• షిక్కటి చిరునవ్వుతో వాలంటీర్లు ప్రతిగడపకు వెళ్లి ఠంచన్ గా ఒకటోతేదీనే పింఛన్లు ఇస్తారన్న జగన్ హామీకి తూట్లు పడ్డాయి
• నేడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పింఛన్ల పంపిణీ కేవలం 36.26 శాతం మాత్రమే
• నాలుగొంతుల్లో ఒకవంతు పింఛన్ పంపిణీ మాత్రమే పూర్తిచేసిన జగన్, మిగిలింది ఇవ్వడానికి అప్పులకోసం ఎదురుచూస్తున్నాడు
• అప్పులు పుడితేనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు
• రూ.3 వేల పింఛన్ ఇస్తానన్నహామీని ఎప్పుడు నిలబెట్టుకుంటావు జగన్ రెడ్డి?
• రూ.3 వేలు ఇవ్వని జగన్ రెడ్డి నిర్వాకంతో పేదలు రూ.27 వేలకోట్లు నష్టపోయారు
– టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
షిక్కటి చిరునవ్వుతో తెల్లవారకముందే వాలంటీర్లు ప్రతిగడపకు వెళ్లి, ఒకటోతేదీన జీతాల మాదిరే ఠంఛన్ గా పింఛన్లు అందిస్తున్నారని చెబుతున్న ముఖ్యమంత్రి మాట లకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పొంతనలేదని, నేడు ప్రభుత్వం కేవలం 36శాతం మాత్రమే పింఛన్ల పంపిణీ చేసిందని మంత్రి బూడి ముత్యాలనాయుడే చెప్పారని, 64 శాతం మందికి పింఛన్లు ఇవ్వలేకపోవడం జగన్ రెడ్డి వైఫల్యంకాదా అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ ఒకటో తేదీన కచ్చితంగా జరిగే చాలా పనులు జగన్ రెడ్డి వచ్చాక నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆపేశాడు. పింఛన్లు ఒకటో తేదీన ఇస్తున్నట్టు డప్పులు కొట్టి, దాని అమల్లో కూడా బొక్కబోర్లా పడ్డాడు. సెక్యూరిటీబాండ్లు వేలంవేస్తే వచ్చే అప్పులు తప్ప, ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయంలేదు. అప్పులు పుడితేనే వృద్ధు లు, వికలాంగులు, వితంతవులు, గిరిజనులు, డప్పు కళాకారులకు పింఛన్లు అందుతాయి.. లేకపోతే లేదు. పింఛన్లు ఇవ్వలేక రకరకాల కారణాలు, ఆంక్షలతో 6 లక్షల మందిని తొలగించి, అర్హులకు నాలుగేళ్లలో జగన్ రెడ్డి తీవ్ర అన్యాయంచేశాడు. ఇది వాస్తవమో కాదో ఆయనే చెప్పాలి. సాక్షి మీడియాకు ప్రకటనలు ఇవ్వడంలో చూపు తున్న ఉత్సాహంలో సగంకూడా జగన్ రెడ్డి, పేదలకు మంచిచేయడంలో చూపలేక పోతున్నాడని తేలిపోయింది. రూ.1700కోట్లసొమ్ము పింఛన్లరూపంలో ఇవ్వలేని జగన్ రెడ్డి, ఇక అసలైన పథకాల్ని ఏం అమలుచేస్తాడు?
బటన్ నొక్కుడుని జగన్ ప్రచార ఆర్భాటంగా మార్చాడు. నాలుగేళ్లు దాటినా రూ.3 వేల పింఛన్ ఇవ్వలేకపోయాడు. రూ.27 వేలకోట్లు పేదలకు ఎగ్గొట్టి, వారిని వంచించాడు
అమ్మఒడి పథకానికి విజయనగరంలో బటన్ నొక్కాడు. ఇప్పటికీ దాదాపు 30 నుంచి 40శాతం తల్లులకు అమ్మఒడి సొమ్ము అందలేదు. కొందరికేమో రూ.4 వేల నుంచి రూ.9వేల వరకు మాత్రమే అందాయి. బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని జగన్ రెడ్డి కేవలం ప్రచార ఆర్భాటంగా మార్చాడు. ఇతరపథకాలకు బటన్ నొక్కుతున్న జగన్ రెడ్డి, పింఛన్ల పంపిణీకి ఎందుకు బటన్ నొక్కడు? ప్రచారంకోసమే వాలంటీర్లను నియ మించి, వారితో తనస్వప్రయోజనాలు కూడా నెరవేర్చుకుంటున్నాడు.
ఎన్నికల సమ యంలో రూ.3వేల పింఛన్ ఇస్తానన్న జగన్, ప్రమాణస్వీకారం చేసినరోజే మాట తప్పా డు. నాలుగేళ్ల పాలన పూర్తయినా ఇప్పటికీ రూ.3వేలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు. నాలుగేళ్లలో పేదలకు ఇవ్వాల్సిన రూ.27 వేలకోట్లు ఎగ్గొట్టాడు. అప్పులు తెస్తున్న సొమ్ము, ప్రజలపై వేస్తున్న భారం తాలూకా సొమ్ము అంతా ఎటుపోతోందో తెలియదు.
