Suryaa.co.in

Andhra Pradesh

శ్రీకాకుళం తలరాత మార్చే శక్తి చంద్రబాబుకు ఉంది

ఎక్కడ పడ్డామో అక్కడే లేచినిలబడ్డ వ్యక్తి నారా లోకేష్
వలస జిల్లా అనే పేరు శ్రీకాకుళం జిల్లాకు పోవాలి
వంద రెడ్ బుక్ లు ఉన్నా సరే.. వంద బుక్ లకు న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడుకు ఉంది

– టెక్కలి శంఖారావం సభలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు

అతి చిన్న వయసులో లోకేష్ 3,132 కి.మీ పాదయాత్ర చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి ఎవరైనా ఉన్నారంటే టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. మీ ఊపు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో మరో జెండా ఎగిరే అవకాశమే లేదు. నా ముందున్న ప్రజానీకం చూస్తుంటే టెక్కలి, శ్రీకాకుళంలో టీడీపీ విజయం ఖాయం.

కింజరాపు కుటుంబాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కోట్లు ఖర్చుపెట్టినా రాని అభిమానం కింజరాపు కుటుంబంపై ప్రజలు చూపిస్తున్నారు. 1982లో ఎర్రన్నాయుడు టీడీపీ కండువా కప్పుకుని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ఎర్రన్నాయుడు ఆఖరి శ్వాస వరకు ఇది ఉంది. ఎర్రన్నాయుడు అంటే ఏమిటో దేశానికి తెలియజేశారు. దీనికి కారణం అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీనే.

ఆయన మనల్ని విడిచి వెళ్లిన తర్వాత డబ్బులు, కుర్చీలతో సంబంధం లేదు, ఎర్రన్నాయుడుపై చూపిన ప్రేమాభిమానాలు మాపై చూపితే చాలు. టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం తీసుకువచ్చే వ్యక్తి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టెక్కలిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.కుప్పం తో పోటీపడి టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఐదేళ్లలో రూ.2వేల కోట్లు టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టారు. ఈసారి టీడీపీ ప్రభుత్వంలో మళ్లీ మంత్రి అయితే టెక్కలికి ఇక తిరుగు ఉండదు.

అచ్చెన్నాయుడుకు హోంమంత్రి పదవి ఇస్తే.. వంద రెడ్ బుక్ లు ఉన్నా సరే.. వంద బుక్ లకు న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడుకు ఉంది. అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేస్తే అహర్నిశం చంద్రబాబు గెలుపుకోసం కృషిచేశారు. అలాంటి వ్యక్తి రేపు అధికారంలోకి వస్తే అందరికీ మంచి జరుగుతుంది. అబ్బాయి గా నేను చెప్పడం కాదు.. కార్యకర్తగా అచ్చెన్నాయుడుకు హోంమంత్రి ఇవ్వాలి.

వలస జిల్లా అనే పేరు శ్రీకాకుళం జిల్లాకు పోవాలి. శ్రీకాకుళం తలరాత మార్చే శక్తి చంద్రబాబుకు ఉంది. శ్రీకాకుళం వలసల జిల్లా కాదు.. ఇక్కడకే అందరూ వలస వచ్చేలా చేయాలి. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం కింజరాపు కుటుంబం ఉంటుంది. మాది ఎప్పుడూ పసుపు జెండా పార్టీనే. కింజరాపు కుటుంబం తరపున చంద్రబాబుకు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టెక్కలిలో 50వేల మెజార్టీ తగ్గకుండా అచ్చెన్నాయుడును గెలిపించాలి.

అచ్చెన్నాయుడు ని టార్గెట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆయన ముందు రాజకీయం చేయడం అంటే హనుమంతుడి ముందు కుప్పిగంతలు వేయడమే. వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే. మనం ఢిల్లీలో చక్రం తిప్పుతాం. ఎక్కడ పడ్డామో అక్కడే లేచినిలబడ్డ వ్యక్తి నారా లోకేష్.

మంగళగిరిలో విజయకేతనం ఎగురవేస్తారు. పార్టీని భుజస్కంధాలపై వేసుకుని నడిపించారు. ఆయన కష్టం, నిబద్ధత వల్లే ఇది సాధ్యమైంది. మన ప్రాంతం తరపున లోకేష్ కు సంపూర్ణ మద్దతు ఉంటుంది.

రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు

– టెక్కలి శంఖారావం సభలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కిరణ్ కుమార్

పవన్ కల్యాణ్ ను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. అందుకే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కు ప్రతిఒక్కరు కలిసిరావాలి. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు.ఏటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల ముందు మభ్యపెడుతున్నారు.జనసేన-టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిపోదు. టెక్కలి నియోజకవర్గంలో అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం.

 

LEAVE A RESPONSE