Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఎక్కడన్నా కనిపిస్తున్నారా?

తట్ట మట్టి కూడా వేయని అప్పలరాజు అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి
అవినీతి చేసి పలాస పరువు తీశారు
కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ ఉపయోగపడటం లేదు
తిత్లీ తుపాను సమయంలో బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్
పవన్ కళ్యాణ్ మనతో కలిశాక జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు
జగనన్న బాణం తిరిగి ఆయనకే గుచ్చుకొని కొట్టుమిట్టాడుతున్నాడు
పలాస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు

చాలా రోజుల తర్వాత పలాస ప్రజల పౌరుషం చూస్తున్నాం.ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మోసపోయారు. యువత, మహిళ, రైతులు ఎవరిని అడిగినా సైకో పోవాలి-సైకిల్ రావాలి అంటున్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రం తగలబడి పోయింది. యువతకు 2.30 లక్షల ఉద్యోగాలు లేవు, జాబ్ కేలండర్ లేదు, తాజాగా దగా డీఎస్సీ ప్రకటించారు.

జగన్ రెడ్డి ఎక్కడన్నా కనిపిస్తున్నారా? పరదాలు కట్టుకుని, చెట్లు కొట్టి దొంగచాటుగా వెళ్లే వ్యక్తి జగన్ రెడ్డి. పలాస మెయిన్ రోడ్డులో తట్ట మట్టి కూడా వేయని అప్పలరాజు అక్కడ సెల్ఫీలు తీసుకోవాలి. అడ్డంగా తవ్వేసిన సూదికొండ, నెమలికొండ దగ్గర సెల్ఫీలు దిగాలి.

అడుగడుగునా అవినీతి చేసి పలాస పరువు తీశారు. స్టీల్ కుర్చీల వద్దనుంచి స్టీల్ ప్లాంట్ వరకు నేనే ఎంపీనని అప్పల్రాజుకు చెబుతున్నా. వైసీపీ ఎంపీలు ఎవరో ప్రజలకు తెలుసా? బాబాయి హత్య ఎవరు చేశారో ప్రజలు అందరికీ తెలుసు. విశాఖలో భూకబ్జాలు చేసిన ఎంపీ ఎవరో ప్రజలందరికీ తెలుసు. అశ్లీలంగా వీడియోలు తీయడం, రీల్స్ చేయడం తప్ప వైసీపీ ఎంపీలు చేసింది శూన్యం.

సోషల్ మీడియాలో తప్ప కిడ్నీ ఆసుపత్రి ఎవరికీ ఉపయోగపడటం లేదు. ఎన్నికలకు ముందు ఫోటోలు దిగడానికి తప్ప పేషెంట్లకు ఉపయోగపడని కిడ్నీ సెంటర్ పెట్టారు మంత్రి అప్పలరాజు, అక్కడ నెఫ్రాలజిస్ట్ లేరు. పబ్లిసిటీ కోసమే బిల్డింగులు కట్టి ఓట్లు అడగడానికి వస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి. ఉద్దాన ప్రాంతానికి మొట్టమొదటి ఎర్రన్నాయుడుగారు నీళ్లిచ్చారు, ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా నిధుల్లేవు.

లోకేష్ మంత్రిగా ఉన్నపుడు సుజల స్రవంతి పెట్టి తాగునీటి పథకాలను ఏర్పాటుచేశారు. కక్ష సాధింపు చర్యలకు, భూకబ్జాలకు తప్ప మరో అభివృద్ధి పనికి ప్రాధాన్యత ఇవ్వని వారు ప్రస్తుతం పలాస ఎమ్మెల్యేగా ఉన్నారు. తిత్లీ తుపాను వచ్చినపుడు పొరుగున పర్యటిస్తూ ఇక్కడకు రాని మనసులేని వ్యక్తి జగన్. తిత్లీ తుపాను సమయంలో ఇక్కడే 10 రోజులు ఉండి బాధితులను ఆదుకున్న సమర్థవంత నేత లోకేష్.

