Suryaa.co.in

Andhra Pradesh

చీకటి జీవోలు, బ్రిటీష్ చట్టాలతో ప్రజాగ్రహాన్ని ఆపలేవు జగన్ రెడ్డి

– జీవోనెం-01 ముఖ్యమంత్రికి, వైసీపీనేతలకు పూచికపుల్లా?
• జగన్ రెడ్డి అవినీతి, దోపిడీతో ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి.
• హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతలబాటలో బ్రిటీష్ చట్టాలతో ప్రజాగ్రహాన్ని నియంత్రించాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు.
• ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికే జగన్ రెడ్డి, బ్రిటీష్ చట్టం 1861ని ఆధారంచేసుకొని జీవోనెం-01 తీసుకొచ్చాడు.
• జీవోనెం-01 ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నించేవారికే వర్తిస్తుందా.. మదమెక్కి కొట్టుకుంటున్న వైసీపీనేతలకు వర్తించదా?
• ప్రజలు చనిపోతున్నారని జీవో-01 తెచ్చానంటున్న ముఖ్యమంత్రి, గతంలో అధికారమదంతో తాను బలితీసుకున్న కుటుంబాలకు ఏం చెబుతాడు?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

తెలుగుదేశం అధినేతను, పవన్ కల్యాణ్ ని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే జగన్ రెడ్డి బ్రిటీష్ చట్టాలను ఆధారంగా చేసుకొని చీకటిజీవోనెం-01 తీసుకొచ్చాడని, ప్రజల ప్రాణాలు రక్షించడానికే ప్రభుత్వం జీవో తీసుకొస్తే, గతంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అలసత్వం వల్ల బలైన కుటుంబాలకు ఆయనేం న్యాయంచేశాడో సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“జగన్ రెడ్డి నియంత్రత్వ, నిరంకుశ పాలనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యమంత్రి మూడున్నరేళ్లలో చేసిన అవినీతి, దోపిడీతో ప్రజలజీవితాలు తలకిందులయ్యాయి. రాష్ట్ర ప్రజలకు సమస్యలుతప్ప, ఎక్కడా మచ్చుకైనా సంతోషం లేదు. రాష్ట్రంలో ఎటుచూసినా విధ్వంసం, వినాశనమే తప్ప, పేదలకు మంచి జరిగిందిలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, పాలకుల దోపిడీని ఎండగడుతున్న ప్రతిపక్షాలు, మేథాప్రజాసంఘాలు, ప్రజాసంఘాల గొంతునొక్కడం జగన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం. చట్టాలుచేయడం వాటిని ఉల్లఘించడం వైసీపీకి అలవాటైంది. ఆంక్షలు, చట్టాలు, జీవోల పేరుతో ప్రశ్నిస్తున్నవారిని అడ్డుకుంటున్న జగన్ రెడ్డి పాలనని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి, చంద్రబాబుకి లభిస్తున్న ప్రజామద్ధతుని కట్టడిచేయడానికే జగన్ రెడ్డి, నియంతలు హిట్లర్, ముస్సోలిని బాటలో కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. బ్రిటీష్ చట్టం 1861ని ఆధారం చేసుకొని జీవో-01 తీసుకొచ్చి, ప్రశ్నించే గొంతుల్ని తొక్కేస్తున్నాడు.

మహిళలపై హత్యాయత్నం కేసుల పెట్టిన చిత్తూరుఎస్సీ, డీజీపీ సిగ్గుతో తలదించుకోవాలి
7సార్లు కుప్పంలో గెలిచి, 14ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబుకు తన నియోజకవర్గంలో పర్యటించే హక్కులేదా? మాజీ ముఖ్యమంత్రి, ప్రధానప్రతిపక్షనేతను ప్రజల్లోకి వెళ్లకుండా చీకటిజీవోతో అడ్డుకోవడం, ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబుని కలవడానికి వచ్చి న మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టిన డీజీపీ, చిత్తూరుఎస్పీ సిగ్గుతో తలదించుకోవాలి. డీజీపీని హైకోర్టులో నుంచోబెట్టి, సాక్షాత్తూ న్యాయమూర్తే ఐపీసీ సెక్షన్లు చదివించినా కూడా జగన్ ప్రభుత్వానికి సిగ్గురాలేదు. తప్పుడు కేసులు, చీకటిజీవోలు, కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలతో తెలుగుదేశాన్ని కట్టడిచేయలేరు. చీకటిజీవోలతో, నియంత్రత్వ విధానాలతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తే, రాష్ట్రంలో వైసీపీ జెండా కనిపించేదా? జగన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లగలిగేవాడా?

