ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది
జగన్ జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు
పంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
నాలుగేళ్లు పడుకుని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారు
టీడీపీ పాలనలో లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశాం
సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్
జగన్ విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు
వంశధార-నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీది
పలాస నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం.
పలాసలో కొండలను మింగే అనకొండ అప్పలరాజు
ఆయన కొండల రాజు. కొండలు కొండలే కొట్టేస్తున్నాడు
టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిపై జ్యుడీషియరీ ఎంక్వైరీ
వారందరినీ జైలుకు పంపిస్తా
– పలాస శంఖారావం సభలో యువనేత నారా లోకేష్
దివంగత గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న వంటి యోధులు, శ్రీకాకుళం కీర్తిని జాతీయస్థాయిలో చాటిన కింజరపు ఎర్రనాయుడు వంటి వ్యక్తులను అందించిన గడ్డ శ్రీకాకుళం జిల్లా. నాకు అక్కలు, అన్నలు లేరు. అయితే అన్న ఎన్టీఆర్ 60లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను నాకు ఇచ్చారు
ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నిలిపితే.. జగన్ రెడ్డి గంజాయి కేంద్రంగా మార్చారు. పార్లమెంట్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం తరపున తమ గళాన్ని దీటుగా విన్పిస్తున్నారు. జగన్ రెడ్డి పదేపదే సిద్ధమంటున్నారు. జగన్ జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. పంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
బీసీ బిడ్డ అమర్ నాథ్ గౌడ్ ను కిరాతకంగా చంపారు. ఇంకా ఎంత మంది బీసీ బిడ్డలను చంపడానికి సిద్ధపడ్డావు జగన్? డాక్టర్ సుధాకర్ ను హింసించి చనిపోయేలా చేశారు. మిస్బా లాంటి ఎందరో మైనార్టీలను హింసించి చంపారు. ఇంకా ఎందరు మైనార్టీలను చంపడానికి సిద్ధపడ్డారు జగన్? విశాఖలో వైసీపీ భూకబ్జాలకు సహకరించలేదని ఎమ్మార్వో రమణయ్య ఆత్మహత్య చేసుకునేలా చేశారు. బాపట్ల ఆర్బీకే కేంద్రంలో పనిచేసే పూజితను వేధించి చంపేశారు. విజయనగరం జిల్లాలో జేఈ రామకృష్ణ వైసిపి వేధింపులు తాళలేక ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు.
నాలుగేళ్లు పడుకుని ఇప్పుడు డీఎస్సీ అంటున్నారు. ప్రభుత్వంలో 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి మడమ తిప్పాడు. డీఎస్సీలో కేవలం 6వేల పోస్టులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ పాలనలో లక్షా 30వేల పోస్టులు భర్తీ చేశాం. టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.
సొంత ఛానల్, పేపర్, సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్న వాడు పేదవాడు అవుతాడా? లక్ష రూపాయల చెప్పులు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా?సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశాడు జగన్. సొంతింట్లో మహిళలకే భద్రత లేదంటే ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బ్లూ బటన్ నొక్కి రూ.10వేసి కింద రెడ్ బటన్ తో వంద నొక్కేస్తాడు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ, ఇంటి పన్ను, చెత్త పన్ను, క్వార్టర్ బాటిల్ ను కూడా వదల్లేదు. బూమ్ బూమ్ ను కూడా వదల్లేదు.
టీడీపీ హయాంలోని వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. చంద్రబాబు- పవన్ కలిసి బాబు సూపర్ సిక్స్ రూపొందించడం జరిగింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు టీడీపీ-జనసేన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు అందిస్తాం. 18ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా 1500 ఇస్తాం. ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తాం.
జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు.విశాఖకు ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలకు భూములు కేటాయించాం. జగన్ మాత్రం విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. రైల్వే జోన్ కు భూమి కేటాయించలేదు. మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి మాటతప్పారు.
విశాఖఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసి, జగన్ భూములు కొట్టేయాలని చూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడేలా చర్యలు తీసుకుంటాం. జగన్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వంశధార-నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీది.
ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేసిన ఘనత టీడీపీది. హుద్ హుద్ తుఫాను సమయంలో నాకు మందస మండలం ఇచ్చారు. ఇక్కడి ప్రజలకు న్యాయం చేసిన తర్వాతనే వెనక్కి రావాలని చంద్రబాబు ఆదేశించారు. పలాస నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం. పలాసలో కొండలను మింగే అనకొండ అప్పలరాజు మంత్రి అడ్డంగా దోచేస్తున్నారు. అప్పల్రాజు ఒక్క పని కూడా చేయలేదు. అహంకారానికి మానవ రూపం అప్పల్రాజు.
రైల్ నిలయం పక్కన ఉన్న ఫ్లై ఓవర్ పనులు టీడీపీ హయాంలో ప్రారంభించాం. ఇప్పుడు నిలిపివేశారు. అప్రల్రాజు పేరుకే డాక్టర్. వాస్తవంలో ఆయన మంచి యాక్టర్. ఆయన కొండల రాజు. కొండలు కొండలే తవ్వేస్తున్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. వడ్డీతో సహా కక్కిస్తాం. పలాసలో మంత్రి సీదిరి అప్పల్రాజు యమ స్పీడ్ తో అభివృద్ధిలో ముందుండాలి. కానీ ఒక్క రోడ్డు వేయలేదు, ఫ్లైఓవర్ పూర్తిచేయలేదు. అప్పల్రాజు ఒక్క పని చేయలేదు. అహంకారానికి ప్రతిరూపం రూపం అప్పల్రాజు. అప్రల్రాజు పేరుకే డాక్టర్. ఆయన కొండల రాజు. కొండలు కొండలే కొట్టేస్తున్నాడు.
మంత్రిగారికి ఒక్కటే చెబుతున్నా.. రెండు నెలలు ఓపిక పట్టు బ్రదర్. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. మొత్తం ఎంక్వైరీ వేసి వడ్డీతో సహా కక్కిస్తాం. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే మంత్రి వేధిస్తున్నాడు కొండలరాజు.కేపీ రోడ్లు పనులు పూర్తికాలేదు కానీ.. ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ పనులు మటుకు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తారు. పేదవాడు పేదవాడు అంటాడు. రూ.12కోట్ల విలువైన లాడ్జి ఎలా కొన్నాడో ప్రజలకు చెప్పాలని ఈ సభా ముఖంగా అడుగుతున్నా.
బర్రెల కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని మంత్రి నిరూపించాడు. బర్రెల కొనుగోళ్లలో రూ.2వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేశారు.నువ్వలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో తెలియదు. మంత్రిగారు లాలూచీపడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం చేయలేదు. పలాస నియోజకవర్గంలో ఐదుగురు మహిళలు ఎలా చనిపోయారో తెలియదు. ఎక్కడ చనిపోయారో తెలియదు. శవాలు దొరికాయి. వారి కుటుంబాలకు న్యాయం చేయలేదు.
టీడీపీ- జనసేన ప్రభుత్వం వచ్చాక మొదటి వందరోజుల్లో ఆయా కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా, అంగన్ వాడీ పోస్టు ఉన్నా కూడా అమ్ముకునే వ్యక్తి అప్పల్రాజు. చివరికి పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. టీడీపీ హయాంలో 14వేలు ఉన్న జీడి పిక్క.. నేడు 7వేలకు పడిపోయింది. టీడీపీ అధికారంలోకి వస్తే జీడిపిక్క రైతులను ఆదుకుంటాం, మద్దతు ధర కల్పిస్తాం జీడిపక్క పరిశ్రమలను కూడా ఆదుకుంటాం.
ఆఫ్ షోర్ ప్రాజెక్టును మొదటి మూడేళ్లలో పూర్తిచేస్తాం. కొబ్బరి, జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటుచేస్తాం. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే మంత్రి వేధిస్తున్నాడు. ప్రగతి భవన్ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. బర్రెల కొనుగోళ్లలో కూడా కుంభకోణం చేయవచ్చని మంత్రి నిరూపించాడు. బర్రెల కొనుగోళ్లలో రూ.2వేల కోట్లు లూటీ చేశారు. టిడిపి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.
పలాసలో డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ సెంటర్ ను టీడీపీ ఏర్పాటుచేస్తుంది.ఉత్తరాంధ్రకు సెజ్ ఏర్పాటుచేసి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తాం. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సిక్కోలు వాసులు కనిపిస్తారు. మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే మన ప్రాంతం మారిపోతుంది. మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలలు, బోట్లు, ఐస్ బాక్స్ లు కూడా సబ్సీడీపై ఇవ్వడం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే మత్స్యకారులను గతంలో కంటే రెట్టింపుగా ఆదుకుంటాం.
టీడీపీ నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిచేయలేక చేతులెత్తేశారు. టీడీపీ వచ్చిన వంద రోజుల్లోనే టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తాం. దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం. దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటుచేశాం. చనిపోయిన కార్యకర్తల కుటుంబాల కోసం రూ.100కోట్లు ఖర్చుచేయడం జరిగింది. వారి పిల్లలను కూడా చదివిస్తున్నారు మా తల్లి భువనేశ్వరి.
నాపై 22 కేసులు పెట్టారు, తగ్గేదే లేదు. అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు. చంద్రబాబు గారిని 53రోజులు జైల్లో బంధించారు. భయం మా బ్లడ్ లోనే లేదని చంద్రబాబు చెప్పారు. ఇటీవల నేను చెప్పిన రెడ్ బుక్ విపరీత ప్రచారంలోకి వచ్చింది, నేషనల్ మీడియాలో కూడా రెడ్ బుక్ గురించి చర్చకు వచ్చింది. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిపై జ్యుడీషియరీ ఎంక్వైరీ వేస్తాం. వారందరినీ జైలుకు పంపిస్తామని హామీ ఇస్తున్నా.
శంఖారావం కార్యక్రమం ద్వారా మనం ప్రతి గడపకు వెళ్లాలి. నాలుగు సంవత్సరాల పది నెలలు ఒక ఎత్తు. రెండు నెలలు ఒక ఎత్తు. సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉంది. 5 రూపాయల పేటిఎం బ్యాచ్ మనకు, జనసేన కేడర్ కు సోషల్ మీడియా ద్వారా గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు పార్టీల కార్యకర్తలు అప్రమత్తంగా వారి కుట్రలను తిప్పకొట్టాలి. టిడిపి- జనసేన కేడర్ ను ఇబ్బంది పెట్టే వైసిపి సైకోలకు రాబోయే రోజుల్లో వడ్డీతో సహా చెల్లిస్తా. పార్టీ ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ లాంటి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన కార్యకర్తలకు అధికారంలోకి వచ్చాక మంచి నామినేటెడ్ పదవులు ఇస్తాం. రాబోయే రెండునెలలు కష్టపడండి… రాబోయే అయిదేళ్లలో కార్యకర్తల బాధ్యత నేను చూసుకుంటాను.