సంక్షేమం పేరుతో నాలుగేళ్లలో కేవలం రూ.2.30 లక్షలకోట్లు ఖర్చుపెట్టిన జగన్, అప్పులు తెచ్చిన రూ.7.50లక్షలకోట్లు ఏంచేశాడంటే సమాధానంలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ రెడ్డి అడ్డగోలుగా కాజేసిన ప్రజలసొమ్ము లెక్కలు తేలుస్తాం. పేదలకు రూ.3వేల పింఛన్ ఎప్పుడు ఇస్తాడో జగన్ తక్షణమే సమాధానం చెప్పాలి. రూ.3 వేలు ఇస్తాడా..లేక సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం హామీల్లానే మాటతప్పుతాడా?
ప్రజలకు సక్రమంగా ప్రభుత్వం పథకాలు అందడంలేదు అనడానికి, పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యమే నిదర్శనం
పింఛన్లకు ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆయన పేదలకు రూ.200లు పింఛన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు రూ.2వేలకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వా లు చేయలేనిదాన్ని ఎన్టీఆర్, చంద్రబాబు చేసి చూపించారు. పింఛన్ల పంపిణీని టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ భారంగా భావించలేదు.. బాధ్యతగానే భావించింది. జగన్ రెడ్డి జేబులో సొమ్ము ఇస్తున్నట్టు బాధపడుతున్నాడు. టీడీపీప్రభుత్వం హిజ్రాలకు నెలకు రూ.3వేల పింఛన్ ఇస్తే జగన్ దాన్ని తొలగించాడు. అలానే గిరిజనులు, మత్స్స కారులు, డప్పుకళాకారులకు ఇచ్చే పింఛన్లలో కోతపెట్టాడు. రైతుభరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, నేతన్ననేస్తం, వాహనమిత్ర అన్నిపథకాల్లో అత్తెసరు చెల్లింపులకు పరిమితమయ్యాడు.
వాలంటీర్ వ్యవస్థతో ఠంఛన్ గా ఇస్తున్నానని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లాపడ్డాడు. 45ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్లు ఇస్తానన్న జగన్ ఆ హామీని విస్మరించాడు. రాష్ట్రం అప్పుల కుప్పగామారినా, ప్రజల కు పథకాలు అందడంలేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ప్రభుత్వ సొమ్ముతో బహిరంగసభలు, సమావేశాలు పెట్టి, ప్రజల ముందు ప్రతిపక్షాలను తిట్టడం తప్ప జగన్ రెడ్డికి మరో పనిలేకుండా పోయింది.
చంద్రబాబు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను పరుగులుపెట్టించి, సంపదసృష్టించి, ఆ సొమ్ముతో పేదలకు సంక్షేమ పథకాలు అందించాడు. జగన్ రెడ్డేమో అప్పులుతెస్తే తప్ప ఎవరికీ రూపాయి ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు. జగన్ రెడ్డి పింఛన్లు తొలగించి, తీరని అన్యాయం చేశాడని లక్షలా దిమంది చంద్రబాబు, లోకేశ్ లతో మొరపెట్టుకుంటున్నారు. ప్రచార యావ కోసమే జగన్ రెడ్డి జగనన్న సురక్ష తీసుకొచ్చాడు. దానివల్ల ఎవరికీ ఎలాంటి న్యాయం జరగలేదు.
సాయంత్రం 4 గంటల సమయానికి (ఆగస్ట్ 1) రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా జరిగిన పింఛన్ల పంపిణీ శాతం వివరాలు…
విశాఖపట్నం జిల్లాలో : 18.16 శాతం,
ప్రకాశం జిల్లా : 24.32,
అల్లూరి సీతారామ రాజు జిల్లా : 26.84 శాతం,
కర్నూలు : 26.95,
పల్నాడు : 27.03,
మన్యం జిల్లా : 27.07,
శ్రీ సత్యసాయి : 31.65,
అనకాపల్లి : 32.04,
శ్రీకాకుళం : 32.88,
బాపట్ల : 32.88,
గుంటూరు : 33.45,
ఏలూరు : 34.03,
అన్నమయ్య : 34.44,
అనంత పురం : 36.04,
కాకినాడ : 36.17,
వైఎస్సార్ కడప జిల్లా : 36.38,
నంద్యాల : 36.96,
నెల్లూరు : 38.02,
ఎన్టీఆర్ జిల్లా : 38.47 శాతం,
కోనసీమ 38.95,
పశ్చిమ గోదావరి : 43.01,
తూర్పు గోదావరి : 43.39,
తిరుపతి : 43.64,
కృష్ణాజిల్లా : 48.08,
చిత్తూరు : 41.65శాతం.
మొత్తంగా రాష్ట్రంలో 36.26శాతం మాత్రమే పింఛన్ల పంపిణీ పూర్తైంది.
నాలుగొంతుల్లో ఒకవంతు మాత్రమే పింఛన్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన మూడొం తులు అప్పులు పుడితేనే చెల్లిస్తారు. పింఛన్లకు తోడు రాష్ట్ర ఉద్యోగులు, పింఛన్ దారులకు చెల్లించడానికి రూ.6వేలకోట్లు కావాలి. వారికి ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి.
డాంబికాలు పోకుండా జగన్ రెడ్డి ఇప్పటికైనా తప్ప తెలుసుకోవాలి. పరిపాలన చేతగాక, మోసపుమాటలతో ఎవరినైతే జగన్ వంచిస్తు న్నాడో, వారే వచ్చేఎన్నికల్లో జగన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు.” అని రఫీ తేల్చిచెప్పారు.