ షింగ్వీ నిన్న బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అదే అబిషేక్ షింగ్వీ పోలవరం తరపున ప్రభుత్వ డబ్బుతో నియమింపబడ్డాడు. రాష్ట్ర ప్రజల సొమ్ముని వృధా చేస్తున్న తీరుకి నవ్విపోతున్నారు. కోర్టు సమయం వృధా చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజుని సిబిఐ అధికారులు కొట్టిన కేసులు, అమరావతిలో రైతులకు వ్యతిరేకంగా వాదించిన కేసులు అన్ని జగన్ రెడ్డి కనుసన్నలలో తన వ్యక్తిగత కేసులు విచారిస్తున్న లాయర్లకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. వాళ్ళని ఈ విధంగా ఉపయోగించుకోవడం దుర్మార్గమైన చర్య.
రాష్ట్ర ప్రజల ధనాన్ని లూటి చేస్తూ సొంత కేసుల లాయర్లకి ముట్ట చెబుతున్న జగన్ రెడ్డి తీరుని ఖండిస్తున్నాం. 2014 విభజన చట్టంలో హక్కుల్ని సాధించడం కోసం ఏ ఒక్క సీనియర్ లాయర్ ని అయిన నియమించారా. ఎవరి మీద అయిన కేసులు వేశారా? పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి విభజన చట్టంలో మనకు రావాల్సిన ఆస్తులు చాలా ఉన్నాయి. దాని మీద ఏం కేసులు వేశారు. ఒక్క అడ్వకేట్ ని నియమించారు. ఆఖరికి 6.25 కోట్లు కరెంటు బకాయిలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన తరువాత కూడ ఆ డబ్బుల్ని తెచ్చుకోలేని అసమర్ధుడు, చేతకాని దద్ధమ్మ జగన్ రెడ్డి కాదా? రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి, రైల్వేజోన్ గురించి, ఒక ప్లాంటు మీద గాని, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పని మీద ఏ లాయర్ ని నియమించలేద’’ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.