నన్ను గెలిపిస్తారా? బాబును గెలిపిస్తారా?

– కుప్పం ప్రజలకు భువనేశ్వరి సరదా ప్రశ్న
– చిక్కు ప్రశ్నతో మహిళలను ఆట పట్టించిన భువనేశ్వరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆమె టీడీపీ అధినేత సతీమణి. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి ఆమె తరచూ వెళ్లి, అక్కడి ప్రజల బాగోగులు చూస్తుంటారు. అలాగే కుప్పం నుంచి పలువురు నేతలు, వివిధ వర్గాల ప్రజలు పనుల కోసం విజయవాడ-హైదరాబాద్ వచ్చినప్పుడు, వారికి సహాయం చేసేందుకు ఆమె ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. అలాంటి భువనేశ్వరి కుప్పం మహిళలతో భేటీ అయిన సందర్భంలో వారికి ఒక చిక్కు ప్రశ్న వేసి, మొహమాటంలో పడేశారు.

‘‘చంద్రబాబుగారికి 35 ఏళ్ల నుంచి మద్దతునిస్తున్నారు. ఇప్పుడు కుప్పంలో నాకు మద్దతిస్తారా’’? అన్న ప్రశ్నతో మహిళలు ఏం చెప్పాలో తెలియక మొహమాటపడిపోయారు. దానితో తమకు ఇద్దరూ కావాలని తెలివిగా బదులిచ్చారు. అయితే భువనేశ్వరి కూడా అంతే తెలివిగా… ‘అలాకాదు. ఎవరో ఒకరికే మద్దతివ్వాలి. ఒకరి పేరే చెప్పాలి. ఈసారి కుప్పంలో నన్ను గెలిపిస్తారా? చంద్రబాబును గెలిపిస్తారా’అని కాసేపు ఆటపట్టించారు. దానితో మొహమాటపడుతున్న మహిళల అవస్థ చూసి.. ‘నేను నా కంపెనీతో చాలా సంతోషంగా ఉన్నా. నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. ఉత్తిగా సరదాకే అంటున్నా. ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్ద’ని నవ్వుతూ చెప్పారు.

Leave a Reply