– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి , పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై జగన్ రెడ్డి తన రౌడీ మూకలతో దాడులు చేయిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాడని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. అర్ధ శతాబ్దంకు పైగా మేలైన వార్తలు అందిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు.
దేశంలోని ఇతర ప్రాంతీయ పత్రికల కంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎంతో నిబద్దతతో ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తూ.. ప్రజల పక్షాన నిలిచినందుకే దాడులు చేస్తున్నారని, పత్రికలపై దాడులు చేయడమంటే వ్యవస్థలపై దాడులు చేయడమేనని దుయ్యబట్టారు.
‘గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సైతం ఈనాడు వార్తలు రాసింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో మంత్రులు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పోతే ఈనాడు కధనాలు ప్రచురించింది. వాటి ఆధారంగా చంద్రబాబు మంత్రులపై చర్యలు తీసుకున్న సంధర్బాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఎన్నడూ వార్తా పత్రికలపై, విలేఖరులపై దాడులు చేయలేదు. నేను ఎమర్జెన్సీలో పోలీసు అధికారిగా పనిచేశాను. ఆనాడు గోయంకాలు, ఇతర పాత్రికేయ పెద్దలు ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ధ్వజమెత్తినా జగన్ రెడ్డిలా ఇందిరా పత్రికల జోలికి పోలేదు. ప్రజాస్వామ్యన్ని కించపరచలేదు.
ఎమర్జెన్సీలో సైతం వార్తా ప్రతికలపై జరగనన్ని దాడులు నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తున్నాం. జగన్ రెడ్డి, ఆయన మంత్రుల అవినీతిపై వార్తలు రాస్తున్నారనే పత్రికలపై దాడులు చేస్తున్నారు. మీడియాపై వైకాపా రౌడీ మూకలు చేస్తున్న దాడులు చూస్తుంటే జగన్ రెడ్డి ఓడిపోతున్నాడనడానికి ప్రబల నిదర్శనంగా కనిపిస్తోందిగా కనిపిస్తోంది. మీడియాపై జరుగుతున్న దాడులపై డీజీపీ వెంటనే స్పందించి దాడులకు పాల్పడుతున్న వైకాపా రౌడీ మూకలపై కేసులు నమోదు చేయాలి. పాణ్యం ఎమ్మెల్యే కాటసానిపై, ఆయన రెచ్చగొట్టి పంపిన రౌడీ మూకలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.