– సౌదీ అరేబియాలో కొత్త తరహా రూల్
వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్ సింబల్ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అంతేకాదు ఒకవేళ ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు ఐదేళ్ల వరకు శిక్ష విధిస్తామని సౌదీకి చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. కఠినమైన ఆంక్షలు, నిబంధనలు అమలయ్యే సౌదీ అరేబియాలో తాజాగా ఇలాంటి కొత్త తరహా రూల్‌ను తెచ్చి పెట్టింది అక్కడి ప్రభుత్వం.