రైతుల మహాపాదయాత్ర స్పందన చూసి జగన్ రెడ్డికి చలిజ్వరం

– మహాపాదయాత్ర రాజకీయ యాత్రకాదు..భావితరాల భవిష్యత్ యాత్ర
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్ రెడ్డికి చలిజర్వం పట్టుకుంది. అందుకే పోలీసులను అడ్డం పెట్టుకుని పాదయాత్రను అడ్డుకుంటున్నారు. మహాపాదయాత్ర రాజకీయ యాత్రకాదు..భావితరాల భవిష్యత్ యాత్ర. వారికి ఎన్నికల కోడ్ ఆపాదించి అడ్డుకోవడం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడమే. అన్నిపార్టీలు, సర్వ మతాల సమ్మేళనంతో రైతులు భాగస్వామ్యమై యాత్రను సాగిస్తున్నారు. జగన్ రెడ్డి చేసిన మోసానికి వైసీపీకి చెందిన రైతులు కూడా బోరుమంటున్నారు. ప్రజలను భయపెట్టి, బారీకేడ్లు పెట్టి రాకుండా చేస్తున్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్ధతు తెలపుతుండటంతో యాత్రను అడ్డుకోవాలన్న వైసీపీ కుట్ర భగ్నమైంది. పాదయాత్రను ప్రజల ముందుకు తీసుకెళ్తున్న మీడియాపైనా పోలీసులు అహం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తాడేపల్లి ఆదేశానుసారమే పాదాయత్రను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అధికార దాహంతో జగన్ పాదయాత్ర చేస్తే..రాష్ట్రం కోసం రైతులు పాదయాత్ర చేస్తున్నారు.
జగన్ రెడ్డిది స్వార్థ పాదయాత్ర అయితే రైతులది నిస్వార్థ పాదయాత్ర. పోలీసుల డ్రస్ లతో సంఘవిద్రోహశక్తులను పంపి విధ్వంసం చేయాలని చూస్తున్నారు. దుర్మార్గపు ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలి. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే రైతులు ఉద్యమం ఆపుతారు. అమరావతిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ సిగ్గుతో తలదించుకోవాలి. మూడు ముక్కల పేరుతో జనాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజధానిపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమయ్యాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చకుని అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించి ప్రజల భవిష్యత్తును కాపాడండి.