జీవోనెం-01 ముఖ్యమంత్రికి, వైసీపీకి వర్తించదా?
జీవోనెం-01 ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారికే వర్తిస్తుందా.. మదమెక్కి కొట్టుకుంటున్న వైసీపీ నేతలకు వర్తించదా? జీవోనెం-1 ఇచ్చిన మర్నాడే, ముఖ్యమంత్రే రాజమహేంద్రవరంలో ర్యాలీ, బహిరంగసభ నిర్వహించలేదా? అంబులెన్సులు కూడా వెళ్లకుండా రోడ్లను బారికేడ్లతో మూసేయలేదా? స్థానికప్రజలు ప్రభుత్వంపై, పోలీసులపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేయలేదా? విజయనగరంలో మంత్రి బొత్ససత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి చేసిందే మిటి? వారికి పోలీస్ యాక్ట్, జీవోనెం-01 వర్తించవా? నందిగామలో వైసీపీ ఎమ్మెల్సీ నేత్రత్వంలో జాతీయరహదారిపై తాగితందనాలు ఆడిన వైసీపీనేతలు, కార్యకర్తలకు ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవో వర్తించదా?

మాచర్లఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులు రాష్ట్ర రహదారిపై వీరంగం వేసినా వారికి నోజీవో… నో పోలీస్. రావులపాలెంలో వైసీపీఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బహిరంగసభ, త్రిపురాంతకంలో మాజీమంత్రి ఆదిమూలపు సురేశ్ భారీ ర్యాలీ పోలీసులకు కనిపించలేదా? రాజమహేంద్రవరంలో బూడిముత్యాల నాయుడు, జక్కంపూడి రాజా నిర్వహించిన సభసంగతేమిటి? సత్యసాయిజిల్లా ధర్మవరం లో అధికారపార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాసరెడ్డి, భాగ్యలక్ష్మి, నాగరాజులు రోడ్డుపై వేసిన చిందులు ప్రభుత్వానికి, పోలీసులకు కనిపించలేదా? ప్రభుత్వం జీవోనెం – 01 ఇచ్చింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను అడ్డుకోవడానికా? అధికారపార్టీకి మాత్రమే చట్టం చుట్టమా? జీవోనెం – 01 వారికి పూచికపుల్లా?

ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, అలసత్వంతో అమాయకులు బలైనప్పుడు జీవోలు గుర్తురాలేదా?
కందుకూరు, గుంటూరు దుర్ఘటనల్లో ప్రజల ప్రాణాలు పోయేవరకు ఈప్రభుత్వం, పోలీస్, నిఘావ్యవస్థలు ఏంచేస్తున్నాయి? ప్రధానప్రతిపక్షనేత సభలకు భారీగా ప్రజలు వస్తున్న ప్పుడు తగిన భద్రతా ఏర్పాట్లుచేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా? ప్రజలు చనిపోతే జీవోనెం-01 తెచ్చానంటున్న ముఖ్యమంత్రి, గతంలో ఎంతమందిని బలితీసుకున్నాడు? ఎన్నిసార్లు ఆయనపై పోలీసులు కేసులుపెట్టారు? కచ్చులూరు బోటుప్రమాదం, అన్నమ య్య ప్రాజెక్ట్ గేట్లుకొట్టుకుపోయిన దుర్ఘటన, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, జంగారెడ్డి గూడెం కల్తీసారా ఘటనలపై పోలీసులు ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కరోనా వచ్చిన ప్పటినుంచి నిన్నమొన్నటివరకు జగన్ రెడ్డి వైఫల్యం, అలసత్వం, నిర్లక్ష్యం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ఏం న్యాయంచేశాడు? జగన్ రెడ్డి తప్పులు చేయడంలో శిశుపాలుడినే మించిపోయాడు.

అతనికంటే ఘోరమైన దుస్థితి జగన్ ఎదుర్కోబోతున్నాడు. జగన్ రెడ్డి 175/175 లెక్కతేల్చడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి, వైసీపీనేతల సభలు, సమావేశాలకు దగ్గరుండి కాపలాకాస్తున్న పోలీసులు, ప్రతిపక్షాలసభలు, సమావేశా లకు కూడా అదేవిధమైన భద్రతాఏర్పాట్లు చేయాలి. టీడీపీసహా, అన్నిపార్టీల సభలు, సమావేశాలకు ప్రభుత్వం, పోలీసలు సహకరించాల్సిందే. లేకుంటే ప్రజాస్వామ్యపరిరక్షణ కోసం ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడతాయి అని” బొండా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE