-పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని సంక నాకించేశారు
-మా అయ్య కట్టాడు నేను పూర్తి చేస్తాను అంటున్నావ్
-మూడు పర్సంటేజీ పూర్తి చేసి పోలవరం డ్యాం ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తావ్ జగన్ రెడ్డి?
-మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి: జగన్‌రెడ్డి పాలన చూసి చివరకు నత్తలు కూడా నవ్వుకుంటున్నాయని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతే దానికి నిదర్శనమన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు సంవత్సరానికి 2.8% పనులు అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. రాజ్యసభ లోక్ సభలో 31 మంది ఎంపీలు ఉండి పోలవరం కు ఖర్చు పెట్టబడిన డబ్బులు 2600 కోట్లు తెచ్చుకోలేని అసమర్ధ దద్దమ్మ నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. హెడ్ వర్క్స్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఎక్కడా పనులు ముందుకు వెళ్లలేదు నిర్వాసితులను నట్టేట గోదావరిలో ముంచేశారు.రైట్ కెనాల్ మీద ఇంకో లిఫ్టు పెట్టి పోలవరం డ్యామ్ ని పోలవరం బ్యారేజ్ చేసి ఒక రిజర్వాయర్ గా 41.15 మీటర్లు 135 అడుగులకు పోలవరం డ్యామ్ ని మ్యారేజ్ గా చేస్తున్నాడు.
డయాఫ్రం వాలు కొట్టుకుపోయి రెండేళ్లు అయింది ఇంతవరకు డిజైన్లు ఫైనల్ అవ్వలేదు డిడిఆర్పి, ఐఐటి హైదరాబాద్, సెంట్రల్ వాటర్ కమిషన్ వీళ్ళందరూ వచ్చి చెప్పేవరకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. 20 జూన్ 20 డిసెంబర్ 21 జూన్ 21 డిసెంబర్ 22 జూన్ 22 డిసెంబర్ 2023 జూన్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి.పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి పోలవరం గురించి మాట్లాడటమే మానేశాడు.జగన్ రెడ్డి నువ్వు ఇన్నిసార్లు ప్రధానమంత్రిని ఆర్థిక మంత్రిని సంబంధిత జలవనరుల శాఖ మంత్రిని కలిశావు ఏమి రిప్రజెంటేషన్ ఇచ్చావు? పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు నాబార్డ్ క్రింద ఖర్చు పెట్టిన డబ్బులు 13500 కోట్లు వచ్చాయి ఇవాళ ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి?దేనికి ఖర్చు పెట్టారు ? అధికారంలోకి వచ్చిన తర్వాత 6వేల కోట్లు వచ్చాయి నిర్వాసితులకు కట్టావా? డాన్ సైట్లో కట్టావా లేదా లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చావా?
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని సంక నాకించేశారు. అమరావతిని చంపేశారు. నిర్వాసితులకు ఇస్తానన్న పది లక్షలు ఇవ్వలేదు ఐదు లక్షలు ఇవ్వలేదు వాళ్లకు ఇచ్చిన 500 కోట్లు జీవో డబ్బులు వాళ్లకు వెళ్లలేదు. అన్ని విధాల పోలవరం ప్రాజెక్టుని ముంచేసిన జగన్ రెడ్డి చరిత్రలో పోలవరం ద్రోహిగా మిగిలిపోతాడు. ప్రాజెక్టులో ఏ పనులు కూడా ముందుకు వెళ్లడం లేదు ఒక సంవత్సరానికి మూడు పర్సంటేజీ పనులు చేయలేని దద్దమ్మ అసమర్ధ ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేస్తదా? మా అయ్య కట్టాడు నేను పూర్తి చేస్తాను అంటున్నావ్ . మూడు పర్సంటేజీ పూర్తి చేసి పోలవరం డ్యాం ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తావ్ జగన్ రెడ్డి?ఇంకా ఎన్ని నెలలు నువ్వు అధికారంలో ఉంటావు!
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంజయ్య . నువ్వు జరుగుతున్న పనులను నాశనం చేసి రివర్స్ టెండర్రింగ్ ద్వారా కమిషన్లు దోచుకుని పోలవరం డ్యామ్ ని పోలవరం బ్యారేజీ చేసి నిర్వాసితులను నట్టేట గోదావరిలో ముంచావు. 960 మెగావాట్ల జల విద్యుత్తు 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకునే అవకాశం 194 టీఎంసీలు నీళ్లు నిలబెట్టే అవకాశం 23 టీఎంసీలు విశాఖకు నీళ్లు ఇచ్చే అవకాశం 80 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి నీళ్లు ఇచ్చే అవకాశం అటువంటి పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టును నాశనం చేసి చరిత్రహీనుడిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారు.