Suryaa.co.in

Andhra Pradesh

దాడులు పథకమేమైనా ప్రవేశపెట్టరా జగన్ రెడ్డి గారూ.?

-నవరాత్రుల సందర్బంగా వైఎస్సార్ దళితులపై దాడులు కానుక పథకమేమైనా ప్రవేశపెట్టరా జగన్ రెడ్డి గారూ.?
• తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ విజయ్ కుమార్ పై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో పరిస్థితి యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టుంది. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న తెలుగుదేశం నేతలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేస్తుంటే ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ గూండాలు జిల్లాల్లో దాడులకు తెగబడుతున్నారు. పుట్టపర్తి సత్యసాయి జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ పై వైసీపీ మూకల మూకల దాడి అమానుషం.

తాడిపత్రి 33వ వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తున్న విజయకుమార్ స్థానిక సమస్యలపై చురుగ్గా పనిచేస్తారని , వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం హేయం. ఉదయం వాకింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విజయకుమార్ ను పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ముందే కాపుగాసిన వైసీపీకి చెందిన నలుగురు ముస్లిం యువకులు అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. దాడిలో విజయ్ కుమార్ గాయపడ్డాడు.

తాడిపత్రిలో రెండు రోజుల వ్యవధిలో దాడి జరగడం ఇది రెండోది. దాడికి గురైన ఇద్దరూ దళితులే. జగన్మోహన్ రెడ్డి దళితులపై కక్ష గట్టారు. మూడేళ్లుగా దళితులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందే కానీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాడిపత్రిలో పెద్దారెడ్డి జగన్ ను మించి నియంతలా వ్యవహరిస్తున్నారు.
తాడిపత్రిలో శాంతి భద్రతలకు పెద్దారెడ్డి, వైసీపీ నేతలు విఘాతం కలిగిస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ జయకేతనం ఎగరేసిందనే అక్కసుతోనే బెదిరించి, భయపెట్టి పెత్తనం చేయాలనుకుంటున్నారు. త్వరలో పెద్దారెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట పడుతుంది. టీడీపీ కౌన్సిలర్ పై దాడి చేసిన వైసీపీ గూండాలపై పోలీసులు కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.

LEAVE A RESPONSE