మత్స్యకార మంత్రి అప్పలరాజు ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికైనా మేలుచేశాడా? మళ్లీ పలాస అభివృద్ధి జరగాలంటే పలాస ఎమ్మెల్యేగా శిరీషను గెలిపించాలి.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనే రాష్ట్రంతో ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. పవన్ కళ్యాణ్ మనతో కలిశాక జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. జగనన్న బాణం తిరిగి ఆయనకే గుచ్చుకొని కొట్టుమిట్టాడుతున్నాడు. పలాస కేడర్ లో కొత్త ఉత్సాహం నింపిన లోకేషన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు.

పశువుకన్నా హీనమన్న వ్యక్తి ఇక్కడ మంత్రి

– వరహాలగడ్డను పూర్తిచేసింది టిడిపినే.
– పలాస శంఖారావం సభలో నియోజకవర్గ ఇన్ చార్జి గౌతు శిరీష

యువగళంతో అడుగు ముందుకువేసి అన్నివర్గాలకు ఆత్మబంధువయ్యారు యువనేత లోకేష్. అందరినీ కలవాలన్న ఉద్దేశంతో బిజీ షెడ్యూలులో కూడా రోజుకు 3 నియోజకవర్గాల్లో శంఖారావం పూరిస్తున్నారు. టిడిపి కార్యకర్తలను వేధిస్తున్న పశువుకన్నా హీనమన్న వ్యక్తి ఇక్కడ మంత్రిగా ఉన్నారు. కిరాయి గూండాలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.

అయిదేళ్లలో పలాసలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి? చంద్రబాబు తెచ్చిన డయాలసిస్ సెంటర్ ను కిడ్నీ హాస్పటల్ ను వారిదిగా చెప్పుకున్నారు. కనీసం అక్కడ నెఫ్రాలజిస్ట్ లేరు. నియోజకవర్గంలో కొండలన్నింటినీ కరిగించిన ఘనత మీదే. కె టి రోడ్డు పూర్తికాలేదు కానీ, ఆయన ఇంటిముంధు ప్రగతిభవన్ పూర్తయింది. మందస మండలంలో సాగునీటికి ఇబ్బంది లేదంటే గౌతు శివాజీ చేసిన కృషే, వరహాలగడ్డను పూర్తిచేసింది టిడిపినే.

30సంవత్సరాలుగా గౌతు కుటుంబం నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసింది. టిడిపి అభివృద్ధి కళ్లకు కన్పిస్తోంది, రామకృష్ణాపురంలో 2వేల ఇళ్లు కట్టాం. అభివృద్ధి అంటే పనికిరాని జులాయి వెదవలతో మాపై దుష్ప్రచారం చేయడం కాదు. అర్ధరాత్రి జెసిబిలతో ఇళ్లు కూలగొట్టిస్తున్నారు, అయిదేళ్లలో వేధింపులే వారు చేసిన అభివృద్ధి. అయిదేళ్లుగా ఎన్ని వేధింపులు చేసినా కార్యకర్తలు మా వెన్నంటి ఉన్నారు, వారందరికీ పాదాభివందనం.

వజ్రపుకొత్తూరు, పలాస మున్సిపాలిటీల్లో నీటిఎద్దడి తీవ్రంగా ఉంది, మనం అధికారంలోకి వచ్చాక పూర్తిస్తాయిలో పరిష్కరిస్తాం. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అఫ్ షోర్ పూర్తవుతుంది. జీడిపిక్కల వ్యాపారులను పోలీసు కేసులతో వేధిస్తున్నారు, గతంలో 14వేలు ఉన్న రేటు ఇప్పుడు ఏడువేలకు పడిపోయింది. పలాస నియోజకవర్గం నుంచి చాలామంది వలస వెళ్తున్నారు, ఈ ప్రాంత వాసులకు ఆర్మీ పరీక్షలకు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలి.

