నిధులు కేటాయించనప్పుడు ఇక కార్పొరేషన్ ఎందుకు.. మూసేయ్

Spread the love

-ఎస్. సి కార్పొరేషన్ నిధుల పునరుద్దరణ జరిగే వరకూ పోరాటం
– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్

దేశంలో ఏ రాష్ట్రం లో లేని రీతిలో ఎస్. సి కార్పొరేషన్ పధకాలు డైవర్ట్ చేయడం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్. సి కార్పొరేషన్ కి చైర్మన్ గా పని చేసిన ఆర్. డి విల్సన్ అన్నారు.కార్పొరేషన్ ని నిర్వీర్యం చేస్తుంటే గత మూడు ఏళ్ళు గా గళం విప్పుతూనే వున్నా అన్నారు. ప్రభుత్వం లో కదలిక లేదని అన్నారు.దళిత ప్రజా ప్రతినిధులు దళిత ద్రోహులు గా మారారు అని దుయ్య బట్టారు.

N.S.F.DC, NSKFDC నిధులు కేంద్రం నుండి వస్తున్నాయని, మోడీ గారి ద్వారా అందే ఈ నిధులు డైవర్ట్ చేసి ప్రధాని దగ్గరకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి కొంగ జపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్. సి కార్పోరేషన్ కి నిధులు కేటాయించక పోగా.. కేంద్రం ఇచ్చే నిధులు కూడా డైవర్ట్ చేస్తుంటే దళిత నేతలు మౌనంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ మనల్ని క్షమించదన్నారు. హైకోర్ట్ కూడా తీవ్ర మైన వ్యాఖ్యలు చేసిందని నిధులు కేటాయించనప్పుడు ఇక కార్పొరేషన్ ఎందుకు మూసేయ్ మని చెప్పిందని అన్నారు. నవరత్నాల అమలు కు దళితుల నిధులు వాడడం దారుణం అన్నారు. రాబొయ్యే రోజుల్లో బీజేపీ అన్ని జిల్లాల్లో స్పష్ట మైన కార్యాచరణకు సిద్ధం అవుతుంది అన్నారు.ఈ మేరకు బీజేపీ శ్రేణులు సంసిద్ధులు కావాలన్నారు.దళితులు వీధి పోరాటాలకు సైతం సిద్ధం కావాలి అన్నారు. ఇది మన బిడ్డల భవిష్యత్తు అన్నారు.

భూమి కొనుగోలు పథకం, ఆటోలు,ఇన్నోవా, ట్రాక్టర్స్, పండ్ల తోటల పెంపకం, మోటార్ల పంపిణీ, బోరుబావులు ఏర్పాటు, బ్యాంకు తో నిమిత్తం లేని నేరుగా అందే రుణాలు,కంప్యూటర్, నర్సింగ్, డ్రైవింగ్ వంటి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కార్పొరేషన్ ద్వారా అందుతాయనీ..తాను చైర్మన్ గా పని చేసిన కాలంలో కోట్లాది రూపాయలు ఇచ్చానన్నారు.ఇప్పుడు ఏర్పడ్డ చైర్మన్ లు ఇవ్వలేక పోతున్నారంటే అది రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు.
ఇక ఉపేక్షించకూడదు అన్నారు.

Leave a Reply