అరబ్ దేశాలకు వెళ్లే స్థానికులు దళారుల చేతిలో మోసపోతున్నారు,రామ్మోహన్ నాయుడు చొరవతో చాలామంది స్వగ్రామానికి చేరుతున్నారు. పలాసలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ పెట్టి విదేశాలకు వెళ్లేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలి. పలాసలో బిసి స్టడీసర్కిల్స్ ఏర్పాటుచేసి ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించాలి. మత్స్యకారులకు వలలు ఇవ్వలేని చేతగాని మంత్రి ఇక్కడ ఉన్నాడు, అబద్ధాల పత్రికలు, చానళ్లను పెట్టుకుని శునకానందం పొందుతున్నాడు.

వైసీపీ నేతలకు, తాగుబోతులకు కేంద్రాలుగా ఫిష్ మార్టులు తయారయ్యాయి, మత్స్యకారుల కోసం కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేయాలి. యువతకు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను పలాసకు రప్పించండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర యువతకు ఆశాకిరణం, రెండునెలల్లో రాబోయే మన ప్రభుత్వంలో యువతకు భరోసా కల్పించాలి. తిత్లీ సమయంలో మందస వచ్చిన నారా లోకేష్ 12రోజులు ఇక్కడే ఉండి అందించిన సేవలు అనిర్వచనీయం.

స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ ఎక్కడ.. పేపర్లు కొట్టేసిన జగన్ రెడ్డి ఎక్కడ?

– శంఖారావం సభలో పలాస నియోజకవర్గ జనసేన ఇన్ చార్జి వెలిగడ దుర్గారావు

యువగళంలో 3,132 కి.మీ పాదయాత్రచేసి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ ఎక్కడ.. పేపర్లు కొట్టేసిన జగన్ రెడ్డి ఎక్కడ? వచ్చే 60 రోజులు ఇదే ఉత్సాహంతో జనసేన, టీడీపీ శ్రేణులు పనిచేయాలి. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి.శ్రీకాకుళం జిల్లాకు నీరు రాకుండా అన్యాయం చేశాడు. కొత్తూరు రిజర్వాయర్, ఆఫ్ స్టోర్ రిజర్వాయర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.

అప్పల్రాజు అన్నింటిలో దోపిడీ చేశారు. ఏ కొండనూ వదిలిపెట్టలేదు ఈ జంగిల్ రాజ్. 2019లో పోర్ట్ వస్తుందని చెప్పిన అప్పల్రాజు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రోడ్డు నిర్మించలేదు. అప్పల్రాజు వందలకోట్లు అవినీతికి పాల్పడి.. తమకు కావాల్సిన వారికి రోడ్లు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ పోరాటం వల్లే కిడ్నీ యూనిట్, డయాలసిస్ సెంటర్లు వచ్చాయి.

ఈస్ట్ కోస్ట్ కారిడార్ నిర్మించి మత్స్యకారులను ఆదుకోవాలి. జల్ జీవన్ మిషన్ కింద 700 కోట్లు వస్తాయంటున్నాడు, మోడీ ప్రకటించిన పథకంలో భాగంగానే ఆ నిధులు ఎన్నికల చివరలో వచ్చాయి. అభివృద్ధి కావాలంటే జనసేన – టిడిపి ప్రభుత్వం రావాలి. మన ప్రభుత్వం వచ్చాక ఆఫ్ షోర్, మద్దూరు తదితర జలాశయాల పనులన్నీ పూర్తిచేయాలి. జీడి మామిడి రైతులు, సంఘాలకు సబ్సిడీ ఇచ్చి, మద్దతు ధర, గోడౌన్ సౌకర్యం కల్పించాలి. మత్స్యకారుల కోసం విశాఖ – పారాదీప్ కారిడార్ నిర్మించాలి.

 

LEAVE A RESPONSE